సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లోకి ప్రవేశించిన రాయల్ ఎన్ఫీల్డ్

Written By:

రాయల్ ఎన్ఫీల్డ్ ప్రి-ఓన్డ్ మోటార్ సైకిల్ స్టోర్ "వింటేజ్"(Vintage)ను ప్రారంభించింది. ఇకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ సెకండ్ హ్యాండ్, యూజ్డ్ మరియు రీస్టోర్డ్ బైకుల మార్కెట్లోకి ప్రవేశించింది. తమిళనాడులోని చెన్నైలో తమ తొలి ప్రి-ఓన్డ్ మోటార్ సైకిల్ వింటేజ్‌ షోరూమ్‌ను  అధికారికంగా ప్రారంభించింది.

Recommended Video - Watch Now!
UM Renegade Thor Electric Cruiser Bike India Launch Details, Price, Specifications - DriveSpark
సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్

రాయల్ ఎన్ఫీల్డ్ దేశవ్యాప్తంగా మరో పది వింటేజ్ షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని చూస్తోంది. రాయల్ ఎన్ఫీల్డ్ వింటేజ్ పూర్తిగా ఒక కొత్త షోరూమ్. ఇందులో కస్టమర్లు ఇది వరకు ఉపయోగించిన బైకులు, సెకండ్ హ్యాండ్ బైకులు, పునరుద్దరించబడిన మరియు రీస్టోర్ చేసిన పాత బైకులను ఇక్కడ విక్రయిస్తారు.

సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్

క్వాలిటీ టెస్ట్ చేసిన సెకండ్ హ్యాండ్ బైకులు మరియు సర్టిఫైడ్ ప్రి-ఓన్డ్ మోటార్ సైకిళ్లను ఎంచుకోవడంలో రాయల్ ఎన్ఫీల్డ్ వింటేజ్ షోరూమ్‌లు కస్టమర్లకు సహాయపడనున్నాయి.

సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్

రాయల్ ఎన్ఫీల్డ్ వింటేజ్ షోరూమ్ ప్రారంభం గురించి కంపెనీ ఇండియా-బిజినెస్ హెడ్ షాజి కోష్యా మాట్లాడుతూ, "పాత మోటార్ సైకిళ్లపై ప్రయాణాలు మరియు వాటి అనుభవాలకు ఎప్పటికీ అంతమనేది ఉండదు. వీటిని ఒక కస్టమర్ నుండి మరో కస్టమర్‌కు యూజ్డ్ బైకులను నాణ్యత మరియు గుర్తింపుతో అందించనున్నాము. ప్రస్తుతం మార్కెట్లో సెకండ్ హ్యాండ్ మరియు రీస్టోర్డ్ మోటార్ సైకిళ్లకు డిమాండ్ అధికంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు."

సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్

చెన్నైలోని రాయల్ ఎన్ఫీల్డ్ వింటేజ్ స్టోర్ మిలాయ్ బాలాజీ నగపర్, వెలచేరి మెయిన్ రోడ్, పల్లికరనాయ్‌లో ఉంది. వింటేజ్ స్టోర్ కేవలం రాయల్ ఎన్ఫీల్డ్ బ్యాడ్జ్ ఉన్న బైకులను మాత్రమే డీల్ చేస్తుంది. సెకండ్ హ్యాండ్, పునరుద్దరించబడిన మరియు రీస్టోర్ చేయబడిన మోటార్ సైకిళ్లను విక్రయిస్తుంది.

సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్

మోటార్ సైకిళ్ల అవసరాలను బట్టి సెకండ్ హ్యాండ్ మరియు పునరుద్దరించబడిన మోటార్ సైకిళ్ల క్వాలిటీ చెక్ చేయడం మరియు వాటి పునరుద్దరణ పనులను మాత్రమే పర్యవేక్షిస్తుంది.

సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్

రీస్టోర్డ్ సెగ్మెంట్లో, పాత బైకులను రిపేర్ చేయడం మరియు ఒరిజినల్ కండీషన్‌లోకి తీసుకురావడం వంటివి చేస్తారు. శిక్షణ పొందిన రాయల్ ఎన్ఫీల్డ్ టెక్నీషియన్లు నాణ్యత, పునరుద్దరణ మరియు రిపేరీ పనులను పరిశీలించి తగిన వ్యాల్యూతో బైకులకు గుర్తింపునిస్తారు.

సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్

రీస్టోర్ చేసిన మోటార్ సైకిళ్లను అసలైన రాయల్ ఎన్ఫీల్డ్ విడి భాగాలు మరియు స్పేర్స్‌తో పునరుద్దరిస్తారు. అంతే కాకుండా, నాణ్యత మరియు విశ్వసనీయత పరంగా 92 రకాల పరీక్షలు చేస్తారు.

సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్

ప్రాసెస్ మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా, పారదర్శకంగా జరిగేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ వింటేజ్ స్టోర్‌లో ప్రాసెస్ మరియు ధరలు నిర్ణయించడం, కొనుగోళ్లు మరియు అమ్మకాలకు సంభందించి ఒక క్రమ ప్రక్రియ ఉంది.

సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్

అదంగా, రాయల్ ఎన్ఫీల్డ్ వింటేజ్ స్టోర్‌లో సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిళ్ల కొనుగోళ్ల కోసం ఫైనాన్స్, మోటార్ ఇన్సూరెన్స్, వారంటీ మరియు ఆఫ్టర్ సేల్స్ సర్వీసింగ్ వంటి సేవలను అందిస్తోంది.

సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియన్ సెకండ్ హ్యాండ్ బైకుల మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల క్రయవిక్రయాలే అధికంగా ఉన్నాయి. దీనిని గుర్తించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు మార్కెట్లోకి ప్రవేశించింది. కస్టమర్లు అత్యుత్తమ కండీషన్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ విక్రయించే లక్ష్యంతో వింటేజ్ స్టోర్‍‌ను ఏర్పాటు చేసింది. వీటిని దేశవ్యాప్తంగా విస్తరించే ఆలోచనలో ఉంది. సెకండ్ హ్యాండ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను కొనుగోలు చేసే కస్టమర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

English summary
Read In Telugu: Royal Enfield Pre-Owned Motorcycle Store ‘Vintage’ Launched: Pre-Owned, Refurbished & Restored Bikes
Story first published: Thursday, March 8, 2018, 19:01 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark