రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు మరియు వాటి ధరలు

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ బైకుల కోసం అల్లాయ్ వీల్స్‌తో సహా సుమారుగా 15 జెన్యూన్ యాక్ససరీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

By Anil Kumar

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ బైకుల యాక్ససరీల జాబితాను రివీల్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ బైకుల కోసం అల్లాయ్ వీల్స్‌తో సహా సుమారుగా 15 జెన్యూన్ యాక్ససరీలను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ బైకులను విడుదల చేసింది. ప్రస్తుతం వీటికి యాక్ససరీలను తమ అఫీషియల్ వెబ్‌సైట్లో చేర్చింది. యాక్ససరీలు, ధరలు మరియు పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో....

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ బైకులో 19బిహెచ్‌పి-28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 346సీసీ ఇంజన్ మరియు 500ఎక్స్ బైకులో 27బిహెచ్‌పి-41.3ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 499సీసీ ఇంజన్ కలదు. రెండు బైకుల్లో 5-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ కలదు.

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

ఎక్స్ ఎడిషన్‌లో విడుదలైన థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ బైకుల్లో కాస్మొటిక్ అప్‌డేట్స్ మినహాయిస్తే, సాంకేతికంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. థండర్‌బర్డ్ ఎక్స్ మోడళ్ల కోసం రాయల్ ఎన్ఫీల్డ్ అందిస్తున్న యాక్ససరీలు:

 రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

ఫ్లై స్క్రీన్ (Flyscreen)

వేగంగా వెళుతున్నపుడు ఎదురుగా వచ్చే గాలి నుండి ఫ్లై స్క్రీన్ రక్షణ కల్పిస్తుంది మరియు రోడ్డును స్పష్టంగా చూడటంలో సహాయపడుతుంది. ఇది క్లియర్ మరియు టింటెడ్ షేడ్‌‌లలో లభ్యమవుతోంది.

  • క్లియర్ మోడల్ ధర రూ. 2,550
  • టింటెడ్ మోడల్ ధర రూ. 2,950
  • లభ్యత: అతి త్వరలో
  •  రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

    విండ్‌షీల్డ్ (Windshield)

    విండ్‌షీల్డ్ మరియు ఫ్లైస్క్రీన్‌ రెండింటినీ ఒకే అవసరానికి ఉపయోగిస్తారు. అయితే, ఫ్లైస్క్రీన్ కంటే విండ్‌స్క్రీన్ అత్యుత్తమ రక్షణ కల్పిస్తుంది. లాంగ్ రైడింగ్‌లో దీని అవసరం ఎక్కువగా ఉంటుంది. దీని ధర రూ. 5,000. అంతే కాకుండా, రాయల్ ఎన్ఫీల్డ్ సింబల్స్ ఉన్న విండ్‌షీల్డ్ కిట్‌ను రూ. 1500 లతో ఎంచుకోవచ్చు.

    • లభ్యత: అందుబాటులో ఉంది.
    •  రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

      బైక్ కవర్ (Bike Cover)

      రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండెడ్ వాటర్‌ప్రూఫ్ కవర్లు బ్లాక్ మరియు న్యావీ బ్లూ రంగుల్లో లభిస్తోంది. ఈ కవర్లను జిప్‌ సహాయంతో మడిపివేయవచ్చు.

      • ధర రూ. రూ.900
      • లభ్యత: అందుబాటులో ఉంది
      •  రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

        క్రాష్ గార్డ్స్ (Crash Guards)

        రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ బైకుల కోసం క్రాష్ గార్డ్స్ పరిచయం చేసింది. వీటిని 32ఎమ్ఎమ్ చుట్టుకొలత గల స్టీల్ ట్యూబులతో చేశారు. ఇవి, మూడు విభిన్న డిజైన్‌లలో లభిస్తున్నాయి. అవి, ట్రెపీజియం, ఆక్టాగాన్ & ఎయిర్ ఫ్లై.

         రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

        • ఎయిర్ ఫ్లై ధర రూ. 3450
        • ట్రెపీజియం ధర రూ. 2100
        • ఆక్టాగాన్ ధర రూ. 2300
        • లభ్యత: అతి త్వరలో లభిస్తాయి.
        •  రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

          ఆయిల్ ఫిల్లర్ క్యాప్

          సిఎన్‌సి మెషీన్‌తో చేసిన ఆర్ఇ బ్యాడ్జింగ్ గల ఆయిల్ ఫిల్లర్ క్యాప్‌ను కూడా అందుబాటులో ఉంచింది. ఈ అల్యూమినియం సిల్వర్ మరియు బ్లాక్ రెండు విభిన్న రంగుల్లో లభిస్తోంది. ఒక్కొక్కదాని ధర రూ. 825.

          • లభ్యత: అతి త్వరలో
          •  రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

            బ్రేక్ రిజర్వాయర్ లిడ్

            సిఎన్‌సి మెషీన్‌తో చేసిన డిస్క్ బ్రేక్ ఫ్లూయిడ్ రిజర్వాయర్ క్యాప్ బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో లభ్యమవుతోంది. దీని మీద కూడా ఆర్ఇ బ్రాండింగ్ ఉంది. దీని ధర రూ. 800.

            • లభ్యత: అతి త్వరలో
            •  రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

              పిలియన్ బ్యాక్‌రెస్ట్

              థండర్‌బర్డ్ స్టాండర్డ్ మోడళ్లలో బ్యాక్‌రెస్ట్ తప్పనిసరిగా వస్తోంది. అయితే, 350ఎక్స్ మరియు 500ఎక్స్ మోడళ్లలో బ్యాక్‌రెస్ట్ అమర్చుకోవాలి అనుకుంటే రూ. 2,750 చెల్లించి కొనుగోలు చేయవచ్చు.

              • లభ్యత: అతి త్వరలో
              •  రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

                ప్యానియర్ రెయిల్స్

                వీటిని 16ఎమ్ఎమ్ డయామీటర్ ఉన్న మైల్డ్ స్టీల్ ట్యూబులతో తయారు చేశారు. తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం మన్నుతుంది.

                ధర రూ. 1700

                • లభ్యత: అతి త్వరలో
                •  రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

                  ప్యానీయర్ బ్యాగులు

                  సింగల్ స్ట్రాప్‌తో వేగంగా తెరిచి మరియు మూసే అవకాశం ఉన్న వాటర్ ప్రూఫ్ బ్యాగులు కూడా ఉన్నాయి. యువత థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ బైకులను ప్యానీయర్ బ్యాగులతో సహా ఎంచుకుంటే చూడటానికి చాలా కొత్తగా ఉంటాయి.

                  • ధర రూ. 6,000
                  •  రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X & 500X యాక్ససరీలు

                    డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

                    పైన పేర్కొన్న అన్ని యాక్ససరీలతో రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ బైకులు చాలా అట్రాక్టివ్‌గా ఉంటాయి. అయితే, చాలా వరకు యాక్ససరీలు ఇంకా డీలర్ల వద్దకు రావాల్సి ఉంది. ఇప్పటికే చాలా మంది కస్టమర్లు వీటి గురించి ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. మరి మీరు వీటిని జెన్యూన్ రాయల్ ఎన్ఫీల్డ్ యాక్ససరీలను భావిస్తున్నారా...?

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Thunderbird 350X & 500X Accessories: Price, Details, Availability & More
Story first published: Saturday, May 26, 2018, 19:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X