భారత్‌కు సుజుకి జిక్సర్ 250: విడుదల వివరాలు

సుజుకి టూ వీలర్స్ జిక్సర్ 250 బైకును 2019 ప్రారంభంలో విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది. జిక్సర్ 150 బైక్‌కు కొనసాగింపుగా జిక్సర్ 250 మోడల్‌ను అత్యంత సరసమైన ధరలో స్ట్రీట్ ఫైటర్ వెర్షన్‌లో విడుదల చేసి, ఆ

By Anil Kumar

దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలోని 150సీసీ బైకుల కెటగిరీలో సుజుకి జిక్సర్ 150 మంచి విక్రయాలు సాధిస్తోంది. కానీ ఇదే జిక్సర్ బ్రాండ్ పేరుతో 150 కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న బైకులను ప్రవేశపెట్టలేదు. అయితే, తాజాగా అందిన సమాచారం మేరకు, సుజుకి మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్ ఇండియా విపణిలోకి జిక్సర్ 250 బైకును విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది.

భారత్‌కు సుజుకి జిక్సర్ 250

సుజుకి టూ వీలర్స్ జిక్సర్ 250 బైకును 2019 ప్రారంభంలో విడుదల చేసేందుకు సన్నద్దమవుతోంది. జిక్సర్ 150 బైక్‌కు కొనసాగింపుగా జిక్సర్ 250 మోడల్‌ను అత్యంత సరసమైన ధరలో స్ట్రీట్ ఫైటర్ వెర్షన్‌లో విడుదల చేసి, ఆ తరువాత ఫెయిర్డ్ వెర్షన్‌లో పరిచయం చేసే అవకాశం ఉంది.

భారత్‌కు సుజుకి జిక్సర్ 250

సుజుకి ఖరీదైన మోటార్ సైకిళ్ల లైనప్‌లో ఉన్న జిఎస్ఎక్స్-ఎస్750 మరియు జిఎస్ఎక్స్-ఎస్1000 తరహాలో కండలు తిరిగిన రూపంలో ఈ జిక్సర్ 250 బైకును ఇండియన్ మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ది చేయనుంది. ఇందులో పలు విభిన్న డిజైన్ అంశాలు వచ్చే అవకాశం ఉంది.

భారత్‌కు సుజుకి జిక్సర్ 250

సుజుకి జిక్సర్ 250 బైకులో సాంకేతికంగా 250సీసీ సామర్థ్యం ఉన్న ఆయిల్-కూల్డ్ ఇంజన్ రానుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ 22 నుండి 25బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది.

భారత్‌కు సుజుకి జిక్సర్ 250

సుజుకి జిక్సర్ 250 బైకును కూడా జిక్సర్ 150 ఫ్లాట్‌ఫామ్ మీదనే నిర్మించనుంది. అందుకోసం, జిక్సర్ 150లోని అదే ఫ్రేమ్‌ను ఉపయోగించనుంది. అయితే, 250సీసీ ఇంజన్ కావడంతో ఫ్రేమ్‌ను మరితం పటిష్ట పరచనున్నారు. సస్పెన్షన్ పరంగా ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ రానున్నాయి.

భారత్‌కు సుజుకి జిక్సర్ 250

బ్రేకింగ్ డ్యూటీ కోసం రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు వచ్చే అవకాశం ఉంది. మెరుగైన బ్రేకింగ్ కోసం డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తప్పనిసరి ఫీచర్‌గా వస్తోంది. అయితే, వీలైనంత వరకు తక్కువ ధరలో విడుదల ప్రవేశపెట్టేందుకు బహుశా సింగల్-ఛానల్ ఏబిఎస్ మాత్రమే అందించే అవకాశం ఉంది.

భారత్‌కు సుజుకి జిక్సర్ 250

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

సుజుకి మోటార్‌సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి జిక్సర్ బ్రాండ్ పేరు మంచి విజయాన్ని సాధించిపెట్టింది. ఇప్పటి వరకు జిక్సర్ బ్రాండ్ క్రింద కేవలం 150సీసీ బైకులు మాత్రమే లభించేవి. అయితే ఇప్పుడు వీటికి కొనసాగింపుగా 250సీసీ మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టేందుకు సుజుకి సిద్దమైంది. సుజుకి జిక్సర్ 250 పూర్తి స్థాయిలో మార్కెట్లోకి విడుదలైతే విపణిలో ఉన్న యమహా ఎఫ్‌జడ్25 మోడల్‌కు గట్టి పోటీనిస్తుంది.

Most Read Articles

English summary
Read In Telugu: Suzuki To Introduce Gixxer 250 In India — Launch Details Revealed
Story first published: Wednesday, July 25, 2018, 10:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X