రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 విడుదల: ధర రూ. 2.5 లక్షలు

దిగ్గజ పురాతణ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ విపణిలోకి తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 బైకును విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 బైకు ధర రూ. 2.49 లక్షలు

By Anil Kumar

దేశీయ దిగ్గజ పురాతణ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ విపణిలోకి తాజాగా రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 బైకును విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 బైకు ధర రూ. 2.49 లక్షలు ఆన్-రోడ్(మహారాష్ట్ర)గా ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 విడుదల

రాయల్ ఎన్ఫీల్డ్ ప్రపంచ వ్యాప్తంగా కేవలం 1,000 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. అందులో ఇండియాలో కేవలం 250 యూనిట్లను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నట్లు ప్రకటించింది. జూలై 10, 2018 నుండి రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 బైక్ విక్రయాలు ఆన్‌లైన్‌లో ప్రారంభమవుతాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 విడుదల

రెండవ ప్రపంచ యుద్ద కాలంలో బ్రిటీష్ సైనికులు ఉపయోగించిన ఫ్లైయింగ్ ఫ్లీ బైకు ప్రేరణతో రాయల్ ఎన్ఫీల్డ్ సరికొత్త పెగాసస్ 500 లిమిటెడ్ ఎడిషన్‌ బైకును అభివృద్ది చేసింది. RE/WB 125 2-స్ట్రోక్ బైకు ఫ్లైయింగ్ ఫ్లీ పేరుతో బాగా సుపరిచతం.

రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 విడుదల

ఇది చాలా తేలికగా ఉంటుంది. రోడ్డు సరిగా లేకపోతే సైనికులు వీటిని భుజాల మీద మోసుకెళ్లేవారని సమాచారం. అంతే కాకుండా, బ్రిటీష్ ఆర్మీ సైనికుల కోసం విమానాల ద్వారా వీటిని తీసుకెళ్లి పారాచూట్ల సాయంతో యుద్ద తలంలోకి జారవిడిచినట్లు చరిత్ర చెపుతోంది.

రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 విడుదల

ప్లైయింగ్ ఫ్లీ ప్రేరణతో డిజైన్ చేసిన పెగాసస్ 500 బైకును నిజానికి రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 500 ఆధారంగా అభివృద్ది చేశారు. ఇందులో అదే 499సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ పెట్రోల్ ఇంజన్ కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 విడుదల

5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 27.2బిహెచ్‍‌‌పి పవర్ మరియు 41.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఛాసిస్, బ్రేకులు, ట్రాన్స్‌మిషన్, క్లచ్ మరియు టైర్లలో ఏ విధమైన మార్పులు జరగలేదు.

రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 విడుదల

రాయల్ ఎన్ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌గా అందుబాటులోకి తీసుకొచ్చిన సరికొత్త పెగాసస్ 500 బైకులో మిలిటరీ స్టైల్లో ఉన్న క్యాన్వాస్ ప్యానీయర్ బ్యాగులు, లెథర్ పట్టీలు మరియు ఫ్యూయల్ ట్యాంక్ మీద అచ్చం ఫ్లయింగ్ ఫ్లీ బైకు మీద ఉన్నటువంటి పెగాసస్(ఎగిరే రెక్కల గుర్రం) లోగో ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 విడుదల

హ్యాండిల్ బార్, హెడ్‌లైట్ బెజెల్, ఎగ్జాస్ట్ మఫ్లర్, ఇంజన్ మరియు రిమ్ములు వంటివి బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. మరియు అన్ని లిమిటెడ్ ఎడిషన్ మోటార్ సైకిళ్ల మీద ఒక క్రమ పద్దతిలో కేటాయించిన సీరియల్ నెంబర్ ఫ్యూయల్ ట్యాంక్ మీద ఉంటుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 విడుదల

అంతర్జాతీయ మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 రెండు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది. అవి, ఆలివ్ డ్రాబ్ గ్రీన్ మరియు సర్వీస్ బ్రౌన్. అయితే, ఇండియన్ మార్కెట్లో విడుదలైన లిమిటెడ్ ఎడిషన్ బైకు కేవలం సర్వీస్ బ్రౌన్ కలర్‌లో మాత్రమే లభిస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 విడుదల

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ లిమిటెడ్ ఎడిషన్ పెగాసస్ 500 మోటార్ సైకిళ్లను చెన్నై ప్లాంటులో తయారు చేస్తోంది. ఇండియాలో రాయల్ ఎన్ఫీల్డ్ పెగాసస్ 500 బైకు ధర ఇతర యాక్ససరీలైన హెల్మెట్, ప్యానియర్ బ్యాగులు, టీ-షర్ట్‍‌కు కూడా వర్తిస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, May 30, 2018, 19:10 [IST]
English summary
Read In Telugu: Royal Enfield Pegasus 500 Launched In India; Priced At Rs 2.49 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+