రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ సిరీస్ బైకుల విడుదల ఖరారు

By Anil Kumar

ఇకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ దిగ్గజం రాయల్ ఎన్ఫీల్డ్ ఇటలీలో జరిగిన 2017 ఐక్మా మోటార్ సైకిల్ షోలో కాంటినెంటల్ జిటి 650 మరియు ఇంటర్‌సెప్టార్ 650 బైకులను ఆవిష్కరించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు పర్ఫామెన్స్ మరియు ఖరీదైన మోటార్ సైకిళ్లకు ధీటుగా శక్తివంతమైన ట్విన్ సిలిండర్ బైకును అభివృద్ది చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ అతి త్వరలో ఈ ట్విన్ సిరీస్ బైకులను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ సిరీస్ బైకుల విడుదల ఖరారు

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకులను ఈ ఏడాది జూలై లేదా ఆగష్టు నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది. కానీ, ఇండియా విడుదల కంటే ముందుగా ఈ రెండు బైకులు అంతర్జాతీయ మార్కెట్లో విడుదల కానున్నాయి. ఈ రెండు బైకులు కూడా సరికొత్త పెయింట్ స్కీమ్‌లో ఆస్ట్రేలియాలోని రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ వద్ద పట్టుబడినట్లు గతంలో ఓ కథనాన్ని ప్రచురించాము.

రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ సిరీస్ బైకుల విడుదల ఖరారు

దేశీయ మార్కెట్ కంటే ముందుగా ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ విపణిలోకి రాయల్ ఎన్ఫీల్డ్ తమ ట్విన్ సిరీస్ బైకులను విడుదల చేయనుంది. అంతర్జాతీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు మోడళ్లను సిద్దం చేసింది కాబట్టి, విదేశీ మార్కెట్లకు అధిక ప్రాధాన్యమివ్వనుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ సిరీస్ బైకుల విడుదల ఖరారు

సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకుల్లో 647సీసీ కెపాసిటి గల ట్విన్ ప్యార్లల్ ఆయిల్/గాలితో చల్లబడే ఇంజన్ కలదు. స్లిప్పర్ క్లచ్ గల 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం ఉన్న ఈ ఇంజన్ గరిష్టంగా 46.3బిహెచ్‌పి పవర్ మరియు 52ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ సిరీస్ బైకుల విడుదల ఖరారు

రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ సిరీస్ బైకుల్లో ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్లు తప్పనిసరిగా ఉన్నాయి. వీటితో పాటు ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు, స్పోక్ వీల్స్ మరియు రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ సిరీస్ బైకుల విడుదల ఖరారు

థాయిలాండ్, వియత్నాం మరియు ఇండోనేషియా మార్కెట్ల నుండి రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను మంచి స్పందన లభిస్తుండటంతో ఆగ్నేయాసియాలో అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ 650 ట్విన్ సిరీస్ బైకుల విడుదల ఖరారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకులు ఇండియన్ మార్కెట్లో అత్యంత సరసమైన ధరతో లభించే ట్విన్-సిలిండర్ బైకులు. మరియు ట్విన్ సిలిండర్ ఇంజన్ సిద్దం భారతదేశపు తొలి టూ వీలర్ కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్. ఎన్ఫీల్డ్ ట్విన్ సిరీస్ ధరల శ్రేణి రూ. 3 లక్షల నుండి రూ. 3.25 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండవచ్చు.

Source: MoneyControl

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Interceptor 650 And Continental GT 650 Launch Details Revealed
Story first published: Friday, May 11, 2018, 12:20 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X