అత్యంత అరుదైన క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్ ఇప్పుడు మార్కెట్లో...

రెండవ ప్రపంచ యుద్ద కాలంలో బ్రిటీష్ యుద్ద సైనికులు ఉపయోగించిన ఫ్లైయింగ్ ఫ్లీ బైకు ప్రేరణతో రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ బైకును ఆవిష్కరించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్‌కు క్లాసిక్

By Anil Kumar

రెండవ ప్రపంచ యుద్ద కాలంలో బ్రిటీష్ యుద్ద సైనికులు ఉపయోగించిన ఫ్లైయింగ్ ఫ్లీ బైకు ప్రేరణతో రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త లిమిటెడ్ ఎడిషన్‌ బైకును ఆవిష్కరించింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్‌కు క్లాసిక్ 500 పెగాసస్ అనే పేరును ఖరారు చేసింది. నిజానికి దీనిని ఇకానిక్ ఆర్‌ఇ/డబ్ల్యూడి 125 మోటార్ సైకిల్ ఆధారంగా నిర్మించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్

ఆర్‌ఇ/డబ్ల్యూడి 125 బైకు రెండవ ప్రపంచ యుద్ద కాలంలో ఫ్లైయింగ్ ఫ్లీ 2-స్ట్రోక్ మోటార్ సైకిల్‌గా బాగా సుపరిచితం. యుద్ద తలంలో సైనికుల కోసం విమానాల్లో తీసుకెళ్లి ఆకాశం నుండి ఈ బైకులను జారవిడిచేవారు. ఇది చాలా తేలికగా ఉంటుంది. అంతే, కాకుండా వీటిని నడపడానికి వీల్లేని భూగాల్లో సైనికులు తమ భుజాల మీద వీటిని మోసుకెళ్లేవారని సమాచారం.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్

చరిత్రలో మంచి గుర్తింపు పొందిన ఈ మోటార్ సైకిల్‌కు ప్రతీకగా, ఫ్లైయింగ్ ఫ్లీ మోటార్ సైకిల్ ప్రేరణతో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ అనే లిమిటెడ్ ఎడిషన్ బైకులను తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,000 యూనిట్ల లిమిటెడ్ ఎడిషన్ క్లాసిక్ 500 పెగాసస్ బైకులను మాత్రమే విక్రయించనుంది. అందులో ఇండియన్ మార్కెట్ కోసం 250 యూనిట్లను కేటాయించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్

ఇంగ్లాడు మార్కెట్లో ఒక్క రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ మోటార్ సైకిల్‌ను 4,999 బ్రిటీష్ పౌండ్లకు అమ్మకానికి ఉంచింది, మన కరెన్సీలో దీని విలువ సుమారుగా 4.5 లక్షల రుపాయలు. అయితే, ఇండియన్ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయించనున్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్ ధర సుమారు రూ. 2 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్

లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్‌లో ఫ్యూయల్ ట్యాంక్, మిలిటరీ శైలిలో ఉన్న క్యాన్వాస్ ప్యానీయర్ బ్యాగులు, లెథర్ పట్టీలు మరియు ట్యాంక్ బ్యాడ్జ్ వంటి ప్రదేశాల్లో అచ్చం ఆర్ఇ/డబ్ల్యూడి 125 లేదా ఫ్లయింగ్ ఫ్లీ బైకు మీద ఉన్నటువంటి పెగాసస్ లోగో (ఎగిరే రెక్కల గుర్రం) అందివ్వడం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్

హ్యాండిల్ బార్, హెడ్‌లైట్ బెజెల్, ఎగ్జాస్ట్ మఫ్లర్, ఇంజన్ మరియు రిమ్ములు వంటివి బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. మరియు అన్ని లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిళ్ల మీద ఒక క్రమ పద్దతిలో కేటాయించిన సీరియల్ నెంబర్ ఫ్యూయల్ ట్యాంక్ మీద ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్

అంతర్జాతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ రెండు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది. అవి, ఆలివ్ డ్రాబ్ గ్రీన్ మరియు సర్వీస్ బ్రౌన్. అయితే, ఇండియన్ మార్కెట్లో లభించే లిమిటెడ్ ఎడిషన్ బైకు కేవలం సర్వీస్ బ్రౌన్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్

సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్ మోటార్‌సైకిల్‌లో 499సీసీ కెపాసిటి గల, గాలితో చల్లబడే, సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 27.2బిహెచ్‌పి పవర్ మరియు 41.3ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మరియు దీని మొత్తం బరువు 194కిలోలుగా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెండవ ప్రపంచ యుద్ద కాలంలో ఉపయోగించిన తేలికపాటి ఫ్లయింగ్ ఫ్లీ అనే మోటార్ సైకిళ్ల ప్రేరణతో రూపొందించిన క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్ బైకులు రెగ్యులర్ క్లాసిక్ బైకులతో పోల్చితే చాలా విభిన్నంగా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,000 యూనిట్లను మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తుండటంతో అరుదైన బైకులను సేకరించే ఔత్సాహికులు దీనిని మిస్ చేసుకోరని చెప్పవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్

ఇది ప్రతి రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికుడిని అమితంగా ఆకట్టుకుంటుంది. 2 లక్షల రుపాయల ధరల శ్రేణిలో విడుదలైతే హాటు కేకుల్లా అమ్ముడుపోవడం ఖాయం అని చెప్పవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్ బైకు గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి...

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్

1.అర్జున్ రెడ్డి మూవీలో ఉపయోగించిన బైకు గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్

2.ఎలక్ట్రిక్ మోటార్‌తో నడిచే బైకులను సిద్దం చేస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్

3.రాయల్ ఎన్ఫీల్డ్ 750 మరియు బజాజ్ డామినర్ మద్య హై స్పీడ్ చేజింగ్

4.మీరు రాయల్ ఎన్ఫీల్డ్ ప్రేమికులా...? అయితే వీటి గురించి మీరు తెలుసుకోవాల్సిందే!!

5.అద్భుతమైన రాయల్ ఎన్ఫీల్డ్ కస్టమైజేషన్స్

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Classic 500 Pegasus Limited Edition Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X