Just In
- 13 hrs ago వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- 16 hrs ago ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- 19 hrs ago కారు ప్రియులకు గుడ్‌న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- 22 hrs ago 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
Don't Miss
- News భారీ వర్షం - వాతావరణ శాఖ బిగ్ అలర్ట్..!!
- Sports రోహిత్‌పై గౌరవం..అంతకుమించి ఏం లేదు: పుకార్లపై ప్రీతి జింటా ఫైర్
- Movies ఇంద్రజకు చుక్కలు చూపించిన డైరెక్టర్.. భోరుమని ఏడ్చిన సీనియర్ హీరోయిన్.. ఏం జరిగిందంటే?
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
న.14 నందు రాయల్ ఎన్ఫీల్డ్ 650-ట్విన్స్ మోటార్‌సైకిళ్ల విడుదల
దేశీయ అగ్రగామి క్లాసిక్ మోటార్‌సైకిళ్ల తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ అతి త్వరలో ఇంటర్సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకుల విడుదలకు సిద్దమైంది. తాజాగా అందిన సమాచారం మేరకు, ఈ రెండింటినీ ఈ నెల 14 నందు విడుదల చేయనుందని తెలిసింది.
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకులను గత ఏడాది ఇటలీలోని మిలాన్ నగర వేదికగా జరిగిన 2017 ఐక్మా మోటార్‌సైకిల్ షోలో ఆవిష్కరించింది. ఆర్ఇ 650 ట్విన్ బైకులను కొనే ఆలోచన ఉంటే మీ సమీపంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ దెగ్గర బుక్కింగ్ చేసుకోవచ్చు.
రాయల్ ఎన్ఫీల్డ్ ఈ 650 ట్విన్ బైకులను ఆవిష్కరించిన తరువాత అంతర్జాతీయ మార్కెట్లో వీటికి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ రెండు 650 బైకులను ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యింది. తొలుత ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా తరువాత కాలిఫోర్నియా మరియు అమెరికా విపణిలో లాంచ్ అయ్యింది.
చెన్నైకి చెందిన ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లోకి 650 ట్విన్ బైకులను విడుదల చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఉంది. అంతే కాకుండా, అతి త్వరలో పండుగ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో వీలైనంత వరకు ఎక్కువ మార్కెట్ సొంతం చేసుకోవాలనే ఆలోచనలో ఉంది.
పురాతన రెట్రో-స్టైల్ క్రూయిజర్ మోటార్‌సైకిల్ శైలి ఆధారంగా ఆధునిక డిజైన్ మరియు టెక్నాలజీ మేళవింపులతో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 బైకును నిర్మించారు. కాంటినెంటల్ జిటి విషయానికి వస్తే, మునుపటి తరానికి చెందిన అదే కఫే రేసేర్ డిజైన్‌ను కలిగి ఉంది. గుండ్రటి హెడ్‌ల్యాంప్స్, పెద్ద పరిమాణంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్, సింగల్ సీట్ ఆప్షన్ మరియు క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
సాంకేతికంగా రెండు మోటార్‌సైకిళ్లలో 650సీసీ కెపాసిటి గల ఆయిల్ కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్షన్ గల ప్యార్లర్ ట్విన్ ఇంజన్ కలదు, 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 47బిహెచ్పి పవర్ మరియు 52ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
డ్రైవ్స్పార్క్ తెలుగు అభిప్రాయం!
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి రెండు బైకులు కూడా అటు అంతర్జాతీయ విపణిలో ఇటు దేశీయ మార్కెట్లో విపరీతమైన పాపులారిటీ దక్కించుకున్నాయి.
దేశీయంగా తయారైన మొట్టమొదటి ట్విన్-సిలిండర్ ఇదే కావడం మరో విషయం. ఈ రెండు బైకులు పూర్తి స్థాయిలో విడుదలైతే, విపణిలో ఉన్న హ్యార్లీడేవిడ్సన్ స్ట్రీట్ 750 మోడల్‌కు గట్టి పోటీనిచ్చే అవకాశం ఉంది. వీటి ప్రారంభ ధర రూ. 4 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.