విపణిలోకి సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750 విడుదల: ధర రూ. 7.45 లక్షలు

సరికొత్త 2018 సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750 బైకును సుజుకి మోటార్‌‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి లాంచ్ చేసింది. సుజుకి ప్రవేశపెట్టిన ఈ 750సీసీ సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750 ధర రూ. 7.45 లక్షలు

By Anil Kumar

సరికొత్త 2018 సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750 బైకును సుజుకి మోటార్‌‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ విపణిలోకి లాంచ్ చేసింది. సుజుకి ప్రవేశపెట్టిన ఈ 750సీసీ సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750 ధర రూ. 7.45 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750

సరికొత్త సుజుకి జిఎస్ఎక్స్-ఎస్750 బైకును విడి భాగాల రూపంలో దిగుమతి చేసుకుని దేశీయంగా అసెంబుల్ చేసి విక్రయించనుంది. సుజుకి ఇండియా దేశీయంగా అసెంబుల్ చేస్తున్న బైకుల్లో హయాబుసా తరువాత రెండవ అతి పెద్ద మోడల్ జిఎస్ఎక్స్-ఎస్750.

సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750

నూతన జిఎస్ఎక్స్-ఎస్750 మొట్టమొదటి సారిగా 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించబడింది. ఈ మిడిల్ వెయిట్ స్ట్రీట్ మోటార్‌సైకిల్ మీద దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సుజుకి అధీకృత డీలర్ల వద్ద బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. వీటిని వచ్చే మే 2018 నుండి డెలివరీ ఇవ్వనుంది.

సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750

సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750 బైకును రెండు విభిన్నమైన డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్‌లలో ఎంచుుకోవచ్చు. అవి, బ్లాక్ మరియు మెటాలిక్ ట్రిటాన్ బ్లూ లేదా క్యాండీ రెడ్.

సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750

డిజైన్ పరంగా నూతన జిఎస్ఎక్స్ ఎస్750 దీని కంటే పెద్దదైన జిఎస్ఎక్స్-ఎస్1000 బైకునే పోలి ఉంటుంది. ఈ నేక్డ్ మోటార్‌సైకిల్‌లో అగ్రెసివ్ మరియు స్పోర్టివ్ డిజైన్‌తో పాటు షార్ప్ ఫ్రంట్ ఎండ్ ఉంది. బైకు మొత్తాన్ని హైలైట్ చేసే అగ్రెసివ్ హెడ్‌ల్యాంప్, మస్కలర్ ఫ్యూయల్ ట్యాంక్ మరియు ఇంజన్ క్రింది వైపునున్న ఎడ్జీ ఇంజన్ బెల్లీ ప్యాన్ వంటివి ఉన్నాయి.

సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750

అదే విధంగా, పూర్తి స్థాయి డిజిటల్ ఎల్‌సిడి ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, లో ఆర్‌పిఎమ్ అసిస్ట్, ఈజీ స్టార్ట్ సిస్టమ్ మరియు త్రీ లెవల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ వంటి ఫీచర్లు సుజుకి జిఎస్ఎక్స్-ఎస్750లో ఉన్నాయి.

సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750

సరికొత్త సుజుకి జిఎస్ఎక్స్-ఎస్750 బైకులో సాంకేతికంగా 749సీసీ కెపాసిటి గల నాలుగు సిలిండర్ల ఇన్ లైన్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 110బిహెచ్‌పి పవర్ మరియు 81ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750

ప్రపంచ దిగ్గజ సస్పెన్షన్ సిస్టమ్ తయారీ సంస్థ కెవైబి నుండి సేకరించిన ఫ్రంట్ ఫోర్క్స్ మరియు మోనో షాక్ అబ్జార్వర్ అందివ్వడం జరిగింది. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి, జిఎస్ఎక్స్-ఎస్750లో ఫ్రంట్ వీల్‌కు 310ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న ట్విన్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున 240ఎమ్ఎమ్ నిస్సిన్ డిస్క్ బ్రేక్ ఉంది. ఇందులో డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది.

సుజుకి జిఎస్ఎక్స్ ఎస్750

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లోని మిడిల్ వెయిట్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్ నెమ్మదిగా పాపులారిటీ దక్కించుకుంటోంది. విపణిలో ఉన్న ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్, యమహా ఎమ్‌టి-09, కవాసకి జడ్900 మరియు అతి త్వరలో విడుదల కానున్న డుకాటి మోంస్టర్ 821 మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 25, 2018, 16:35 [IST]
English summary
Read In Telugu: New 2018 Suzuki GSX-S750 Launched In India; Priced At Rs 7.45 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+