రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్, బుల్లెట్ 350 మరియు ఇఎస్ బైకుల్లో ఏబిఎస్

రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా విక్రయిస్తున్న బైకుల్లో ఎక్కువగా 350 సిరీస్‌ బైకులే ఉన్నాయి. క్లాసిక్ 350, బుల్లెట్ 350 మరియు బుల్లెట్ ఇస్ వంటి మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది మరియు గరిష్ట వి

By N Kumar

రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లో అత్యధికంగా విక్రయిస్తున్న బైకుల్లో ఎక్కువగా 350 సిరీస్‌ బైకులే ఉన్నాయి. క్లాసిక్ 350, బుల్లెట్ 350 మరియు బుల్లెట్ ఇస్ వంటి మోడళ్లకు మంచి డిమాండ్ ఉంది మరియు గరిష్ట విక్రయాలు చేపడుతున్న మోడళ్లు కూడా ఇవే.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఏబిఎస్

కానీ, వీటిలో అత్యంత కీలకమైన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ లేకపోవడంతో... ఈ బైకులు అంత సురక్షితమైనవి కావు అనే దురభిప్రాయం ఉంది. ఏబిఎస్ లేకపోవడంతోనే రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను వద్దనుకుంటున్న కస్టమర్లు ఎందరో... అయితే, ఇక మీదట ప్రతి రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమర్ మా బైకులో కూడా ఏబిఎస్ ఉంది బాసూ అని గర్వంగా చెప్పుకోవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఏబిఎస్

అవును, తాజాగా అందిన సమాచారం మేరకు, రాయల్ ఎన్ఫీల్డ్ తమ అన్ని బైకుల్లో కూడా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నట్లు తెలిసింది. ఏబిఎస్ టెక్నాలజీ మరియు నూతన కలర్ ఆప్షన్లు వచ్చిన సరికొత్త క్లాసిక్ శ్రేణి బైకుల ఫోటోలు రహస్యంగా లీక్ అయ్యాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఏబిఎస్

ఈ కొత్త తరం రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను ఆగష్టు 28, 2018 న విపణిలోకి విడుదల చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. రహస్యంగా లీకైన ఫోటోల ద్వారా ఏబిఎస్ టెక్నాలజీ మరియు నూతన మ్యాట్ పెయింట్ స్కీమ్‌ గుర్తించవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఏబిఎస్

ఈ బైకుల్లో ఎలాంటి క్రోమ్ సొబగులు రావడం లేదు, అయితే హెడ్ ల్యాంప్ బెజెల్ మరియు ఎగ్జాస్ట్ మఫ్లర్ వంటివి బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో రానున్నాయి. వీటి ఫ్యూయల్ ట్యాంక్ మీద ప్రత్యేక నెంబరింగ్ రానుంది. 49 నెంబరును ఆకుపచ్చ బ్యాగ్రౌండ్‌లో తెలుపు మరియు కాషాయం రంగుల్లో అందించారు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఏబిఎస్

అంతర్జాతీయ విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఇప్పటికే ఏబిఎస్ టెక్నాలజీ అందించింది కాబట్టి, చెన్నైకి చెందిన రాయల్ ఎన్ఫీల్డ్‌కు ఇండియన్ మార్కెట్లో తయారయ్యే బైకుల్లో ఏబిఎస్ అందివ్వడం పెద్ద సమస్యేమీ కాకపోవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఏబిఎస్

ప్రస్తుతానికి, రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా లైనప్‌లో క్వాసిక్ 350 అత్యధికంగా అమ్ముడవుతోంది. సగటున దీని నెలవారీ విక్రయాలు ఏకంగా 35,000 యూనిట్లుగా ఉన్నాయి. ఇప్పుడ ఇందులో పరిచయం చేస్తే క్లాసిక్ శ్రేణి బైకుల సేల్స్ మరింత పెరగుతాయనడంలో ఎలాంటి ఆతిశయోక్తి లేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఏబిఎస్

సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ ఏబిఎస్ బైకుల్లో అదే మునుపటి 346సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఏబిఎస్

క్లాసిక్ శ్రేణి బైకుల్లో మెరుగైన భద్రత మరియు పటిష్టమైన బ్రేకింగ్ పనితీరు కోసం రియర్ డిస్క్ బ్రేక్ మరియు డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ అందించే అవకాశం ఉంది. ఏబిఎస్ టెక్నాలజీ ఉన్న వేరియంట్ల ధరల సాధారణ వేరియంట్లతో పోల్చుకుంటే సుమారుగా రూ. 10,000 నుండి రూ. 12,000 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో ఏబిఎస్

తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ తమ అన్ని మోటార్ సైకిళ్లలో ఏబిఎస్ పరిచయం చేయడం మంచి పరిణామం అని చెప్పవచ్చు. ఏప్రిల్ 2019 నుండి దేశీయంగా లభించే దాదాపు అన్ని మోటార్ సైకిళ్లలో ఏబిఎస్ తప్పనిసరిగా ఇవ్వాలని కేంద్రం సూచించింది. ఇందుకు అనుగుణంగా అన్ని టూ వీలర్ల తయారీ సంస్థలు తమ బైకుల్లో ఏబిఎస్ ప్రవేశపెట్టేందుకు ఇప్పటి నుండే కసరత్తులు ప్రారంభించాయి అందులో రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి.

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Classic 350, Bullet 350 And Bullet ES To Get ABS — Launch Date Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X