విపణిలోకి రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్లీట్ ఎడిషన్: ధర రూ. 1.71 లక్షలు
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్లీట్ బైకును తొలుత జనవరి 2018లో విడుదల చేసింది. కేవలం 500 యూనిట్లను మాత్రమే పరిమిత సంఖ్యలో, అది కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించేలా అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్లీట్ బైకును తొలుత జనవరి 2018లో విడుదల చేసింది. కేవలం 500 యూనిట్లను మాత్రమే పరిమిత సంఖ్యలో, అది కూడా ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయించేలా అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ తాజాగా తమ హిమాలయన్ స్లీట్ ఎడిషన్ లభ్యతను ఆన్‌లైన్‌కు కొనసాగింపుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ల వద్ద కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్లీట్ ఎడిషన్ ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.71 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. గతంలో ఇదే ఎడిషన్ ఎక్స్‌ప్లోర్ కిట్‌తో లభించేది. దాని ధర సుమారుగా రూ. 2.12 లక్షలుగా ఉండేది. అయితే ప్రస్తుతం లభించే స్లీట్ ఎడిషన్ స్టాండర్డ్ మోడల్ తరహాలోనే ఉంటుంది.

తొలుత విడుదలైన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్లీట్ ఎడిషన్‌లోని ఎక్స్‌ప్లోర్ కిట్‌లో, ప్యానియర్ బ్యాగులు, ప్యానియర్ మౌంటింగ్ రెయిల్స్, సంప్ గార్డ్, ఆఫ్ రోడ్ శైలిలో ఉండే హ్యాండిల్ బార్, క్రాష్ గార్డ్, బార్-ఎండ్ వెయిట్స్ వంటివి ఉండేవి. ఇప్పుడు వీటన్నింటితో పాటు ఇతర యాక్ససరీలను రూ. 31,999 లతో డీలర్ వద్ద కొనుగోలు చేయవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ స్లీట్ ఎడిషన్ బైకులో కేవలం కాస్మొటిక్ అప్‌డేట్స్ మాత్రమే జరిగాయి. సాంకేతికంగా ఇందులో ఎలాంటి మార్పులు జరగలేదు. ఇందులో ఉన్న ప్రత్యేకతలో విభిన్న ఎక్ట్సీరియర్ పెయింట్ స్కీమ్ ఒకటి. దీని బాడీ పెయింట్ స్టైల్ హిమాలయ పర్వతాలను ప్రతిబింబించేలా ఉంటాయి.

సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్లీట్ బైకులో 411సీసీ కెపాసిటి గల గాలి లేదా ఆయిల్‌తో చల్లబడే సింగల్ సిలిండర్ లాంగ్ స్ట్రోక్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 24.5బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 120కిలోమీటర్లుగా ఉంది.

హిమాలయన్ స్లీట్ అడ్వెంచర్ బైకులో ముందు వైపున లాంగ్ ట్రావెల్ గల టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున లాంగ్ ట్రావెల్ ఉన్న మోనోషాక్ అబ్జార్వర్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి, ఫ్రంట్ వీల్‌కు 300ఎమ్ఎమ్ డిస్క్ మరియు రియర్ వీల్‌కు 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. 2019 నుండి అమల్లోకి రానున్న నూతన ప్రమాణాలకు అనుగుణంగా రాయల్ ఎన్ఫీల్డ్ తమ హిమాలయన్ బైకులో ఏబిఎస్ అందించే అవకాశం ఉంది.

చూడచక్కటి మరియు అతి తక్కువ డిజైన్ అంశాలను కలిగి ఉన్న అత్యంత సరసమైన అడ్వెంచర్ బైకుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ ఒకటి. ఇందులో ముందు వైపున 21-అంగుళాలు మరియు వెనుక వైపున 18-అంగుళాల పరిమాణంలో ఉన్న స్పోక్ వీల్స్ ఉన్నాయి. హిమాలయన్ గ్రౌండ్ క్లియరెన్స్ 220ఎమ్ఎమ్‌గా ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ స్లీట్ ఎడిషన్‌లో ప్రధానక ఆకర్షణ హిమాలయాల ప్రేరణతో కూడిన బాడీ పెయింట్. ఇది మినహా, హిమాలయన్ స్లీట్ ఎడిషన్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. ప్రస్తుతానికి రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్ విపణిలో అత్యంత సరసమైన అడ్వెంచర్ మోటార్ సైకిల్. దీనికి పోటీగా అతి త్వరలో హీరో మోటోకార్ప్ ఎక్స్‌పల్స్ 200 అడ్వెంచర్ బైకును ప్రవేశపెట్టాడానికి సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








