కొత్త రంగుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 ఇండియన్ మార్కెట్లో విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న బైకులు. 650సీసీ ఇంజన్‌తో రానున్న రాయల్ ఎన్ఫీల్డ్ ట్విన్ బైకులు అంతర్జాతీయ మార్కెట్లో కూ

By Anil Kumar

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 ఇండియన్ మార్కెట్లో విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న బైకులు. 650సీసీ ఇంజన్‌తో రానున్న రాయల్ ఎన్ఫీల్డ్ ట్విన్ బైకులు అంతర్జాతీయ మార్కెట్లో కూడా అందుబాటులోకి రానున్నాయి. తాజాగా, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 రెండు కొత్త రంగుల్లో పట్టుబడ్డాయి.

రాయల్ ఎన్పీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

కొత్త కలర్ స్కీమ్‌లో ఉన్న ఈ రెండు బైకులు ఆస్ట్రేలియాలోని సిడ్నీలో గల రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్‌లో కనిపించాయి. ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 రెండు బైకులు నూతన డ్యూయల్ టోన్ కలర్ స్కీములో ఉన్నాయి. ఈ కలర్ ఆప్షన్స్‌తో బైకులు చూడటానికి చాలా రిచ్‌గా ఉన్నాయి.

రాయల్ ఎన్పీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 నూతన డ్యూయల్ టోన్ రెడ్ మరియు వైట్ కలర్ స్కీములో ఉండగా, కాంటినెంటల్ జిటి 650 గోల్డెన్ స్ట్రిప్ కలిగి ఉంది. నూతన రంగుల జోడింపు మినహాయిస్తే సాంకేతికంగా మరియు డిజైన్ పరంగా వీటిలో ఎలాంటి మార్పులు జరగలేదు.

రాయల్ ఎన్పీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 65 బైకుల్లో 647సీసీ కెపాసిటి గల ప్యార్లల్ ట్విన్ గాలి లేదా ఆయిల్‌తో చల్లబడే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ కలదు. స్లిప్పర్ క్లచ్ సహాయంతో ఉన్న 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 47బిహెచ్‌పి పవర్ మరియు 52ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్పీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ 650 సిరీస్ బైకుల్లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున గ్యాస్-ఛార్జ్‌డ్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. రెండు బైకుల్లో స్పోక్ వీల్స్, ఇరువైపులా డిస్క్ బ్రేకులు మరియు తప్పనిసరిగా వచ్చిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉన్నాయి. మరియు వీటి గరిష్ట వేగం గంటకు 160కిలోమీటర్లుగా ఉంది.

రాయల్ ఎన్పీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

రాయల్ ఎన్ఫీల్డ్ తమ 650 సిరీస్ ట్విన్ బైకులను వచ్చే జూన్ 2018 నాటికి ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయడానికి సన్నాహాలు పూర్తి చేసుకుంది. అయితే, వీటి అంతర్జాతీయ విడుదల ఇండియా విడుదల కంటే ముందే ఉండవచ్చు. ఇప్పటికే పలు విదేశీ మార్కెట్లకు వీటిని ఎగుమతి కూడా ప్రారంభించారు.

రాయల్ ఎన్పీల్డ్ ఇంటర్‌సెప్టార్ మరియు కాంటినెంటల్ జిటి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ మార్కెట్లో విడుదలకు ఎంతగానో వేచి ఉన్న బైకుల్లో రాయల్ ఎన్ఫీల్డ్ 650సీసీ ట్విన్ బైకులు ఉన్నాయి.వీటి ధరల శ్రేణి రూ. 3 లక్షల నుండి రూ. 3.25 లక్షల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉండే అవకాశం ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్‌సెప్టార్ 650 మరియు కాంటినెంటల్ జిటి 650 బైకులు విపణిలో ఉన్న హ్యార్లీ-డేవిడ్సన్ 750తో పాటు ఇతర మిడ్-సైజ్ హై పర్ఫామెన్స్ బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

Image Courtesy: Revelry Cycles

More from DriveSpark

Article Published On: Saturday, April 28, 2018, 17:48 [IST]
English summary
Read In Telugu: Royal Enfield Interceptor 650 And Continental GT 650 Spotted In Two New Colours
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+