రాయల్ ఎన్ఫీల్డ్ 650-ట్విన్స్ మోటార్‌సైకిళ్ల విడుదల ఖరారు

దేశీయ అగ్రగామి క్లాసిక్ మోటార్‌సైకిళ్ల తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ అతి త్వరలో ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకుల విడుదలకు సిద్దమైంది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఈ రెండింటినీ 2018 స

By Anil Kumar

దేశీయ అగ్రగామి క్లాసిక్ మోటార్‌సైకిళ్ల తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ అతి త్వరలో ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకుల విడుదలకు సిద్దమైంది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఈ రెండింటినీ 2018 సెప్టెంబర్ 22 నుండి 26 మధ్య విడుదల చేసే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ 650-ట్విన్స్ మోటార్‌సైకిళ్ల విడుదల ఖరారు

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకులను గత ఏడాది ఇటలీలోని మిలాన్ నగర వేదికగా జరిగిన 2017 ఐక్మా మోటార్‌సైకిల్ షోలో ఆవిష్కరించింది. తొలుత ఈ రెండు బైకులు 2018 తొలి సగంలో విడుదలవుతాయని పలు కథనాలు వచ్చినప్పటికీ, ప్రొడక్షన్ సమస్యల వలన వీటి విడుదలను ఆలస్యం చేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ 650-ట్విన్స్ మోటార్‌సైకిళ్ల విడుదల ఖరారు

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ 650 ట్విన్ బైకులను ఆవిష్కరించిన తరువాత అంతర్జాతీయ మార్కెట్లో వీటికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ రెండు 650 బైకులను ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యింది. తొలుత ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా తరువాత కాలిఫోర్నియా మరియు అమెరికా విపణిలో లాంచ్ అయ్యింది.

రాయల్ ఎన్ఫీల్డ్ 650-ట్విన్స్ మోటార్‌సైకిళ్ల విడుదల ఖరారు

చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లోకి 650 ట్విన్ బైకులను విడుదల చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉంది. అంతే కాకుండా, అతి త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీలైనంత వరకు ఎక్కువ మార్కెట్ సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ 650-ట్విన్స్ మోటార్‌సైకిళ్ల విడుదల ఖరారు

పురాతణ రెట్రో-స్టైల్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ శైలి ఆధారంగా ఆధునిక డిజైన్ మరియు టెక్నాలజీ మేళవింపులతో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 బైకును నిర్మించారు. కాంటినెంటల్ జిటి విషయానికి వస్తే, మునుపటి తరానికి చెందిన అదే కఫే రేసేర్ డిజైన్‌ను కలిగి ఉంది. గుండ్రటి హెడ్‌ల్యాంప్స్, పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, సింగల్ సీట్ ఆప్షన్ మరియు క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ 650-ట్విన్స్ మోటార్‌సైకిళ్ల విడుదల ఖరారు

సాంకేతికంగా రెండు మోటార్‌సైకిళ్లలో 650సీసీ కెపాసిటి గల ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్షన్ గల ప్యార్లర్ ట్విన్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 47బిహెచ్‌పి పవర్ మరియు 52ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ 650-ట్విన్స్ మోటార్‌సైకిళ్ల విడుదల ఖరారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి రెండు బైకులు కూడా అటు అంతర్జాతీయ విపణిలో ఇటు దేశీయ మార్కెట్లో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ 650-ట్విన్స్ మోటార్‌సైకిళ్ల విడుదల ఖరారు

దేశీయంగా తయారైన మొట్టమొదటి ట్విన్-సిలిండర్ ఇదే కావడం మరో విషయం. ఈ రెండు బైకులు పూర్తి స్థాయిలో విడుదలైతే, విపణిలో ఉన్న హ్యార్లీడేవిడ్సన్ స్ట్రీట్ 750 మోడల్‌కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. వీటి ప్రారంభ ధర రూ. 3.5 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

Source: ZigWheels

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield 650-Twins To Be Launched Next Month; Details Revealed
Story first published: Tuesday, August 14, 2018, 11:06 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X