సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా: వీటిలో ఏది బెస్ట్ స్కూటర్?

ఇటీవల విడుదలైన స్కూటర్లను గమనిస్తే, సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, హోండా గ్రాజియా మరియు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఉన్నాయి. ఈ మూడు కూడా ఒకే సెగ్మెంట్‌కు చెందినవి. ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలనే అయోమయంలో ఉన్నా

By Anil Kumar

దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో స్కూటర్ల విభాగం శరవేగంగా పుంజుకుంటోంది. అందుకు బైకులతో పోటీపడుతున్న స్కూటర్ల విక్రయాలే నిదర్శనం. స్కూటర్లను ఎంచుకునే కస్టమర్లు పెరిగిపోవడంతో... కంపెనీలు కూడా వీలైనంత మార్కెట్ సొంతం చేసుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త స్కూటర్లను విడుదల చేస్తున్నాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన స్కూటర్లను గమనిస్తే, సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్, హోండా గ్రాజియా మరియు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఉన్నాయి. ఈ మూడు కూడా ఒకే సెగ్మెంట్‌కు చెందినవి. ఈ మూడింటిలో ఏది ఎంచుకోవాలనే అయోమయంలో ఉన్నారా...? అయితే ఇవాళ్టి కథనంలో... ధర, ఇంజన్, మైలేజ్, ఫీచర్లు మరియు డిజైన్ పరంగా బెస్ట్ స్కూటర్ ఏదో చూద్దాం రండి...

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

డిజైన్

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్:

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ఫ్రంట్ డిజైన్‌లో కండలు తిరిగిన శరీరాకృతిని గమనించవచ్చు, అగ్రెసివ్ ఫ్రంట్ ఏప్రాన్ మధ్యలో టర్న్ ఇండికేటర్ల్ మరియు ఎల్ఈడీ లైట్ల జోడింపుతో ఉన్న హెడ్‌ల్యాంప్ యూనిట్ కలదు. విభిన్నమైన హ్యాండిల్‌బార్ డిజైన్, ఫ్రంట్ విండ్‌స్క్రీన్ స్కూటర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. స్టైలిష్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, స్టెప్‌అప్ సీట్ మరియు అల్లాయ్ వీల్స్ స్కూటర్‌కు స్పోర్టివ్ లుక్ తీసుకొచ్చాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

టీవీఎస్ ఎన్‌టార్క్ 125:

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌ను స్టెల్త్ ఫైటర్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రేరణతో డిజైన్ చేశారు. ఉలితో చెక్కినట్లుగా ఉండే ఫ్రంట్ డిజైన్‌లో చక్కగా ఇమిడిపోయిన హెడ్‌ల్యాంప్‌ గమనించవచ్చు. స్కూటర్ సైడ్‌ ప్రొఫైల్‌లో పదునైన గీతలు, రియర్ వెనుక వైపున సిగ్నేచర్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, స్ల్పిట్ గ్రాబ్ రెయిల్ మరియు ఫైటర్ జెట్‌ను పోలి ఉండే ఎగ్జాస్ట్ పైపు ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

హోండా గ్రాజియా:

హోండా టూ వీలర్స్ తమ గ్రాజియా ప్రీమియం స్కూటర్‌ను యాక్టివా ఆధారంగా నిర్మించింది. గ్రాజియా ఫ్రంట్ డిజైన్‌లో ట్విన్-పోడ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ గల కండలు తిరిగిన ఫ్రంట్ ఏప్రాన్ కలదు. స్కూటర్ రియర్ డిజైన్‌లో పదునైన ఎడ్జీ డిజైన్ మరియు స్ల్పిట్ గ్రాబ్ రెయిల్స్ ఉన్నాయి.

డిజైన్ పరంగా ఓవరాల్ రేటింగ్

  • సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 9/10
  • టీవీఎస్ ఎన్‌టార్క్ 125 8.5/10
  • హోండా గ్రాజియా 8/10
  • సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

    ఫీచర్లు

    సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్:

    సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌లో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, ట్యూబ్‌లెస్ టైర్లు, మల్టీ-ఫంక్షన్ కీ స్లాట్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, ముందు వైపున చిన్న స్టోరేజ్ పాకెట్ మరియు 21.5-లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.

    సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

    టీవీఎస్ ఎన్‌టార్క్ 125

    ఫీచర్ల విషయంలో దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం అద్భుతం చేసిందనే చెప్పాలి. స్కూటర్ల పరిశ్రమంలో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి బ్లూటూత్ కనెక్టివిటి గల ఎల్‌సీడీ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చింది. ఇది స్కూటర్‌కు సంభందించిన టాప్ స్పీడ్, ల్యాప్ టైమర్, ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని తెలిపే ఇండికేటర్, చివరగా పార్క్ చేసినటువంటి ప్రదేశం, సగటు వేగం రికార్డ్ మరియు స్కూటర్‌కు సంభందించిన ఎంతో సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తుంటుంది.

    సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

    ప్రీమియం స్కూటర్ల విభాగంలో ఇతర మోడళ్లకు గట్టి పోటీనిచ్చేలా, ఇంజన్ కిల్ స్విచ్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, బాహ్యవైపున ఇచ్చిన ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్, 22-లీటర్ల సామర్థ్యం ఉన్న అండర్ సీట్ స్టోరేజ్, అల్లాయ్ వీల్స్ మరియు యూఎస్‌బీ స్టోరేజ్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

    సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

    హోండా గ్రాజియా

    ఎంట్రీ లెవల్ ప్రీమియం స్కూటర్ల సెగ్మంట్లోకి విడుదలైన మొదటి స్కూటర్ హోండా గ్రాజియా. ఇకో స్పీడ్ ఇండికేటర్ గల డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ గ్లోవ్ బాక్స్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్, ఆప్షనల్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్, సీట్ ఓపెనింగ్ గల ఫోర్-ఇన్-వన్-లాక్ మరియు 18-అంగుళాల అండర్ సీట్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

    ఫీచర్ల పరంగా ఓవరాల్ రేటింగ్

    • సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 8.5/10
    • టీవీఎస్ ఎన్‌టార్క్ 125 9/10
    • హోండా గ్రాజియా 8/10
    • సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

      ఇంజన్, గేర్‌బాక్స్ మరియు మైలేజ్

      సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్:

      బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ప్రీమియం స్కూటర్‌లో సాంకేతికంగా 124.3సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. సీవీటీ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 8.5బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

      • సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మైలేజ్: 50 కిమీ/లీ
      • సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

        టీవీఎస్ ఎన్‌టార్క్ 125

        ఎన్‌టార్క్ 125 స్కూటర్లో టీవీఎస్ బృందం అభివృద్ది చేసి, పరీక్షించిన తొలి 125సీసీ ఇంజన్‌ను అందించారు. ఇందులోని గాలితో చల్లబడే 124.79సీసీ సామర్థ్యం ఉన్న సింగల్ సిలిండర్ ఇంజన్ గరిష్టంగా 9.27బిహెచ్‌పి పవర్ మరియు 10.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైన ఇంజన్ ఇదే.

        • టీవీఎస్ ఎన్‌టార్క్ 125 మైలేజ్: 60 కిమీ/లీ
        • సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

          హోండా గ్రాజియా

          హోండా గ్రాజియా ప్రీమియం స్కూటర్‌లో సాంకేతికంగా 124.9సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ పెట్రోల్ ఇంజన్ కలదు. సీవీటీ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 8.52బిహెచ్‌పి పవర్ మరియు 10.54ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

          • హోండా గ్రాజియా మైలేజ్: 54 కిమీ/లీ
          • ఓవరాల్ రేటింగ్

            • సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 8/10
            • టీవీఎస్ ఎన్‌టార్క్ 125 8.5/10
            • హోండా గ్రాజియా 8/10
            • *అన్ని మైలేజ్ వివరాలు ఏఆర్ఐఏ రికార్డుల మేరకు ఇవ్వబడ్డాయి

              సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

              ధరలు

              సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ప్రారంభ ధర రూ. 68,000 లు,

              టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ప్రారంభ ధర రూ. 58,750 లు,

              హోండా గ్రాజియా రూ. 57,897 లు మరియు దీని టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 62,269 లు,అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

              సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

              తీర్పు

              గత ఆరు నెలల కాలంలో ప్రీమియం స్కూటర్ల విభాగంలోకి విడుదలైన హోండా గ్రాజియా, టీవీఎస్ ఎన్‌టార్క్ 125 మరియు సుజుకి బర్గ్‌‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్ల మధ్య పోటీ మరింత తీవ్రమైంది. మూడు మోడళ్లు కూడా డిజైన్, ఫీచర్లు, ఇంజన్ పనితీరు మరియు మైలేజ్ అంశాల పరంగా ఒకదానితో ఒకటితో తీవ్రంగా పోటీపడుతున్నాయి.

              సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ Vs టీవీఎస్ ఎన్‌టార్క్ 125 Vs హోండా గ్రాజియా

              ఫీచర్లతో నిండిన పర్ఫామెన్స్ స్కూటర్ కావాలనుకునే వారు టీవీఎస్ ఎన్‌టార్క్ 125 ఎంచుకోవచ్చు, డిజైన్ మరియు ఫీచర్లు ఉన్న స్కూటర్ కోసం చూస్తుంటే సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ తీసుకోవచ్చు. ఆరంభడాలు వద్దనుకునే కస్టమర్లు హోండా గ్రాజియా ఎంచుకోవచ్చు.

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki Burgman Street Vs TVS Ntorq 125 Vs Honda Grazia Comparison: Design, Specs, Features And Price
Story first published: Thursday, August 9, 2018, 18:15 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X