నార్టన్ కమాండో 961 కఫే రేసర్ విడుదల: ధర రూ. 23 లక్షలు

నార్టన్ మోటార్‌సైకిల్స్ విపణిలోకి కమాండో 961 కఫే రేసర్ బైకును లాంచ్ చేసింది. బ్రిటన్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ నార్టన్ మోటార్‍‌సైకిల్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో తమ కొత్త ఉత్పత్తు

By Anil Kumar

నార్టన్ మోటార్‌సైకిల్స్ విపణిలోకి కమాండో 961 కఫే రేసర్ బైకును లాంచ్ చేసింది. బ్రిటన్ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్థ నార్టన్ మోటార్‍‌సైకిల్స్ ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఆటో ఎక్స్ పో 2018లో తమ కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టి, తొలిసారిగా దేశీయ ఖరీదైన ద్విచక్ర వాహన పరిశ్రమలోకి ప్రవేశించింది.

నార్టన్ మోటార్‌సైకిల్స్ తాజాగా విడుదల చేసిన కమాండో 961 కఫే రేసర్ ప్రారంభ ధర రూ. 23 లక్షలు ఎక్స్-షోరూమ్(పూనే)గా ఉంది.

నార్టన్ కమాండో 961 కఫే రేసర్

నార్టన్ మోటార్‌సైకిళ్లను దేశీయంగా మోటోరాయలే సంస్థ అధికారికంగా డిస్ట్రిబ్యూట్ చేయనుంది. నార్టన్ కంపెనీ బైకుల విడి భాగాలను దిగుమతి చేసుకుని, దేశీయంగా అసెంబుల్ చేసి విక్రయించనున్నట్లు తెలిపింది.

నార్టన్ కమాండో 961 కఫే రేసర్

ప్రస్తుతం నార్టన్ మోటార్‌సైకిల్స్ కమాండో 961 కఫే రేసర్ ఒక్క యూనిట్‌ను మాత్రమే దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉంచింది. రూ. 2 లక్షల బుకింగ్ మొత్తం చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు. డిమాండును బట్టి, భవిష్యత్తులో మరిన్ని యూనిట్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.

నార్టన్ కమాండో 961 కఫే రేసర్

గతంలో, నార్టన్ మోటార్‌సైకిల్స్ మరియు మోటోరాయలే మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఈ ఉమ్మడి భాగస్వామ్యంలో, మోటోరాయలే నార్టన్ బైకులను దేశీయంగా తయారు చేయనుంది. ఈ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో నార్టన్ బైకుల ప్రొడక్షన్ మొదలయ్యే అవకాశం ఉంది.

నార్టన్ కమాండో 961 కఫే రేసర్

కొత్తగా విడుదలైన నార్టన్ కమాండో 961 కఫే రేసర్ ఆధునిక క్లాసిక్ బైక్. డిజైన్ పరంగా చూడటానికి పాత కాలపు కఫే రేసర్ లక్షణాలను కలిగి ఉంది. ఈ బైకులో గుండ్రటి హెడ్‌ల్యాంప్, చిన్న పరిమాణంలో ఉన్న విండ్ స్క్రీన్, మలిచినట్లుగా ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, ఆకర్షణీయమైన టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి.

నార్టన్ కమాండో 961 కఫే రేసర్

కమాండో 961 కఫే రేసర్ బైకులో అల్యూమినియంతో తయారు చేసిన క్లిప్-ఆన్ హ్యాండిల్ బార్ కలదు. మడ్ గార్డ్ మరియు విండ్‌స్క్రీన్లను కార్బన్ ఫైబర్‌తో తయారు చేశారు. బ్రేకింగ్ డ్యూటీ కోసం ముందు వైపున 4-పిస్టన్ బ్రెంబో కాలిపర్ గల 320ఎమ్ఎమ్ డ్యూయల్ డిస్క్ బ్రేకులు మరియు వెనుక వైపున 220ఎమ్ఎమ్ సింగల్ డిస్క్ బ్రేక్ ఉంది.

నార్టన్ కమాండో 961 కఫే రేసర్

సాంకేతికంగా నార్టన్ కమాండో 961 కఫే రేసర్ బైకులో 961సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్ ఎయిర్ లేదా ఆయిల్‌తో చల్లబడే పెట్రోల్ ఇంజన్ ఉంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 78.9బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

నార్టన్ కమాండో 961 కఫే రేసర్

సస్పెన్షన్ విధులను నిర్వర్తించడానికి, ముందు వైపున 43ఎమ్ఎమ్ ఓహ్లిన్స్ అప్‌సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ఓహ్లిన్స్ ట్విన్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. ఇందులో అల్యూమినియం స్పోక్ రిమ్ములు ఉన్నాయి.

నార్టన్ కమాండో 961 కఫే రేసర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బ్రిటన్‌కు చెందిన దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ నార్టన్ మోటార్‌సైకిల్స్ విపణిలోకి నార్టన్ కమాండో 961 కఫే రేసర్ ఆధునిక-క్లాసిక్ మోటార్‌సైకిల్‌ను ఎట్టకేలకు పరిచయం చేసింది. ప్రస్తుతం, కమాండో 961 కఫే రేసర్ మోటార్‌సైకిల్‌కు ఇండియన్ మార్కెట్లో ఎలాంటి పోటీ లేదు. ఏదేమైనప్పటికీ దీనికి దగ్గరగా పోటీనిచ్చే ట్రయంప్ థ్రక్ట్సన్ ఆర్ ధర రూ. 11.92 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

నార్టన్ కమాండో 961 కఫే రేసర్

నార్టన్ మోటార్‌సైకిల్స్ 2021 నాటికి ఇండియన్ మార్కెట్లో 2,000 యూనిట్లను విక్రయించే లక్ష్యంతో ఉన్నట్లు తెలిసింది. దేశీయంగా నార్టన్ మోటార్‌సైకిళ్ల ఉత్పత్తి ప్రారంభమైతే, వీటి ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అంతే కాకుండా, ఎంట్రీ లెవల్ కఫే రేసర్ల సెగ్మెంట్లోకి 650సీసీ కెపాసిటి గల మోడళ్లను ప్రవేశపెట్టే ఆలోచనలో నార్టన్ మోటార్‌సైకిల్స్ ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, April 20, 2018, 9:55 [IST]
English summary
Read In Telugu: Norton Commando 961 Cafe Racer Launched In India; Priced At Rs 23 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+