రెండు అప్‌డేట్స్‌తో విడుదలైన సుజుకి యాక్సెస్ 125
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ సరికొత్త యాక్సెస్ 125 స్కూటర్‌ను మరో రెండు కొత్త అప్‌డేట్స్‌తో లాంచ్ చేసింది. యాక్సెస్ 125 స్కూటర్‌లో ఇప్పుడు భద్రత పరంగా కాంబి బ్రేకింగ్ సిస్టమ్(CBS)
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తమ సరికొత్త యాక్సెస్ 125 స్కూటర్‌ను మరో రెండు కొత్త అప్‌డేట్స్‌తో లాంచ్ చేసింది. యాక్సెస్ 125 స్కూటర్‌లో ఇప్పుడు భద్రత పరంగా కాంబి బ్రేకింగ్ సిస్టమ్(CBS) ఫీచర్ పరిచయం చేసింది. దీనితో పాటు అదనంగా సరికొత్త సిల్వర్ కలర్‌ను కూడా జోడించింది.

CBS ఫీచర్ గల సుజుకి యాక్సెస్ 125 స్కూటర్ ప్రారంభ ధర రూ. 58,980 లు మరియు బీజి లెథర్ సీటు మరియు సిల్వర్ కలర్ స్కీమ్‌లో విడుదలైన స్పెషల్ ఎడిషన్ యాక్సెస్ 125 ధర రూ. 60,580 లు. రెండు ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

సిబిఎస్ టెక్నాలజీ ద్వారా అతి తక్కువ దూరంలో స్కూటర్ ఆగుతుంది. అంటే హ్యాండిల్ ఎడమ వైపున్న బ్రేక్ లీవర్ ప్రెస్ చేస్తే బ్రేకింగ్ పవర్ ముందు మరియు వెనుక చక్రాలకు ఒకేసారి సరిమానంగా అందుతుంది. అంటే ఒక్క లీవర్ ద్వారా రెండు చక్రాలకు బ్రేకులు పడతాయి.

దీంతో బ్రేకింగ్ పనితీరు మునుపటి మోడళ్ల కంటే మరింత మెరుగుపడింది. అదే విధంగా హ్యాండిల్‌కు కుడివైపున ఉన్న బ్రేక్ లీవర్ కేవలం ఫ్రంట్ వీల్‌కు మాత్రమే బ్రేక్ పవర్ సరఫరా చేస్తుంది. తక్కువ స్పీడ్‌లో ఉన్నపుడు కుడి వైపున్న బ్రేక్ లీవర్ మరియు అధిక వేగంలో ఉన్నపుడు ఎడమవైపున్న బ్రేక్ లీవర్ ఉపయోగించండి.

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో పరిచయమైన కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ స్కూటర్ విలువను ఇప్పుడు మరింత పెంచిందని సుజుకి టూ వీలర్స్ ఇండియా సేల్స్ మరియు మార్కెటింగ్ హెడ్ సంజీవ్ రాజశేఖరన్ పేర్కొన్నాడు.

"కస్టమర్ల సౌకర్యం మరియు సేఫ్టీ దృష్ట్యా తీసుకొచ్చిన నూతన మార్పులు మరియు చేర్పులు సుజుకి కుటుంబంలోకి ఎక్కువ మందిని చేర్చుకోవడానికి దోహదపడతాయని విశ్వాసం వ్యక్తం చేశాడు." 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లో యాక్సెస్ 125 ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తోంది, తాజాగా జరిగిన అప్‌డేట్స్‌తో సేల్స్ మరింత పుంజుకునే అవకాశం ఉంది.

సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో సాంకేతికంగా 125సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిన్ అనుసంధానం గల సుజుకి ఇకో పర్ఫామెన్స్(SEP) ఇంజన్ గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యాక్సెస్ 125 స్కూటర్‌లో క్రోమ్ ఫినిషింగ్ గల హెడ్‌ల్యాంప్స్, డిజిటల్ అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, వన్-పుష్ షటర్ లాక్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్ వంటివి ఉన్నాయి. డిసి ఛార్జింగ్ సాకెట్, అల్లాయ్ వీల్స్ మరియు ఫ్రంట్ డిస్క్ బ్రేకులు అప్షనల్‌గా లభిస్తున్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సుజుకి విడుదల చేసిన అప్‌డేటెడ్ యాక్సెస్ 125 స్కూటర్ విపణిలోకి హోండా యాక్టివా 125 స్కూటర్‌కు గట్టి పోటీనిస్తుంది. పవర్ మరియు మైలేజ్ అంశాల పరంగా ఈ రెండింటి మధ్య పోటీ మరింత ముదిరింది. ఇప్పటికే మంచి ఫలితాలు సాధిస్తున్న యాక్సెస్ 125, తాజా అప్‌డేట్స్‌తో విక్రయాలు మరింత ఊపందుకునే ఛాన్స్ ఉంది.


Click it and Unblock the Notifications








