రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ బుకింగ్స్ ప్రారంభం

రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల విపణిలోకి తమ క్లాసిక్ 350 మోడల్‌ను ఏబిఎస్ టెక్నాలజీ విడుదల చేసింది. ఇప్పుడు, తమ అడ్వెంచర్ మోటార్ సైకిల్ హిమాలయన్ బైకును ఏబిఎస్ ఫీచర్‌తో విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంల

By N Kumar

రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల విపణిలోకి తమ క్లాసిక్ 350 మోడల్‌ను ఏబిఎస్ టెక్నాలజీ విడుదల చేసింది. ఇప్పుడు, తమ అడ్వెంచర్ మోటార్ సైకిల్ హిమాలయన్ బైకును ఏబిఎస్ ఫీచర్‌తో విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో హిమాలయన్ ఏబిఎస్ వేరియంట్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ అధీకృత డీలర్లు బుకింగ్స్ ప్రారంభించారు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ బుకింగ్స్ ప్రారంభం

ఓ రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ ఇచ్చిన సమాచారం మేరకు, హిమాలయన్ ఏబిఎస్ టెక్నాలజీ వేరియంట్ మరో 20 రోజుల్లో అంటే వచ్చే నెలలో విపణిలోకి విడుదల కానున్నట్లు తెలిసింది. దీంతో అధికారికంగా బుకింగ్స్ ప్రారంభించినట్లు వివరించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ బుకింగ్స్ ప్రారంభం

హిమాలయన్ ఏబిఎస్ వేరియంట్ ధర సాధారణ వేరియంట్ కంటే రూ. 12,000 నుండి రూ. 15,000 వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది. అంతే రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ధర రూ. 1.68 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ బుకింగ్స్ ప్రారంభం

రాయల్ ఎన్ఫీల్డ్ ఇటీవల విడుదల చేసిన క్లాసిక్ సిగ్నల్స్ 350 మోడల్‌లో గుర్తించినటువంటి ఏబిఎస్ పరికరాన్నే హిమాలయన్ ఏబిఎస్‌ వేరియంట్లో కూడా అందివ్వనున్నారు. అయితే, అడ్వెంచర్ బైకుల్లో సర్వసాధారణమైన ఏబిఎస్‌ను ఆఫ్ లేదా ఆన్ చేసుకునే బటన్ వస్తుందో... రాదో చూడాలి మరి.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ బుకింగ్స్ ప్రారంభం

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ బైకులో సాంకేతికంగా అదే మునుపటి 411సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజక్టెడ్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 24.5బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ బుకింగ్స్ ప్రారంభం

ఏబిఎస్ టెక్నాలజీ జోడింపు మినహాయిస్తే, సాంకేతికంగా ఎలాంటి మార్పులు సంభవించలేదు. సస్పెన్షన్ పరంగా ముందు వైపున 200ఎమ్ఎమ్ ట్రావెల్ గల 41ఎమ్ఎమ్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున 180ఎమ్ఎమ్ గల మోనోషాక్ అబ్జార్వర్ కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ బుకింగ్స్ ప్రారంభం

బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ముందు చక్రానికి 300ఎమ్ఎమ్ డిస్క్ మరియు వెనుక చక్రానికి 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేక్ కలదు. మెరుగైన మరియు పటిష్టమై బ్రేకింగ్ కోసం బాష్ నుండి సేకరించిన ఏబిఎస్ పరికరాన్ని వెనుక వైపున అందివ్వడం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఏబిఎస్ బుకింగ్స్ ప్రారంభం

తెలుగు డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం!

ఏబిఎస్ టెక్నాలజీతో వస్తున్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ నిజానికి ధరకు తగ్గ విలువలు గల అద్భుతమైన అడ్వెంచర్ మోటార్‌సైకిల్ అని చెప్పవచ్చు. హిమాలయన్ బైకుతో పాటు 500సీసీ శ్రేణిలో ఉన్న క్లాసిక్ మరియు ఇతర ఉత్పత్తుల్లో కూడా అతి త్వరలో ఏబిఎస్ టెక్నాలజీని పరిచయం చేయనుంది.

More from DriveSpark

Article Published On: Friday, August 31, 2018, 10:47 [IST]
English summary
Read In Telugu: Royal Enfield Himalayan ABS Bookings Open — Launch Next Month
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+