సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 బుకింగ్స్ ప్రారంభం: లాంచ్ వివరాలు
సుజుకి మోటార్ సైకిల్స్ తమ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ పై బుకింగ్స్ ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి డెలీర్స్ వద్ద రూ. 5,000 చెల్లించి బర్గ్‌మ్యాన్ 125 స్కూటర్ను బుక్ చేసుకోవచ్చు.
సుజుకి మోటార్ సైకిల్స్ తమ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ పై బుకింగ్స్ ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న సుజుకి డీలర్స్ వద్ద రూ. 5,000 చెల్లించి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ను బుక్ చేసుకోవచ్చు. ఈ 125సీసీ స్కూటర్ తొలుత 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో లో ప్రదర్శించారు. సుజుకి ఈ స్కూటర్ ను ఈ ఏడాది జులై లో లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ప్రపంచ మార్కెట్ లో బర్గ్‌మ్యాన్ స్కూటర్ 125సీసీ నుండి 650సీసీ ఇంజిన్ రేంజ్ లో అందుబాటులో ఉంది. కానీ సుజుకి ఇండియా లో మాత్రం కేవలం 125సీసీ స్కూటర్ ను మాత్రమే విక్రయించాలి అని అనుకుంటోంది.

ఇపుడు విడుదల అవుతున్న బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ సాంకేతికంగా చాల వరకు సుజుకి యాక్సిస్ 125 ని పోలి ఉంటుంది. ఇందులోని ఇంజిన్, సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ సుజుకి యాక్సిస్ 125 నుండి తీస్కున్నారు. బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ లో 8.5బిహెచ్‌పి మరియు 10.2ఎన్ఎమ్ ప్రొడ్యూస్ చేసే 124సీసీ సింగల్ సిలెండర్ ఇంజిన్ ఉంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ లో ముందు చక్రాలకు టేలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక చక్రాలకు మోనో-షాక్ ను అందించారు. ఇంక బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్ మరియు రేర్ లో డ్రం బ్రేక్ ను అందించారు.

ఈ స్కూటర్ లోని మరిన్ని ప్రత్యేకతలు చెప్పాలంటే, ఇందులో ఎల్ఈడి హెడ్లైట్స్ మరియు టైల్లైట్స్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, బెస్ట్-ఇన్-క్లాస్ అండర్ సీట్ స్టోరేజ్ మరియు ఎక్సట్రా-లాంగ్ సీట్స్ ఉన్నాయి. బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ కూడా యాక్సిస్ 125 లో ఉన్న కాంబి-బ్రేకింగ్ సిస్టం తో రానుంది.

సుజుకి నుండి రానున్న లేటెస్ట్ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ చాలా ప్రతేకమని చెప్పాలి, ఎందుకంటే ఇలాంటి డిజైన్ తో ఉన్న స్కూటర్ ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లోకి రాలేదు. బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 ధర సుమారు రూ.70,000 ఎక్స్-షోరూమ్ గా ఉండే అవకాశం ఉంది. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న అప్రిలియా 125 స్కూటర్ తో పోటీ పడనుంది.


Click it and Unblock the Notifications








