తక్కువ ధరలో విడుదలైన ఆర్ఇ 650 ట్విన్ బైకులు - ధర వింటే ఇప్పుడే బుక్ చేస్తారు.!
క్లాసిక్ లుక్ మరియు అధిక సామర్థ్యం గల బౌకులను దేశీయ మార్కెట్లో విడుదల చేసి ప్రజాదరణ పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ, ఎంతాగానో ఎదురుచూస్తున్న ఇంటర్సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకులను విడుదల చేసింది.

విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 ఢిల్లీ ఎక్స్ శోరం ప్రకారం రూ. 2.50 లక్షలు మరియు కాంటినెంటల్ జిటి 650 బైక్ రూ. 2.65 లక్షల ప్రారంభిక ధరను పొందింది. మార్కెట్లో కవాసకి నింజా 300 బైకులకన్నా అతి తక్కువ ధరలో ఎంట్రీ ఇచ్చింది.

తక్కువ ధరలో విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకులను ఖరిది చెయ్యాలనే ఆలోచన ఉన్నవాళ్లు, మీ సమీపంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ వద్దకు వెళ్లి రూ.5000 ఇచ్చి ప్రి బుక్కింగ్ చేసుకోవచ్చు.

దేశీయ మార్కెట్లోని ద్విచక్ర వాహనల లైన్-అప్లో ఈ రెండు బైకులు ఎక్కువ నిరీక్షణకు పుట్టించటమే కాకుండా, ఈ రెండు బైకులు క్లాసిక్ లుక్ పొందింది. కాంటినెంటల్ జిటి 650 కేఫ్ రేసర్ విన్యాసాన్ని ఆదరిస్తే ఇంక ఇంటర్సెప్టర్ 650 బైక్ స్క్రాంబ్లర్ స్టైల్ విన్యాసాన్ని ఆదరించింది.

బైకుల విన్యాసం
రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టర్ 650 60దశకంలోని ఇంటర్సెప్టర్ బైక్ నుంచి ప్రేరణ పొందటమే కాకుండా బ్రిటిష్ రోడ్స్టర్ మాదరిలో ఆకర్షక లుక్ పొందింది. ఇంక ఇంటర్సెప్టర్ 650 బైక్ క్లిన్-లైన్, క్లాసిక్ టియర్డ్రాప్ ఆకారంలో ఫ్యుయల్ ట్యాంక్ మరియు డైమండ్-క్విల్ట్ ప్యాటర్న్ ట్విన్ సీట్లను ఇవ్వటం జరిగింది.

కేఫ్ రేసర్ విన్యాసాన్ని పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ కాంటినెంటల్ జిటి 650 బైక్ 1950 దశకంలోని కేఫ్ రేసర్ విన్యాసాన్ని ఆదరించింది మరియు, స్కల్ప్టెడ్ ఫ్యూయల్ ట్యాంక్, తూకం నిలువు, రియర్-ఫుట్ పెగ్స్ మరియు హ్యాండల్బార్ పైన క్లిప్ ఇవ్వటం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ బైకుల ధరలు
| Ex Showroom Price | |
| Continenta GT 650 (Standard) | 2,65,000 |
| Continenta GT 650 (Custom) | 2,72,500 |
| Continenta GT 650 (Chrome) | 2,85,000 |
| Interceptor 650 (Standard) | 2,50,000 |
| Interceptor 650 (Custom) | 2,57,500 |
| Interceptor 650 (Chrome) | 2,70,000 |

ఇంజిన్ సామర్థ్యం
రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ బైకులు కొత్త 649సిసి ఏర్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ సహాయంతో 47బిహెచ్పి మరియు 52ఎన్ఎం టార్క్ ఉత్పాదించే శక్తిని పొందింది మరియు ఇంజిన్ 6 స్పీడ్ గేర్బాక్స్ తో జోడణ పొందింది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు 41ఎంఎం టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుకవైపు 110ఎంఎం ట్విన్ కాయిల్-కవర్ షాక్ అబ్సర్బార్ ఇవ్వటమే కాకుండా, 650 ట్విన్ బైకులు 18 అంగుళాల 360 స్పోక్ అల్యూమినియం అలాయ్ వీల్స్ మరియు పిరెల్లి ప్యాంథం స్పోర్ట్కాంప్ టైర్లను ఇవ్వటం జరిగింది.

బైక్ రైడర్స్ సేఫ్టీ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ బైకులలో బైబ్రే (బై బ్రెంబో) సంస్థనుంచి పొందిన 320ఎంఎం మరియు 240ఎంఎం డిస్క్ బ్రేకులను ఇవ్వటమే కాకుండా, డ్యూయల్ ఛానల్ ఏబీఎన్ బ్రేకింగ్ సిస్టంను స్టాండర్డ్ గా ఇచ్చారు.

రంగులు
రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ బైకులు వివిధ మరియు ఆకర్షక రంగులలో ఖరీదుకు సిద్ధంగా ఉంది. ఇంటర్సెప్టర్ 650 బైక్ - మార్క్ త్రి, గ్లిట్టర్ & డస్ట్, ఆరెంజ్ క్రష్, ర్యావిషింగ్ రెడ్, సిల్వర్ స్పెక్ట్రా మరియు బేకర్ ఎక్స్ప్రెస్ అనే 7 రంగులలో ఖరీదుకు లభ్యంగా ఉంది.

ఇంక రాయల్ ఎన్ఫీల్డ్ కాంటేనింటల్ జిటి 650 బైక్ - బ్లాక్ మ్యాజిక్, వెంచురా బ్లు, మిస్టర్ క్లిన్, డా. మేహం మరియు ఐస్ క్వీన్ అనే 5 రంగులలో ఖరీదుకు లభ్యంగా ఉంది.

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!
రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ బైకులు దేశీయ మార్కెట్లో ఎంతగానో నిరీక్షణను పుట్టుంచి, ఇప్పుడు తక్కువ దార్లో విడుదలయ్యి అధిక సంఖ్యలో ప్రజాధారణను పొందుకునే ఆలోచనలో ఉంది. ఈ రెండు బైకులు మార్కెట్లో ఉన్న హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 750 మరియు ట్రయాంఫ్ బోనెవిల్ల్ స్ట్రీట్ ట్విన్ బౌకులకు పోటీ ఇవ్వటానికి సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications








