సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ విడుదల ఖరారు

సుజుకి ఇండియా మార్కెట్లోకి సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా సుజుకి ఆవిష్కరించిన బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను

By Anil Kumar

సుజుకి ఇండియా మార్కెట్లోకి సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా సుజుకి ఆవిష్కరించిన బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను జూలై 19, 2018 న ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్దమైంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్

అంతర్జాతీయ విపణిలో సుజుకి ఈ బర్గ్‌మ్యాన్ స్కూటర్‌ను 125సీసీ నుండి 600సీసీ ఇంజన్ రేంజిలో విక్రయిస్తోంది. కానీ, గత ఏడాది విడుదల చేసిన ఇంట్రూడర్ బైకు తరహాలో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను ఇండియన్ మార్కెట్ కోసం డిజైన్ చేశారు.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్

యూరోపియన్ మోడల్ బర్గ్‌మ్యాన్ ప్రేరణతో ఈ ఇండియన్ వెర్షన్ తీర్చిదిద్దారు. ఈ మ్యాక్సీ-స్కూటర్ చూడటానికి చాలా స్పోర్టివ్ మరియు అగ్రెసివ్‌గా ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ ఎల్ఇడి హెడ్‌వల్యాంప్స్ ఉన్న దీని ఫ్రంట్ డిజైన్ చాలా స్పోర్టివ్ శైలిలో ఉంటుంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్

మార్కెట్లో ఉన్న ఇతర స్కూటర్లతో పోల్చితే చాలా విభిన్నమైన డిజైన్ కలిగి ఉంటుంది. హ్యాండిల్ బార్ మరియు విండ్ స్క్రీన్ ఒక కొత్త శైలిలో ఉంటుంది. స్టెప్-అప్ డిజైన్‌లో ఉన్న ఈ స్కూటర్ చాలా సౌకర్యంగా ఉంటుంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ రియర్ డిజైన్‌లో పదునైన మరియు ఎడ్జీ డిజైన్ గల స్టైలిష్ ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ ఉంటుంది. స్కూటర్ బాడీ మొత్తం కండలు తిరిగిన రూపం మరియు మెలికలు తిరిగిన క్యారెక్టర్ లైన్స్ ఉంటాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌లో ఫుల్లీ-డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ-ఫంక్షన్ కీ స్లాట్, విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్, లావుగా ఉన్న ఎగ్జాస్ట్ మఫ్లర్, మరియు కాళ్లను దూరంగా పెట్టుకునే ఫ్రంట్ ఫుట్ పొజిషన్ వంటి అరుదైన ఫీచర్లు ఉన్నాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్

సాంకేతికంగా సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌లో 124.3సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, సీవీటీ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 8.5బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుజుకి యాక్సెస్ 125 స్కూటర్‌లో కూడా ఇదే ఇంజన్ ఉంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున సింగల్ షాక్ అబ్జార్వర్ ఉంది. అదే విధంగా ముందువైపున 12-అంగుళాల అల్లాయ్ వీల్ మరియు వెనుక వైపున 10-అంగుళాల అల్లాయ్ వీల్ ఉంది. ఫ్రంట్ వీల్‌కు డిస్క్ బ్రేక్ మరియు రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేక్ యూనిట్ ఉంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125సీసీ స్కూటర్‌ను ప్రత్యేకించి ఇండియన్ మార్కెట్ కోసం డిజైన్ చేశారు. యూరోపియన్ డిజైన్ ఫిలాసఫీతో వస్తున్న తొలి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ ఇదే. మార్కెట్ నిపుణుల అంచనా మేరకు, ఇది రూ. 67,000 నుండి రూ. 70,000 మధ్య ఎక్స్-షోరూమ్ ధరతో లభించే అవకాశం ఉంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ పూర్తి స్థాయిలో విడుదలైతే, మార్కెట్లో ఉన్న హోండా గ్రాజియా, అప్రిలియా ఎస్ఆర్ 125 మరియు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki Burgman Street India Launch Date Revealed
Story first published: Tuesday, July 3, 2018, 12:49 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X