ఈ జూలై 19 న విడుదలవుతున్న సరికొత్త సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ ఇదే...

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్ పోలో సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మ్యాక్సీ-స్కూటర

By Anil Kumar

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్ పోలో సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను ఆవిష్కరించింది. విడుదలకు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మ్యాక్సీ-స్కూటర్‌ను సుజుకి ఇండియా ఎట్టకేలకు ఖరారు చేసింది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125

అవును, జూలై 19, 2018న సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్లను డీలర్లకు సరఫరా చేస్తున్నారు. డీలర్ల వద్దకు చేరుకున్న కొన్ని తాజాగా ఫోటోలు ఇటీవల లీక్ అయ్యాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125

సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా లైనప్‌లో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను రెండవ స్కూటర్‌‌గా ప్రవేశపెడుతోంది. సుజుకి విక్రయిస్తున్న యాక్సెస్ 125 స్కూటర్ 125సీసీ సెగ్మెంట్లో మంచి ఫలితాలు సాధిస్తోంది. అయితే, దేశీయ స్కూటర్ల మార్కెట్లో తన స్థానాన్ని పధిలం చేసుకోవడానికి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్‌ను సిద్దం తీసుకొస్తోంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125

ఇండియన్ మార్కెట్లో స్కూటర్ల సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లకు ధీటుగా ఫలితాలు సాధిస్తోంది. ఈ మార్పును అవకాశంగా మలుచుకుని యువ కొనుగోలుదారులను టార్గెట్ చేస్తూ, అంతర్జాతీయ విపణిలో ఉన్న ఈ ప్రీమియం మ్యాక్సీ స్కూటర్‌ను దేశీయంగా ప్రవేశపెడుతోంది. ఇది పూర్తి స్థాయిలో విడుదలైతే, టీవీఎస్ ఎన్‌టార్క్ మరియు హోండా గ్రాజియా వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125

సాంకేతికంగా బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌లో యాక్సెస్ 125 స్కూటర్‌ను సేకరించిన అదే 124సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ అందివ్వడం జరిగింది. సీవీటీ ట్రాన్స్‌మిషన్ గల ఇది 8.5బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 డిజైన్ ఇండియన్ మార్కెట్లో లభించే స్కూటర్ల కంటే చాలా విభిన్నంగా ఉంటుంది. పెద్ద పరిమాణంలో ఉన్న హెడ్‌ల్యాంప్, టెయిల్ ల్యాంప్, స్టెప్ అప్ సీటు, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ మరియు విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125

సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో-షాక్ అబ్జార్వర్ ఉంది. బ్రేకింగ్ విధులు నిర్వర్తించడానికి ఫ్రంట్ వీల్‌కు డిస్క్ బ్రేక్ మరియు రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేక్ అందివ్వడం జరిగింది. బ్రేకింగ్ ఫోర్స్ రెండు చక్రాలకు సమానంగా సరఫరా చేసేందుకు కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ కూడా జోడించారు.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌‌లో మల్టీ-ఫంక్షన్ కీ స్లాట్ ఉంది, దీనితో సీటు మరియు ఫ్యూయల్ క్యాప్ క్లోజింగ్ మరియు ఓపెనింగ్ చాలా సులభంగా చేయవచ్చు. మొబైల్ ఫోన్లు మరియు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఛార్జింగ్ చేసుకోవడానికి 12వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ అందివ్వడం జరిగింది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125

సుజుకి ఈ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను ఈ జూలై 19, 2018 న మార్కెట్లోకి విడుదల చేయనుంది. బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ లభించే వేరియంట్లు, వాటి ధరలు మరియు ఇతర విడుదల వివరాల కోసం మాతో కలిసి ఉండండి...

Source: BikeWale

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki Burgman 125 maxi-scooter reaches dealers: Fresh images inside
Story first published: Friday, July 6, 2018, 16:24 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X