సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ లాంచ్: ధర, ఇంజన్, ఫీచర్లు మరియు ప్రత్యేకతలు
సుజుకి టూ వీలర్స్ విపణిలోకి సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను లాంచ్ చేసింది. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 ప్రారంభ ధర రూ. 68,000 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
జపాన్‌కి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి టూ వీలర్స్ విపణిలోకి సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను లాంచ్ చేసింది. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 ప్రారంభ ధర రూ. 68,000 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
భారతదేశపు తొలిమ్యాక్సీ స్కూటర్ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ గురించి పూర్తి వివరాలు ఇవాళ్టి కథనంలో...

సుజుకి మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ఆవిష్కరించింది. అత్యంత విలాసవంతమైన మరియు ప్రీమియం ఫీల్ కలిగించే బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ డిజైన్ ఇండియన్ స్కూటర్లతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంటుంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ అత్యంత విభిన్నమైన స్కూటర్ అని చెప్పుకునేందుకు ఎన్నో అరుదైన మరియు అధునాతన ప్రత్యేకతలు దీని సొంతం. అంతర్జాతీయ విపణిలో ఉన్న బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ నుండి సేకరించిన ఫ్రంట్ ఏప్రాన్, విండ్ స్క్రీన్, సౌకర్యవంతమైన స్టెప్ అప్ సీటు మరియు స్టైలిష్ అండ్ షార్ప్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్ ఉంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌లో ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ ఏప్రాన్ మీద ఉన్న ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, మల్టీ-ఫంక్షన్ కీ స్లాట్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, ఫ్రంట్ ఏప్రాన్‌లో స్టోరేజ్ పాకెట్, మరియు 21.5-లీటర్ల విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ కలదు. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మొత్తం బరువు 108కిలోలుగా ఉంది మరియు 5.6-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటి ఉంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ప్రీమియం మ్యాక్సీ స్కూటర్‌లో 124.3సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ సీవీటీ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8.5బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సుజుకి పాపులర్ స్కూటర్ యాక్సెస్ 125లో కూడా ఇదే ఇంజన్ ఉంది.

మెరుగైన బ్రేకింగ్ కోసం బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌లో ముందు చక్రానికి నిస్సిన్ కంపెనీ నుండి సేకరించిన డిస్క్ బ్రేక్ మరియు వెనుక చక్రానికి డ్రమ్ బ్రేక్ అందివ్వడం జరిగింది. ఏ ఒక్క బ్రేక్ ప్రయోగించినా... బ్రేకింగ్ పవర్ రెండు చక్రాలకు సమానంగా సరఫరా చేసే కాంబి-బ్రేకింగ్ సిస్టమ్ స్టాండర్డ్ ఫీచర్‌గా వచ్చింది.

ఇందులో ముందు మరియు వెనుక వైపున వరుసగా 12-అంగుళాల మరియు 10-అంగుళాల పరిమాణంలో ఉన్న 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున హైడ్రాలిక్ టైప్ సింగల్ షాక్ అబ్జార్వర్ కలదు.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మూడు విభిన్న రంగుల్లో లభ్యమవుతోంది. అవి, మెటాలిక్ మ్యాట్ ఫైబ్రోయిన్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ మరియు పర్ల్ మిరేజ్ వైట్. బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్లను పూర్తి స్థాయిలో దేశీయంగా తయారు చేసి 30కి పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నారు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
సుజుకి టూ వీలర్స్ ఎట్టకేలకు బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను లాంచ్ చేసింది. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ యూరోపియన్ డిజైన్ శైలిలో వచ్చిన భారతదేశపు మొట్టమొదటి మ్యాక్సీ స్కూటర్. అగ్రెసివ్ డిజైన్‌లో ఉన్న బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ విపణిలో ఉన్న హోండా గ్రాజియా, టీవీఎస్ ఎన్‌టార్క్ 125 మరియు అప్రిలియా ఎస్ఆర్125 వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.


Click it and Unblock the Notifications








