సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ ధరల వివరాలు

సరికొత్త సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ ప్రారంభ ధర రూ. 69,671 లు ఎక్స్-షోరూమ్(ముంబాయ్‌)గా ఉన్నట్లు తెలిసింది.

By Anil Kumar

జపాన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం సుజుకి ఇండియన్ మార్కెట్లోకి తమ సరికొత్త సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను విడుదల చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. జూలై 19, 2018 న ఢిల్లీ వేదికగా విపణిలోకి ప్రవేశపెడుతున్నట్లు సుజకి ఇది వరకే ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ఈ నేపథ్యంలో సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధర రివీల్ అయ్యింది.

తాజాగా అందిన సమాచారం మేరకు, సరికొత్త సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ ప్రారంభ ధర రూ. 69,671 లు ఎక్స్-షోరూమ్(ముంబాయ్‌)గా ఉన్నట్లు తెలిసింది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధరలు

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను తొలుత 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదిక మీద ఆవిష్కరించింది. యూరోపియన్ మోడల్ ఆధారంగా మ్యాక్సీ-స్కూటర్ స్టైల్లో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్‌ను డిజైన్ చేశారు.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధరలు

సుజుకి టూ వీలర్స్ అంతర్జాతీయంగా బర్గ్‌మ్యాన్ స్కూటర్‌ను 125సీసీ నుండి 600సీసీ రేంజ్‌లో విక్రయిస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్ కోసం 125సీసీ వెర్షన్ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను మాత్రమే ఖరారు చేసింది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధరలు

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ ఫ్రంట్ డిజైన్ చాలా కొత్తగా ఉంటుంది. ఇండియాలో లభించే మిగతా అన్ని స్కూటర్లతో పోల్చుకుంటే ఇది ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, విభిన్న శైలిలో ఉన్న హ్యాండిల్ బార్ మరియు విండ్‌స్క్రీన్ స్కూటర్‌లో ప్రధాన హైలెట్‌గా నిలిచాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధరలు

బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ పూర్తి స్థాయిలో విడుదలైతే భారతదేశపు ప్రీమియం 125సీసీ స్కూటర్‌గా నిలవనుంది. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, విశాలమైన అండర్ సీట్ స్టోరేజ్, మల్టీ-ఫంక్షన్ కీ స్లాట్, లావుగా ఉన్న ఎగ్జాస్ట్ మఫ్లర్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్ మరియు విశాలమైన ఫుట్ బోర్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధరలు

సాంకేతికంగా సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌లో యాక్సెస్ 125 నుండి సేకరించిన అదే 124.3సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. సీవీటీ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 8.5బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధరలు

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌లో సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్క్ మరియు వెనుకవైపున మోనో షాక్ అబ్జార్వర్ ఉంది. బ్రేకింగ్ డ్యూటీ కోసం ఫ్రంట్ వీల్‌కు డిస్క్ మరియు రియర్ వీల్‌కు డ్రమ్ బ్రేక్ అందివ్వడం జరిగింది. అదే విధంగా ముందు వైపున 12- మరియు వెనుక వైపున 10-అంగుళాల పరిమాణంలో ఉన్న అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధరలు

డ్రైవ్‍‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ యూరోపియన్ మార్కెట్లో ప్రీమియం మ్యాక్సీ-స్కూటర్‌గా అమ్ముడవుతోంది. రహస్యంగా రివీల్ అయిన ధర ప్రకారం ఇండియాలో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 69,671లుగా ఉన్నట్లు తెలిసింది. కానీ దీని ధర ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధరలు

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ పూర్తి స్థాయిలో విపణిలోకి లాంచ్ అయితే, మార్కెట్లో ఉన్న టీవీఎస్ ఎన్‌టార్క్ మరియు హోండా గ్రాజియా వంటి స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.

More from DriveSpark

Source: BikeWale

Article Published On: Thursday, July 12, 2018, 17:41 [IST]
English summary
Read In Telugu: Suzuki Burgman Street Price Revealed Ahead Of Launch
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+