రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 వర్సెస్ కెటిఎమ్ డ్యూక్ 200: టగ్ ఆఫ్ వార్

Written By:

ఇద్దరు వ్యక్తులు లేదా రెండు బృందాలు ఒక తాడును ఇరు వైపులా పట్టుకుని తమ బల ప్రదర్శన చేస్తారు. ఇందులో ఓ టీమ్ బలంగా ఉంటే ఆ టీమ్ గెలుస్తుంది. టగ్ ఆఫ్ వార్‌గా చెప్పుకునే ఈ ఆట గురించి చిన్నప్పటి నుండి అందరికీ తెలిసే ఉంటుంది.

ఇదే ఆటను ఇద్దరు వ్యక్తులు రెండు బైకుల మధ్య పెట్టారు. ఒకవైపు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 మరో వైపు కెటిఎమ్ డ్యూక్ 200. ఈ రెండు బైకుల మధ్య పోటీ కండలు తిరిగిన బలస్థుడికి కండలేక బక్కచిక్కిన వ్యక్తికి మధ్య ఉన్నట్లు అనిపిస్తోంది కదా...? మరి ఈ రెండింటిలో గెలుపెవరిదో వీడియోలో చూద్దాం రండి...

బుల్లెట్ 500, డ్యూక్ 200 మద్య టగ్ ఆఫ్ వార్

కెటిఎమ్ డ్యూక్ 200 బైకులో ఉన్న 200సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 25బిహెచ్‌పి పవర్ మరియు 19.8ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

Recommended Video - Watch Now!
UM Renegade Commando, Classic, Renegade Sport S India First Look, Specs - DriveSpark
బుల్లెట్ 500, డ్యూక్ 200 మద్య టగ్ ఆఫ్ వార్

ఇదే టగ్ ఆఫ్ వార్ పోటీలో ప్రత్యర్థిగా దింపిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 బైకులో ఉన్న 500సీసీ ఫోర్ స్ట్రోక్ గాలితో చల్లబడే పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 27.2బిహెచ్‌పి పవర్ మరియు 41.3ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

బుల్లెట్ 500, డ్యూక్ 200 మద్య టగ్ ఆఫ్ వార్

రెండు బైకులు ప్రొడ్యూస్ చేసే పవర్ మరియు టార్క్ రెండింటిని పోల్చి చూస్తే, డ్యూక్ 200 బైకు అసలు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 బైక్‌కు ఏ మాత్రం పోటీ కాదని తెలుస్తుంది.

బుల్లెట్ 500, డ్యూక్ 200 మద్య టగ్ ఆఫ్ వార్

రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500 తన బరువుతో అస్సలు జంకలేదు, తేలికపాటి బరువున్న డ్యూక్ 200 మాత్రం కాసేపు ఏగిరెగిరి పడింది. ఒకానొక దశలో బుల్లెట్ 500ను లాగలేక వెనక్కి పల్టీలు కొట్టింది.

బుల్లెట్ 500, డ్యూక్ 200 మద్య టగ్ ఆఫ్ వార్

రెండింటి మధ్య సరితూగని మరో పోలిక బరువు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 500తో పోల్చుకుంటే కెటిఎమ్ డ్యూక్ 200 చాలా తక్కువ బరువు ఉంటుంది. అంతే కాకుండా టగ్ ఆఫ్ వార్ పెట్టే ప్రదేశం కూడా ఇసుకతో కాకుండా గట్టి నేల ఉండాలి.

బుల్లెట్ 500, డ్యూక్ 200 మద్య టగ్ ఆఫ్ వార్

రెండు పోలికలేని బైకుల మధ్య టగ్ ఆఫ్ వార్ పెట్టినపుడు కంపెనీ మరియు మోడల్ మాత్రమే కాదు ఆ బైకుల బరువు, వాటి పవర్, టైర్ల కండీషన్, యాక్సిలరేషన్ పొజిషన్ వంటి ఎన్నో అంశాలు దోహదమవుతాయి.

బుల్లెట్ 500, డ్యూక్ 200 మద్య టగ్ ఆఫ్ వార్

ఫన్ కోసం చేసినపుడు ఇలాంటి అంశాలు చాలా మంది పట్టించుకోకపోవచ్చు. అయితే, చేసే ప్రయోగంలో సేఫ్టీ ఫాలో అయ్యి, సురక్షితంగా ఉంటే మంచింది. ఇలాంటి పోటీ అనంతరం బైకులు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంది.

బుల్లెట్ 500, డ్యూక్ 200 మద్య టగ్ ఆఫ్ వార్

బైకుల్లోని క్లచ్ ప్లేట్లు, గేర్లు, మరియు ఇంజన్‌లోని మృదువైన విడి భాగాలు విపరీతమైన యాక్సిలరేషన్ కారు దారుణంగా దెబ్బతింటాయి. ఫన్నీ కోసమని చేస్తే జేబుకు చిల్లులుపడ్డట్లు ఉంటుంది.

ఇక్కడున్న వీడియో చూశారా....? ఎలాగైనా రాయల్ ఎన్ఫీల్డ్ బైకును ఓడించాలనే నెపథ్యంలో కెటిఎమ్ డ్యూక్ 200 రైడర్ మొత్తం యాక్సిలరేట్ చేయడంతో బైకు వెనక్కి పల్టీ కొట్టింది. దాదాపు బైకుతో పాటు రైడర్ కాళ్లు కూడా నలిగిపోయే సందర్భం వచ్చింది. అనవసరపు స్టంట్లు ఎంత అనర్థమో ఈ వీడియో చెబుతుంది. కాబట్టి బైక్ స్టంట్లకు దూరంగా ఉండండి.

English summary
Read In Telugu: Royal Enfield Bullet 500 vs KTM Duke 200 in a tug-of-war
Story first published: Monday, February 12, 2018, 19:21 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark