రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ ఎడిషన్‌లో మరో సేఫ్టీ ఫీచర్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ రెడ్ ఎడిషన్‌ బైకులో ఇప్పుడు మరో సేఫ్టీ ఫీచర్‌ను పరిచయం చేసింది. రియర్ డిస్క్ బ్రేక్‌తో లభించే రాయల్ ఎన్ఫీల్డ్ రెడ్డిచ్ రెడ్ క్లాసిక్ 350 బైకు ప్రారంభ ధర రూ. 1.47

By N Kumar

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ రెడ్ ఎడిషన్‌ బైకులో ఇప్పుడు మరో సేఫ్టీ ఫీచర్‌ను పరిచయం చేసింది. రియర్ డిస్క్ బ్రేక్‌తో లభించే రాయల్ ఎన్ఫీల్డ్ రెడ్డిచ్ రెడ్ క్లాసిక్ 350 బైకు ప్రారంభ ధర రూ. 1.47 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ ఎడిషన్‌లో మరో సేఫ్టీ ఫీచర్

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 లైనప్‌లో ఇప్పటి వరకు కేవలం గన్‌మెటల్ గ్రే మోడల్‌లో మాత్రమే రియర్ డిస్క్ బ్రేక్ అందించేది. ఏదేమైనప్పటికీ, తమ ఏ మోడల్‌లో కూడా ఇప్పటి వరకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ అందివ్వలేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ ఎడిషన్‌లో మరో సేఫ్టీ ఫీచర్

ఏప్రిల్ 2019 నుండి ప్రతి ద్విచక్ర వాహన తయారీ సంస్థ తమ టూ వీలర్లలో ఏబిఎస్ అందివ్వడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. కాబట్టి, మరో ఏడాదిలో రాయల్ ఎన్ఫీల్డ్ తమ అన్ని ఉత్పత్తుల్లో తప్పనిసరిగా యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ అందించే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ ఎడిషన్‌లో మరో సేఫ్టీ ఫీచర్

రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా తమ రెడ్డిచ్ రెడ్ క్లాసిక్ 350 బైకులో రియర్ డిస్క్ బ్రేక్ అందివ్వడంతో పాటు రియర్ స్వింగ్ ఆర్మ్‌లో స్వల్ప మార్పులు చేసింది. దీంతో అదనంగా డిస్క్ బ్రేక్ అందివ్వడానికి కావాల్సిన స్థలం లభించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ ఎడిషన్‌లో మరో సేఫ్టీ ఫీచర్

వెనుక చక్రానికి 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు, అయితే ఫ్రంట్ వీల్‌కు మాత్రం స్టాండర్డ్ 280ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ ఉంది. రియర్ డిస్క్ బ్రేక్ జోడింపుతో దీని ధర ఇప్పుడు రూ. 8,000 ల వరకు పెరిగింది. పెరిగిన ధర స్వల్పమే కానీ బైక్ బ్రేకింగ్ పనితీరు మరింత మెరుగుపడింది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ ఎడిషన్‌లో మరో సేఫ్టీ ఫీచర్

రాయల్ ఎన్ఫీవ్డ్ ఇండియా లైనప్‌లో అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడళ్లలో క్లాసిక్ 350 సిరీస్ ఒకటి. క్లాసిక్ 350 సిరీస్‌లో ఉన్న అన్ని బైకుల్లో 346సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 రెడ్డిచ్ ఎడిషన్‌లో మరో సేఫ్టీ ఫీచర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 పలు రకాల వేరియంట్లలో లభ్యమవుతోంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల తమ క్లాసిక్ 350 బైకుల్లో ఏబిఎస్ అందించింది. అయితే, వీటిని యూరప్ మరియు అమెరికా వంటి మార్కెట్లలో విక్రయిస్తోంది. దేశీయ విపణిలో కూడా ఏబిఎస్ సేఫ్టీ ఫీచర్‌ గల ఎన్ఫీల్డ్ బైకులు అతి త్వరలో విడుదల కానున్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Classic 350 With Rear Disc Brakes On Redditch Edition
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X