2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

By Anil Kumar

బ్రిటీష్ మోటార్ సైకిళ్ల తయరీ దిగ్గజం ట్రయంప్ మోటార్‌సైకిల్స్ నేడు(11 మే, 2018) విపణిలోకి సరికొత్త 2018 ట్రయంప్ టైగర్ 1200 బైకును లాంచ్ చేసింది. అత్యంత ఖరీదైన మరియు శక్తివంతమైన ట్రయంప్ టైగర్ 1200 ధర రూ. 17 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

ట్రయంప్ మోటార్‌సైకిల్స్ 2018 ట్రయంప్ టైగర్ 1200 బైకును ఎక్స్‌సిఎక్స్(XCx) అనే మిడ్ వేరియంట్‍‌ను విడుదల చేసింది. ఇది జెట్ బ్లాక్, క్రిస్టల్ వైట్ మరియు మ్యాట్ ఖాకి రంగుల్లో లభిస్తోంది.

2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

సాంకేతికంగా 2018 ట్రయంప్ టైగర్ 1200 బైకులో అదే మునుపటి శక్తివంతమైన 1215సీసీ కెపాసిటి గల ఇన్-లైన్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 141బిహెచ్‌పి పవర్ మరియు 122ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

ఇందులో ఇంజన్ నుండే వచ్చే పవర్ మరియు టార్క్ వెనుక చక్రానికి సులభంగా సరఫరా అయ్యేందుకు బై-డైరక్షనల్ క్విక్-షిఫ్టర్ సిస్టమ్ ఉంది. అంతే కాకుండా, ఈ ఇంజన్‌లో తేలికపాటి బరువున్న ఫ్లైవీల్ మరియు క్రాంక్‌షాఫ్ట్‌తో పాటు నూతన మెగ్నీషియం క్యామ్ కవర్ వంటివి ఉన్నాయి.

2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

మునుపటి టైగర్ 1200 బైకుతో పోల్చుకుంటే 2018 ట్రయంప్ టైగర్ 1200 ఎక్స్‌సిఎక్స్ బరువు ఐదు కిలోల వరకు తక్కువగా ఉంటుంది. అత్యంత శక్తివంతమైన మరియు ఖరీదైన ఈ అడ్వెంచర్ బైకులో అప్‌డేటెడ్ ఫ్రేమ్, నూతన తేలికపాటి బరువున్న ఇంజన్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్ ఉన్నాయి. మునుపటి మోడల్‌తో పోల్చితే 2018 ట్రయంప్ టైగర్ 1200 బైకులో సుమారుగా 100 మార్పులు చోటు చేసుకున్నాయి.

2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

2018 ట్రయంప్ టైగర్ 1200 ఎక్స్‌సిఎక్స్ బైకులో జరిగిన మార్పులు విషయానికి వస్తే, గతంలో ఉన్న ట్రయంప్ ఎక్స్‌ప్లోరర్ బ్రాండ్ పేరును ఇప్పుడు శాశ్వతంగా మార్చేసింది. ట్రయంప్ ఫ్లాగ్‌షిప్ మోడల్ అయిన ఈ బైక్‌కు టైగర్ 800 తరహాలో టైగర్ 1200 పేరును ఖరారు చేసింది.

2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

2018 ట్రయంప్ టైగర్ 1200 బైకులో 5-అంగుళాల పరిమాణంలో ఉన్న ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, బ్యాక్ లైట్ స్విచ్ గేర్, ఆల్ ఎల్ఇడి లైట్లు, అడాప్టివ్ కార్నరింగ్ లైట్లు, కీలెస్ ఇగ్నిషన్ మరియు అప్‌డేటెడ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

అంతే కాకుండా 2018 ట్రయంప్ టైగర్ 1200 బైకులో అధునాతన అప్‌డేటెడ్ ఎలక్ట్రానిక్స్ వచ్చాయి. ఇనర్షియల్ మెసర్మెంట్ యూనిట్, ఆప్టిమైజ్డ్ కార్నరింగ్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, రైడ్-బై-వైర్ థ్రోటిల్ మరియు ఆరు రకాల విభిన్న రైడింగ్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఎలక్ట్రికల్‌గా అడ్జెస్ట్ చేసుకునే విండ్ స్క్రీన్, 12వోల్ట్ పవర్ పోర్ట్స్ మరియు ఆప్షనల్ హీటెడ్ గ్రిప్స్ ఉన్నాయి.

2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

ట్రయంప్ టైగర్ 1200 అడ్వెంచర్ బైకులో సస్పెన్షన్ పరంగా ముందు వైపున 190ఎమ్ఎమ్ ట్రావెల్ గల 48ఎమ్ఎమ్ డబ్ల్యూపి అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డబ్ల్యూపి మోనోషాక్ అబ్జార్వర్ ఉంది. ఇరువైపులా ఉన్న సస్పెన్షన్‌ను అవసరానికి అనుగుణంగా అడ్జెస్ట్ చేసుకునే సౌలభ్యం ఉంది.

2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

అడ్వెంచర్ బైకుల్లో సస్పెన్షన్‌తో పాటు బ్రేకింగి సిస్టమ్ కూడా అంతే ముఖ్యమైనది. ట్రయంప్ టైగర్ 1200 బైకులో ముందు వైపున బ్రెంబో 4-పిస్టన్ కాలిపర్లు గల 305ఎమ్ఎమ్ చుట్టుకొలతలో ఉన్న ట్విన్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున నిస్సిన్ 2-పిస్టన్ కాలిపర్ గల 282ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంది.

2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

2018 ట్రయంప్ టైగర్ 1200 మునుపటి మోడల్‌తో పోల్చితే డిజైన్ మరియు ఫీచర్ల పరంగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అధునాతన అప్‌డేటెడ్ ఇంజన్ విడి భాగాలు గల సరికొత్త టైగర్ 1200 గత మోడల్ కంటే తేలికైనది.

2018 ట్రయంప్ టైగర్ 1200 విడుదల: ధర రూ. 17 లక్షలు

2018 ట్రయంర్ టైగర్ 1200 అడ్వెంచర్ మోటార్ సైకిల్ విపణిలో ఉన్న డుకాటి మల్టీస్ట్రాడా 1200, బిఎమ్‌డబ్ల్యూ ఆర్1200 జిఎస్ మరియు అతి త్వరలో విడుదల కానున్న డుకాటి మల్టీస్ట్రాడా 1260 మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Most Read Articles

English summary
Read In Telugu: 2018 Triumph Tiger 1200 Launched In India; Priced At Rs 17 Lakh
Story first published: Friday, May 11, 2018, 14:02 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X