గుడ్ న్యూస్: థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ విడుదలను ఖరారు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్

దిగ్గజ ఇకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లోకి మరో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

By Anil

Recommended Video

UM Renegade Thor Electric Cruiser Bike India Launch Details, Price, Specifications - DriveSpark

దిగ్గజ ఇకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ మార్కెట్లోకి మరో రెండు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఢిల్లీ వేదిక విపణిలోకి లాంచ్ చేయనున్న థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకుల విడుదల కార్యక్రమానికి రాయల్ ఎన్ఫీల్డ్ డ్రైవ్‌స్పార్క్ బృందాన్ని ఆహ్వానించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకుల గురించి పూర్తి వివరాలు...

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ & 500ఎక్స్

థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు థండర్‌బర్డ్ 500ఎక్స్ బైకులు గత ఏడాది చివరిలో డీలర్ స్టాక్‌యార్డ్ వద్ద రహస్యంగా పట్టుపడ్డాయి. వీటిని దశలవారీగా పరీక్షించిన రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో విక్రయాలకు సిద్దంగా అందుబాటులోకి తీసుకురానుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ & 500ఎక్స్

రెండు బైకుల్లోని ఫ్యూయల్ ట్యాంక్‌లు ప్రకాశవంతమైన కలర్‌లో ఉండగా, ఇంజన్ మరియు మిగతా విడి భాగాలు పూర్తి స్థాయిలో నలుపు రంగులో ఉన్నాయి. కాస్మొటిక్ మరియు పలు డిజైన్ మార్పులతో వచ్చినప్పటికీ సాంకేతికంగా అదే ఇంజన్ మరియు గేర్‌బాక్స్‌లో రానున్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ & 500ఎక్స్

రెగ్యులర్ వేరియంట్లతో పోల్చుకుంటే విభిన్నంగా ఉండేందుకు సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ ఎక్స్ వేరియంట్ బైకుల్లో న్యూ హ్యాండిల్ బార్, సీటు, నలుపు రంగులో ఉన్న అల్లాయ్ వీల్స్, ట్యూబ్ లెస్ టైర్లు, మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్‌లో ఉన్న ఇంజన్ కేసింగ్ వంటివి ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ & 500ఎక్స్

అదే విధంగా స్టాండర్డ్ వెర్షన్ థండర్‌బర్డ్ నుండి సేకరించిన అదే ఎల్ఇడి డే టైం రన్నింగ్ లైట్లు గల హెడ్‌ల్యాంప్ యూనిట్ మరియు ఎల్ఇడి టెయిల్ ల్యాంప్స్ సరికొత్త థండర్‌బర్డ్ ఎక్స్ ఎడిషన్ బైకుల్లో వచ్చాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ & 500ఎక్స్

థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ బైకుల్లో సరికొత్త 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, బ్రేకింగ్ విధుల కోసం ఇరువైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి. అయితే, బైకుల్లో సేఫ్టీ పరంగా అత్యంత కీలకమైన ఫీచర్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ ఇందులో మిస్సయ్యింది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ & 500ఎక్స్

చూడటానికి థండర్‍‌‍‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ బ్లాక్ బార్డర్ ఫినిషింగ్ గల గుండ్రటి ఆకారంలో ఉన్న ఎల్ఇడి హెడ్ ల్యాంప్, రెగ్యులర్ క్రూయిజర్ బైకుల తరహాలో కాకుండా పొట్టిగా ఉన్న హ్యాండిల్ బార్, సెమీ-డిజిటల్ ట్విన్-పోడ్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ & 500ఎక్స్

వీటిలో గుర్తించదగిన మరో ప్రధానమైన మార్పు సరికొత్త పొడవాటి సింగల్ సీటు కలదు, అయితే పిలియన్ సీట్ బ్యాక్ రెస్ట్ రాలేదు. రియర్ గ్రాబ్ రెయిల్ డిజైన్ కాస్త ఆశ్చర్యకరంగా ఉంటుంది. సీటుకు కొనసాగింపుగా టెయిల్ ల్యాంప్ డిజైన్‌లో ఇమిడిపోయింది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ & 500ఎక్స్

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ రెడ్ మరియు వైట్ కలర్ ఆప్షన్స్‌లో, థండర్‌బర్డ్ 500ఎక్స్ యెల్లో మరియు బ్లూ కలర్ ఆప్షన్స్‌లో లభ్యం కానుంది. రెగ్యులర్ వెర్షన్ థండర్‌బర్డ్ బైకులతో పోల్చితే వీటి ధరలు సుమారుగా రూ. 5,000 ల నుండి రూ. 8,000 ల వరకు అధికంగా ఉండే అవకాశం ఉంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ & 500ఎక్స్

సాంకేతికంగా థండర్‌బర్డ్ 350ఎక్స్‌లో అదే 346సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది 19.8బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అదే విధంగా థండర్‌బర్డ్‌ 500ఎక్స్‌లో కూడా రెగ్యులర్ వెర్షన్ సేకపరించిన ఇంజన్ కలదు. 499సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ 27.20బిహెచ్‌పి పవర్ మరియు 41.30ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ థండర్‌బర్డ్ 350ఎక్స్ & 500ఎక్స్

డ్రవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ బైకులు శరీర ధారుడ్యం బాగున్న వారికి ఎంతో చక్కగా సరిపోతాయి. డిజైన్ మరియు పనితీరు కూడా అలాంటి కస్టమర్లకు బాగా నప్పుతాయి. అయితే, యువ కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని విభిన్న కలర్ ఆప్షన్స్ మరియు పలు డిజైన్ మార్పులతో థండర్‌బర్డ్ 350ఎక్స్ మరియు 500ఎక్స్ బైకులను విడుదలకు సిద్దం చేసింది.

Most Read Articles

English summary
Read In Telugu: Royal Enfield Thunderbird 350X And 500X Launch Date: Expected Price, Specifications & Features
Story first published: Saturday, February 24, 2018, 11:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X