రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ బైకుల ఫ్లాష్ సేల్ రేపే!!

రాయల్ ఎన్ఫీల్డ్ పరిమిత సంఖ్యలో అందుబాటులోకి తీసుకొచ్చిన క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్ మోటార్ సైకిళ్లకు ఆన్‌లైన్ ద్వారా ఫ్లాష్‌ సేల్ నిర్వహిస్తోంది.

By Anil Kumar

ఇంటర్నెట్ వినియోగం బాగా పెరగడంతో ఆన్‌లైన్ విక్రయాలు ఊపందుకున్నాయి. డిమాండ్ ఎక్కువగా ఉన్న వస్తువులకు అయితే భలే క్రేజ్ ఉంటుంది. కంపెనీలు ఈ క్రేజ్‌ను మరియు కస్టమర్ల మధ్య ఉన్న పోటీని క్యాష్ చేసుకోవడానికి ఆన్‌లైన్ ద్వారా ఫ్లాష్ సేల్స్ నిర్వహిస్తుంటారు. ఇండియాలో ఫ్లాష్‌సేల్స్ కేవలం ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఉపకరణాల మీద మాత్రమే ఉంది. ఇప్పుడిది ఆటోమొబైల్స్‌ను కూడా తాకింది.

అవును, రాయల్ ఎన్ఫీల్డ్ పరిమిత సంఖ్యలో అందుబాటులోకి తీసుకొచ్చిన క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్ మోటార్ సైకిళ్లకు ఆన్‌లైన్ ద్వారా ఫ్లాష్‌ సేల్ నిర్వహిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు...

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్

రాయల్ ఎన్పీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్ బైకులను ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,000 యూనిట్లుగా మాత్రమే విక్రయించనుంది. అందులో ఇండియన్ మార్కెట్ కోసం కేవలం 250 యూనిట్లను కేటాయించింది. వీటిని ఎంచుకునేందుకు కస్టమర్ల మధ్య పోటీ ఎక్కువ కావడంతో వీటిని ఫ్లా‌ష్ సేల్ ద్వారా విక్రయించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్

రాయల్ ఎన్ఫీల్డ్ అధికారిక వెబ్‌సైట్లో రేపు (జూలై 25, 2018) సాయంత్రం 4 గంటలకు ఫ్లాష్ సేల్స్ ప్రారంభం కానుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిల్ ధర రూ. 2.49 లక్షలు ఎక్స్-షోరూమ్(మహారాష్ట్ర)గా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్

రెండవ ప్రపంచ యుద్ద కాలంలో బ్రిటీష్ సైనికులు ఉపయోగించిన ఫ్లైయింగ్ ఫ్లీ బైక్ ప్రేరణతో రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త పెగాసస్ 500 లిమిటెడ్ ఎడిషన్‌ బైకును అభివృద్ది చేసింది. RE/WB 125 2-స్ట్రోక్ బైకు రెండవ ప్రపంచ యుద్ద కాలంలో ఫ్లైయింగ్ ఫ్లీ పేరుతో బాగా సుపరిచతం.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్

ఇది చాలా తేలికగా ఉండటంతో రోడ్డు సరిగా లేనపుడు సైనికులు వీటిని భుజాల మీద మోసుకెళ్లేవారని సమాచారం. అంతే కాకుండా, బ్రిటీష్ ఆర్మీ సైనికుల కోసం విమానాల ద్వారా వీటిని తీసుకెళ్లి పారాచూట్ల సాయంతో యుద్ద తలంలోకి జారవిడిచినట్లు చరిత్ర చెపుతోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్

ప్లైయింగ్ ఫ్లీ ప్రేరణతో డిజైన్ చేసిన "పెగాసస్ 500 బైకు" ను నిజానికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ఆధారంగా అభివృద్ది చేశారు. ఇందులో అదే 499సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ పెట్రోల్ ఇంజన్ కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్

5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 27.2బిహెచ్‍‌‌పి పవర్ మరియు 41.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఛాసిస్, బ్రేకులు, ట్రాన్స్‌మిషన్, క్లచ్ మరియు టైర్లలో ఏ విధమైన మార్పులు జరగలేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్

రాయల్ ఎన్ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చిన సరికొత్త పెగాసస్ 500 బైకులో మిలిటరీ స్టైల్లో ఉన్న క్యాన్వాస్ ప్యానీయర్ బ్యాగులు, లెథర్ పట్టీలు మరియు ఫ్యూయల్ ట్యాంక్ మీద అచ్చం ఫ్లయింగ్ ఫ్లీ బైకు మీద ఉన్నటువంటి పెగాసస్(ఎగిరే రెక్కల గుర్రం) లోగో ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్

హ్యాండిల్ బార్, హెడ్‌లైట్ బెజెల్, ఎగ్జాస్ట్ మఫ్లర్, ఇంజన్ మరియు రిమ్ములు వంటివి బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. మరియు అన్ని లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిళ్ల మీద ఒక క్రమ పద్దతిలో కేటాయించిన సీరియల్ నెంబర్ ఫ్యూయల్ ట్యాంక్ మీద ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్

అంతర్జాతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 రెండు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది. అవి, ఆలివ్ డ్రాబ్ గ్రీన్ మరియు సర్వీస్ బ్రౌన్. అయితే, ఇండియన్ మార్కెట్లో విడుదలైన లిమిటెడ్ ఎడిషన్ బైకు కేవలం సర్వీస్ బ్రౌన్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 పెగాసస్ ఎడిషన్

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ లిమిటెడ్ ఎడిషన్ పెగాసస్ 500 మోటార్ సైకిళ్లను చెన్నైలో ఉన్న తయారీ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది. ఇండియాలో రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 బైకుతో పాటు పెగాసస్ ఎడిషన్ హెల్మెట్, ప్యానియర్ బ్యాగులు, టీ-షర్ట్ వంటి యాక్ససరీలు లభిస్తాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Classic 500 Pegasus Online Sale — New Date Announced
Story first published: Tuesday, July 24, 2018, 17:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X