రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల: ధర మరియు ఫీచర్లు

దేశీయ దిగ్గజ ఐకానిక్ మోటార్ సైకిళ్ల కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ విపణిలోకి సరికొత్త థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది.

By Anil Kumar

Recommended Video

UM Renegade Thor Electric Cruiser Bike India Launch Details, Price, Specifications - DriveSpark

దేశీయ దిగ్గజ ఐకానిక్ మోటార్ సైకిళ్ల కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ విపణిలోకి సరికొత్త థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ మోటార్ సైకిళ్లను లాంచ్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ ప్రారంభ ధర రూ. 1.56 లక్షలు మరియు థండర్‌బర్డ్ 500ఎక్స్ ధర రూ. 1.98 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల

రాయల్ ఎన్ఫీల్డ్ ఈ రెండు థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ బైకులను థండర్‌బర్డ్ స్టాండర్డ్ మోటార్ సైకిళ్ల ఆధారంగా అదే ఇంజన్ మరియు ఛాసిస్‌తో నిర్మించింది. అయితే, సరికొత్త రైడింగ్ అనుభవం కలిగించే ఫీచర్లు, నూతన కలర్ ఆప్షన్స్ మరియు కొన్ని డిజైన్ మార్పులు చోటు చేసుకున్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ బైకుల గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ స్పెసిఫికేషన్స్

థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ బైకుల్లో స్టాండర్డ్ వెర్షన్‌ నుండి సేకరించిన అవే ఇంజన్ ఆప్షన్స్‌ ఉన్నాయి. థండర్‌బర్డ్ 350ఎక్స్ బైకులో సాంకేతికంగా 346సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది 19బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల

అదే విధంగా రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకులో 499సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది 27బిహెచ్‌పి పవర్ మరియు 41.3ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. రెండు బైకుల్లో 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ ఎక్స్ డిజైన్

థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకులు పలు విభిన్న డిజైన్ మార్పులతో దాదాపు రాయల్ ఎన్ఫీల్డ్ లైనప్‌లో ఉన్న థండర్‌బర్డ్ బైకులోనే పోలి ఉంటాయి. థండర్‌బర్స్ ఎక్స్ శ్రేణి బైకుల్లో ముందు వైపున పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్ ల్యాంప్ మరియు ప్రొజెక్టర్ లైట్ గల గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్‌ల్యాంప్ ఉంది దీని చుట్టూ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ కలదు.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల

రెండు బైకుల్లో ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా ఒకేలా ఉంటుంది. అయితే, ఎక్స్ సిరీస్ బైకుల్లోని ఫ్యూయల్ ట్యాంకులు విభిన్న రకాల ప్రకాశవంతమైన కలర్ ఆప్షన్స్‌లో లభ్యమవుతున్నాయి. మునుపటి థండర్‌బర్డ్ బైకుల్లో వచ్చే రెండుగా విభజించిన సీటు స్థానంలో గన్‌స్లింగర్ సింగల్ సీటు సెటప్ ఇందులో ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల

ప్రధానంగా గుర్తించదగిన ఇతర ఫీచర్లలో సరికొత్త అల్లాయ్ వీల్స్, రిమ్ స్టిక్కరింగ్ మరియు ఆకర్షణీయమైన ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ క్లస్టర్ కలదు. రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ బైకులు నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తాయి. అవి, డ్రిఫ్టర్ బ్లూ, గెట్అవే ఆరేంజ్, రోవింగ్ రెడ్ మరియు విమ్సికల్ వైట్.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల

ఫ్రంట్ మడ్‌గార్డ్, సైడ్ ప్యానల్స్, రియర్ ఫెండర్, ఫ్రంట్ ఫోర్క్స, సస్పెన్షన్, ఎగ్జాస్ట్ మరియు ఇంజన్ వంటి ప్రధానమైన భాగాలను బ్లాక్ ఫినిషింగ్ కలర్‌లో అందించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల

థండర్‌బర్డ్ ఎక్స్ సిరీస్ బైకుల్లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్ మరియు వెనుక వైపున ట్విన్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఇరువైపులా డిస్క్ బ్రేకులను అందివ్వడం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల

థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు థండర్‌బర్డ్ 500ఎక్స్ రెండింటిలో అనలాగ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మునుపటి బైకుల తరహాలో ప్రక్కకు కాకుండా ముందు వైపుకు వంచబడిన షార్ట్ హ్యాండిల్‌బార్ ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకులో ఇరువైపులా ధృడమైన 9-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. వీటికి ఎమ్ఆర్ఎఫ్ నైలోగ్రిప్ జప్పర్ ట్యూబ్ లెస్ టైర్లను అందివ్వడం జరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్ ట్యూబ్ లెస్ టైర్లను అందివ్వడం ఇదే మొదటిసారి.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350X మరియు 500X విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రెట్రో స్టైల్ మోటార్ సైకిళ్లను మాత్రమే అందుబాటులో ఉంచిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు సరికొత్త సరికొత్త డిజైన్ ఫిలాసఫీతో స్టైలిష్ థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ బైకులను ప్రవేశపెట్టింది. యువ కొనుగోలుదారులను మరియు రెట్రో స్టైల్ మోటార్ సైకిళ్లను ఇష్టపడి కస్టమర్లను టార్గెట్ చేసుకుని వీటిని విడుదల చేసింది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ రెండు బైకుల ధరల స్టాండర్డ్ థండర్‌బర్డ్ బైకులతో పోల్చుకుంటే రూ. 8,000 లు అధికంగా ఉంది. సరికొత్త ఫీచర్లు మరియు డిజైన్‌తో ధరకు తగ్గ విలువలతో వచ్చాయి. ఈ బైకుల గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ సెక్షన్‌లో తెలుపగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, February 28, 2018, 13:09 [IST]
English summary
Read In Telugu: Royal Enfield Thunderbird 350X And 500X Launched In India; Prices Start At Rs 1.56 Lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+