రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్: ఎంత డబ్బు ఇచ్చినా నన్ను దక్కించుకోలేరు...!!

Written By:

ఇండియన్ మోటార్ సైకిల్ హిస్టరీలో రాయల్ ఎన్ఫీల్డ్ అతి ముఖ్యమైన అధ్యాయం. స్టేటస్‌కు గుర్తుగా రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఎంచుకుంటారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిందే. సింపుల్ స్టైల్ మరియు డైనమిక్ డిజైన్‌‌లో ఉండే రాయల్ ఎన్ఫీల్డ్ మోడళ్లను తలదన్నే బైకులు ఇంకా పుట్టనేలేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

కొన్ని దశాబ్దాల పాటు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఎంతో ఫేవరెట్‌గా ఎంచుకుంటున్న కస్టమర్ల అభిరుచికి ప్రతీకగా క్రిస్టల్ ఎడిషన్‌‌లో రూపొందించిన బుల్లెట్ 350 బైకును ఢిల్లీలోని హెరిటేజ్ ట్రాన్స్‌పోర్ట్ మ్యూజియంలో ప్రదర్శించారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

ప్రతి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ప్రేమికుడిని ఆకట్టుకునే ఈ క్రిస్టల్ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైకు అమ్మకానికి కాదు, కేవలం ప్రదర్శనకు మాత్రమే తయారు చేశారు. బాడీ మొత్తం లెక్కపెట్టలేనన్ని మెరిసే రాళ్లతో ఫినిషింగ్ చేశారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

స్పష్టంగా గమనిస్తే, బైకు మీద ఏ కోణం నుండి చూసినా ఒక క్రమ వరుసలో ఒదిగిపోయిన గుండ్రటి ఆకారంలో గల ప్రకాశవంతమైన రాళ్లను చూడవచ్చు. ఇవి బుల్లెట్ బైకు మొత్తానికి ఒక చక్కటి రూపాన్ని తీసుకొచ్చాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

రాయల్ ఎన్ఫీల్డ్ శ్రేణిలోని బుల్లెట్ బైకులకు ఎన్నో ఏళ్ల నుండి విపరీతమైన ప్రజాదరణ ఉంది. ఇంజన్ నుండి వచ్చే థంప్ శబ్దానికి భారీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటి వరకు మరే ఇతర బైకుల్లో కూడా ఈ శబ్దం రాలేకపోయింది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

కాలం మారే కొద్ది నూతన టెక్నాలజీ అందిస్తూ, అదే రెట్రో డిజైన్ శైలిని కొనసాగిస్తూ, ఇంజన్ నుండి వచ్చే శబ్దంలో ఎలాంటి మార్పులు చేయకుండా రాయల్ ఎన్పీల్డ్ జాగ్రత్తపడుతూ వస్తోంది. ఈ డిజైన్ బైక్ మోడిఫికేషన్ సంస్థలకు కూడా బాగా కలిసొస్తోంది.

Recommended Video - Watch Now!
UM Renegade Commando, Classic, Renegade Sport S India First Look, Specs - DriveSpark
రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

డిజైన్ పరంగా చిన్న చిన్న మార్పులు చోటు చేసుకుంటున్నప్పటికీ, గత దశాబ్ద కాలంగా ప్రపంచ దేశాల్లో అమ్ముడైన అదే ఎగ్జాస్ట్ పైపు ఇప్పటికీ కొనసాగుతోంది. గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్ మరియు పొడవాటి టెయిల్ వైప్ ఎంతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

ఇప్పటి వరకు భూమ్మీద ఎక్కువ కాలం పాటు నిరంతరంగా ఉత్పత్తి అవుతున్న బైకుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఒకటి. సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 మరియు 500సీసీ ఇంజన్ రేంజ్‌లో లభ్యమవుతోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

బుల్లెట్ 350లోని శక్తివంతమైన 346సీసీ ఇంజన్ గరిష్టంగా 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా, బుల్లెట్ 500లోని శక్తివంతమైన 499సీసీ పెట్రోల్ ఇంజన్ 27.1బిహెచ్‌పి పవర్ మరియు 41.4ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. బుల్లెట్ 500 బైకులో ఎలక్ట్రిక్ స్టార్టర్ మరియు డిస్క్ బ్రేకులు స్టాండర్డ్ ఫీచర్లుగా లభిస్తున్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

ఏదేమైనప్పటికీ, ఇలాంటి ఆరంభడమైన కస్టమైజేషన్ మనం సాధారణంగా సూపర్ కార్లు మరియు లగ్జరీ కార్లలో చూస్తుంటాము. కానీ, విక్రయించడానికి కాకుండా మ్యూజియంలో ఏర్పాటు చేసేందుకు బుల్లెట్ 350 బైకు బాడీ మొత్తం క్రిస్టల్స్‌తో డెకరేట్ చేశారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగులో ట్రెండింగ్ స్టోరీలు:

1. రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు ఎందుకు కొనకూడదంటే...?

2. రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో వైబ్రేషన్స్‌కు ఫుల్ స్టాప్!!

3. రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ప్రతి అభిమాని తెలుసుకోవాల్సిన నిజాలు

4. ప్రయోగ దశలోనే ప్రాణాలు తీస్తున్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు

5. బ్రేక్ ప్యాడ్స్ మార్చకపోతే ఏమవుతుంది..?

English summary
Read In Telugu: Royal enfield bullet 350 crystal edition
Story first published: Thursday, March 22, 2018, 13:25 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark