కొత్త ట్రెండ్ సెట్ చేసిన క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే బైకుతో తలలు పట్టుకుంటున్న రాయల్ ఎన్ఫీల్డ్

రాయల్ ఎన్ఫీల్డ్ గత ఏడాది నవంబరులో క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. దీనితో క్లాసిక్ 500 స్టెల్త్ బ్లాక్ బైకును కూడా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా లైనప్‌లో

By N Kumar

రాయల్ ఎన్ఫీల్డ్ గత ఏడాది నవంబరులో క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. దీనితో క్లాసిక్ 500 స్టెల్త్ బ్లాక్ బైకును కూడా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియా లైనప్‌లో గన్‌మెటల్ గ్రే క్లాసిక్ 350 మోడల్‌కు అత్యధిక డిమాండ్ ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే

యువ కొనుగోలుదారుల నుండి ముప్పై పైబడిన వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరినీ విపరీతంగా ఆకట్టుకుంటున్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే ప్రారంభ ధర రూ. 1,59,677 లు ఎక్స్-షోరూమ్(చెన్నై)గా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే

ఈ మోడల్ క్లాసిక్ 350 బైకు మీద భారీ డిమాండ్ లభించడానికి గల ప్రధాన కారణం, ఇందులోని గన్‌మెటల్ గ్రే కలర్‌ను మ్యాట్ ఫినిషింగ్‌ మరియు ట్యాన్ సీటు. అంతే కాకుండా, ఇందులో వచ్చిన మరో గుర్తించదగిన మార్పు, గన్‌మెటల్ గ్రే మ్యాట్ పెయింట్ స్కీముతో పాటు నూతన స్వింగ్ ఆర్మ్ మరియు రియర్ డిస్క్ బ్రేక్ వంటివి వచ్చాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే

మోడ్రన్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే మోటార్ సైకిల్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే

ఇంజన్ మరియు పవర్

సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే బైకులో 346సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది, 5250ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 19.8బిహెచ్‌పి పవర్ మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే

యాక్సిలరేషన్ మరియు టాప్ స్పీడ్

శక్తివంతమైన ఇంజన్‌కు 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు. క్రూయిజర్ లక్షణాలతో నిర్మించడంతో అవసరానికి తగ్గట్లుగా అత్యుత్తమ పనితీరును కనబరుస్తుంది. గరిష్ట వేగం గంటకు 130కిలోమీటర్లు మరియు 0 నుండి 60కిలోమీటర్ల వేగాన్ని కేవలం ఐదు సెకండ్లలోనే అందుకుంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే

మైలేజ్

ఏఆర్ఏఐ సర్టిఫికేట్ ప్రకారం, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే మోడల్ లీటర్‌కు 37కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. ఇందులో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి 13.5 లీటర్లుగా ఉంది. క్లాసిక్ 350 బైకుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా లాంగ్ రోడ్ ట్రిప్స్ చేయవచ్చు.

Recommended Video

UM Renegade Thor Electric Cruiser Bike India Launch Details, Price, Specifications - DriveSpark
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే

బరువు, బ్రేకింగ్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బరువు 192 కిలోలుగా ఉంది. ఇది ఏ మాత్రం తేలికపాటి బైకు కాదు. సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ ఈ వేరియంట్లో మొదటి సారిగా రెండు వైపులా డిస్క్ బ్రేకులతో వచ్చింది (ముందు 280ఎమ్ఎమ్, వెనుక 240ఎమ్ఎమ్)

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే

ఈ మోటార్ సైకిల్‍‌లో ముందు వైపున 90/90 ఆర్19 మరియు వెనుక వైపున 110/90 ఆర్18 కొలతల్లో ఉన్న టైర్లు ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ నుండి సేకరించిన స్వింగ్ ఆర్మ్ క్లాసిక్ 350లో అందివ్వడం జరిగింది. దీంతో ఏబిఎస్ టెక్నాలజీని అమర్చుకోవచ్చు. 1,370ఎమ్ఎమ్ వీల్ బేస్ మరియు 135ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే బుకింగ్స్ మరియు లభ్యత

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే బైకును రూ. 5,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. దీని మీద 75 రోజుల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంటే బుక్ చేసుకున్న రోజు నుండి సరిగ్గా రెండున్నర నెలల తరువాత డెలివరీ ఇస్తారు. వెయిటింగ్ పీరియడ్ వివిధ ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉండవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే మోడల్ ప్రస్తుతం రాయల్ ఎన్పీల్డ్ యొక్క బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్‌గా నిలిచింది. నూతన పెయింట్ స్కీమ్ మరియు అదనపు రియర్ డిస్క్ బ్రేక్ జోడింపుతో దీని మీద ఎప్పటికప్పుడు డిమాండ్ పెరుగుతోంది. కస్టమర్లు కూడా కొత్తదనాన్ని కోరుకుంటుండటంతో క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే మరియు క్లాసిక్ 500 స్టెల్త్ బ్లాక్ మోటార్ సైకిళ్లకు ఆదరణ ఎక్కువవుతోంది.

క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్ ద్వారా మాతో పంచుకోండి.....

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 గన్‌మెటల్ గ్రే

1. 2018 ఎడిషన్ బజాజ్ పల్సర్ 150 ధరలు లీక్

2.హోండా సిబి హార్నెట్ 160ఆర్ ఏబిఎస్ విడుదల: ధర రూ. 84,675 లు

3.రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 క్రిస్టల్ ఎడిషన్

4.సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఎంట్రీ

5.ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసిన కొడుకు దగ్గర ఫైన్ వసూలు చేసిన పోలీస్...

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Classic 350 Gunmetal Grey: Things To Know About The Highest Selling Bullet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X