టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి విడుదల: ధర రూ. 81,490

Written By:

దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ విపణిలోకి మరో పర్ఫామెన్స్ బైక్ అపాచే ఆర్‍‌టిఆర్ 160 4వి(TVS Apache RTR 160 4V) ను లాంచ్ చేసింది. సరికొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4 వి ప్రారంభ వేరియంట్ ధర రూ. 81,490 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

Recommended Video - Watch Now!
హోండా ఎక్స్-బ్లేడ్ 160సీసీ బైక్ రివీల్ | Honda X-Blade - Details & Full Specifications - DriveSpark
టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి

2018 టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకులో అధునాతన డిజైన్ మరియు పలు నూతన ఫీచర్లతో వచ్చింది. అంతే కాకుండా, 160సీసీ మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో ఇదే అత్యంత శక్తివంతమైన మోడల్.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి

2018 టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి మూడు విభిన్న వేరియంట్లలో లభిస్తుంది. అవి, కార్బోరేటర్ విత్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, కార్బోరేటర్ విత్ రియర్ డిస్క్ బ్రేక్ మరియు ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్(EFI) సిస్టమ్ విత్ రియర్ డిస్క్ బ్రేక్. ఈ వేరియంట్ల ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఇవ్వబడ్డాయి.

వేరియంట్ ధర
కార్బోరేటర్/ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ రూ. 81,490
కార్బోరేటర్/ రియర్ డిస్క్ బ్రేక్ రూ. 84,490
ఇఎఫ్ఐ/ రియర్ డిస్క్ బ్రేక్ రూ. 89,990
టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి

2018 టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి స్పెసిఫికేషన్స్

సాంకేతికంగా 2018 టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకులో 159.7సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ 4-వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజన్ కలదు. ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ వేరియంట్ 16.56బిహెచ్‌పి పవర్ మరియు కార్బోరేటెడ్ ఇంజన్ వేరియంట్ 16.28బిహెచ్‌పి పవర్ మరియు 14.8ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి

2018 టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి 0 నుండి 60కిమీల వేగాన్ని EFI వేరియంట్ కేవలం 4.8 సెకండ్లలో మరియు కార్బోరేటర్ వేరియంట్ 4.73 సెకండ్లలో అందుకుంటుంది. అదే విధంగా EFI వేరియంట్ గరిష్ట వేగం గంటకు 114కిమీలు మరియు కార్బోరేటర్ వేరియంట్ గరిష్ట వేగం గంటకు 113కిమీలుగా ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి

2018 టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి డిజైన్ మరియు ఫీచర్లు

సరికొత్త అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకులో 200 4వి ప్రేరణతో తీసుకొచ్చిన డిజైన్ అంశాలు మరియు గ్రాఫిక్స్ ఉన్నాయి. టీవీఎస్ రేస్ వెర్షన్ అపాచే డిఎన్ఎ లక్షణాలతో అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకును నిర్మించారు. అగ్రెసివ్ ఫ్రంట్ డిజైన్, కండలు తిరిగిన ఫ్యూయల్ ట్యాంక్ మరియు పదునైన టెయిల్ సెక్షన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి

2018 అపాచే ఆర్‌టిఆర్ 160 4వి మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతుంది. అవి, రేసింగ్ రెడ్, మెటాలిక్ బ్లూ మరియు నైట్ బ్లాక్. 160 4వి బైకును డబుల్ క్రాడిల్ స్ల్పిట్ సింక్రో స్టిఫ్ ఫ్రేమ్ డిజైన్ ఆధారంగా రూపొందించారు. అంతే కాకుండా ఇందులో ఆర్‌టిఆర్ 200 4వి నుండి సేకరించిన ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, డబుల్ బ్యారెల్ మఫ్లర్ వంటివి ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి మోటార్ సైకిల్‌లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున రేస్ ట్యూన్డ్ మోనో షాక్ అబ్జార్వర్ కలదు. బ్రేకింగ్ విధుల నిర్వర్తించడానికి ముందు వైపున 270ఎమ్ఎమ్ పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక వైపున 200ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంది. కార్బోరేటర్ వేరియంట్లో వెనుక వైపున 130ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ కలదు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సరికొత్త 2018 టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి బైకును ఆపాచే ఆర్‌టిఆర్ 200 4వి ప్రేరణతో సరికొత్త డిజైన్ అంశాలతో శక్తివంతమైన 4-వాల్వ్ ఇంజన్ అందించి రూపొందించారు. దీనికి తోడు అద్భుతమైన రేసింగ్ ప్యాకేజీని కూడా అందించారు.

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 4వి విపణిలో ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160, సుజుకి జిక్సర్, హోండా సిబి హార్నెట్ 160ఆర్ మరియు యమహా ఎఫ్‌జడ్-ఎస్ ఎఫ్ఐ వి2.0 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

English summary
Read In Telugu: 2018 TVS Apache RTR 160 4V Launched In India; Prices Start At Rs 81,490

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark