ఈయన తెలివికి జోహార్లు: బుల్లెట్ బైకులో రివర్స్ గేర్

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు రెండు విషయాలకు బాగా ప్రసిద్ది - ఒకటి క్లాసీ డిజైన్ మరియు మరే ఇతర బైక్‌కు సాధ్యంకాని సైలెన్సర్ సౌండ్. అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయించే అన్ని బైకులు హెవీగా ఉంటాయి. ఇందుకు కారణం, అధిక మొత్తంలో మెటల్ వినియోగించడం మరియు హై కెపాసిటి ఇంజన్‌ ఉండటం.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులో రివర్స్ గేర్

చాలా మందికి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులంటే ఇష్టం ఉన్నప్పటికీ ఎంచుకోవడానికి వెనకాడతారు. భారీ బరువున్న రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను హ్యాండిల్ చేయలేకపోవడం మెయిన్ రీజన్. ప్రత్యేకించి, నగరాల్లో రద్దీ రోడ్ల మీద మరియు పార్కింగ్ ప్రదేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను హ్యాండిల్‌ చేయడంలో తలెత్తే ఇబ్బందులు అన్నీ, ఇన్ని కావు.. ఈ సమస్య దొరికిన పరిష్కారం రివర్స్ గేర్.

Recommended Video - Watch Now!
Shocking Car Accident That Happened In Karunagappally, Kerala
రాయల్ ఎన్ఫీల్డ్ బైకులో రివర్స్ గేర్

నిజమేనండి, ఓ రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్ తన క్లాసిక్ 350 కులో రివర్స్ గేర్ అమర్చుకున్నాడు. జగదీష్ రావల్ అనే వ్యక్తి బుల్లెట్ బైకులో రివర్స్ గేర్‌ను అమర్చుకున్న విషయాన్ని మోటోమహల్ వీడియో ద్వారా వివరించి తమ యూట్యూబ్ ఛానల్లో అప్‌లోడ్ చేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులో రివర్స్ గేర్

సైడ్‌కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి సేకరించిన రివర్స్ గేరును రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్350 బైకులో బిగించారు. ఇందులో న్యూట్రల్ ఫైండర్ కూడా ఉంది. కాబట్టి, రివర్స్ గేర్ వేయడానికి గేర్లను ముందు న్యూట్రల్‌లోకి తీసుకొచ్చి ఆ తరువాత రియర్స్ గేర్ వేయవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులో రివర్స్ గేర్

నిజానికి బైకుల్లో రివర్స్ గేర్ అవసరం ఉండదు, ప్రాక్టికల్‌గా చూసుకుంటే బైకుల్లో రివర్స్ గేర్ ఉండటం ద్వారా కలిగే సమస్యలూ ఎక్కువే. హోండా గోల్డ్ వింగ్ మరియు బిఎమ‌డబ్ల్యూ కె1200ఎల్‌టి వంటి హెవీ బైకుల్లో మాత్రమే రివర్స్ గేర్ అవసరం ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులో రివర్స్ గేర్

ఇండియాలో హై ఎండ్ బైకులు చాలానే ఉన్నాయి. అలాంటి బైకులను ఇరుకైన ప్రదేశాల్లో పార్క్ చేయడం చాలా కష్టతరం. పార్క్ చేసిన బైకులను వెనక్కి తీయాలన్నా కూడా అవే ఇబ్బందులు. కాబట్టి, అలాంటి హెవీ బైకుల్లో రివర్స్ గేర్ తప్పనిసరి.

Trending On DriveSpark Telugu:

మగాళ్ల మతి పోగొట్టిన ముగ్గురు హైదరాబాదీ మహిళలు

రాయల్ ఎన్ఫీల్డ్ ఓనర్ల భరతం పడుతున్న పోలీసులు: వారికి ఇదే సరైన శిక్ష

రాయల్ ఎన్ఫీల్డ్ గురించి ప్రతి అభిమాని తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఆధునిక బైకుల్లో రివర్స్ గేర్ అమర్చడం ఎంతో రిస్క్‌తో కూడుకున్నది. ఎందుకంటే, వాటిలో రివర్స్ గేర్ అమర్చడానికి కావాల్సిన డిజైన్ ఉండకపోవడం. అయితే, ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 బైకు పాతది. ఇందులో ఇంజన్, క్లచ్ మరియు గేర్‌బాక్స్ ప్రత్యేకమైన కేస్ ఉండటంతో రివర్స్ గేర్ అమర్చడం కాస్త సులువయ్యింది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులో రివర్స్ గేర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు నిజానికి హెవీగానే ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో పార్క్ చేయడానికి ఎంతో రిస్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు, ఈ విప్లవాత్మక ఆవిష్కరణ రివర్స్ గేర్ అందుబాటులోకి రావడంతో, ఎలాంటి ప్రదేశాల్లోనైనా పార్కింగ్ చేసిన బైకును ఎంతో తేలికగా బయటకు తీసుకురావచ్చు. ఇండియాలో రివర్స్ గేర్‌ పొందిన తొలి రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఈ బుల్లెట్ 350.

Picture credit: MotoMahal

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: This Royal Enfield Bullet Gets A Reverse Gear

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark