రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్ కోసం పర్ఫామెన్స్ సైలెన్సర్

ఇటలీకి చెందిన అగ్రగామి పర్ఫామెన్స్ ఎగ్జాస్ట్ తయారీ సంస్థ టెర్మిగ్నోని 2018 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ కోసం సరికొత్త స్లిప్-ఆన్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది.

By N Kumar

ఇటలీకి చెందిన అగ్రగామి పర్ఫామెన్స్ ఎగ్జాస్ట్ తయారీ సంస్థ టెర్మిగ్నోని 2018 రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్ కోసం సరికొత్త స్లిప్-ఆన్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను ఆవిష్కరించింది. రాయల్ ఎన్ఫీల్డ్ బైకుల్లో టెర్మిగ్నోని కంపెనీ సైలెన్సర్ పొందుతున్న ఏకైక మోడల్ హిమాలయన్.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ టెర్మిగ్నో ఎగ్జాస్ట్

రాయల్ ఎన్ఫీల్డ్ అత్యంత శక్తివంతమైన పలు ఇకానిక్ మోటార్ సైకిళ్లను తయారు చేస్తోంది. అయితే, అడ్వెంచర్ అవసరాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇంజన్‌తో లాంచ్ చేసిన హిమాలయన్ బైకు కోసం టెర్మిగ్నోని సైలెన్సర్ తయారు చేసింది. టెర్మిగ్నోని సైలెన్సర్ పొందుతున్న మొదటి రాయల్ ఎన్ఫీల్డ్ బైకు ఇదే.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ టెర్మిగ్నో ఎగ్జాస్ట్

టెర్మిగ్నోని కంపెనీ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కోసం రూపొందించిన సైలెన్సర్‌ను పూర్తి స్థాయిలో స్టెయిన్ లెస్ స్టీలుతో తయారు చేసింది. దీనికి చివరిలో బ్లాక్ క్యాంప్ అందించింది. రాయల్ ఎన్ఫీల్డ్ అందించిన సైలెన్సర్ కంటే టెర్మిగ్నోని సైలెన్సర్ చాలా తేలికగా ఉంటుంది మరియు ఇది బైకు మొత్తం బరువును రెండు కిలోలు వరకు తగ్గించింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ టెర్మిగ్నో ఎగ్జాస్ట్

టెర్మిగ్నోని స్లిప్-ఆన్ ఎగ్జాస్ట్ సిస్టమ్ ద్వారా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 0.7బిహెచ్‌పి పవర్ మరియు 1.65ఎన్ఎమ్ టార్క్ అధకంగా ప్రొడ్యూస్ చేసింది. కంపెనీ సైలెన్సర్‌తో పోల్చితే, టెర్మిగ్నోని సైలెన్సర్ గల రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్ పనితీరు మరియు ఆఫ్-రోడ్ పర్ఫామెన్స్ గణనీయంగా మెరుగుపడినట్లు గుర్తించడం జరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ టెర్మిగ్నో ఎగ్జాస్ట్

టెర్మిగ్నోని నుండి అందిన పర్ఫామెన్స్ వివరాల మేరకు, సరికొత్త టెర్మిగ్నోని ఎగ్జాస్ట్ సిస్టమ్ గల రాయల్ ఎన్పీల్డ్ హిమాలయన్ 23.7బిహెచ్‌పి పవర్ మరియు 31.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసింది. అయితే, అదే కంపెనీ సైలెన్సర్ గల హిమాలయన్ 23బిహెచ్‌పి పవర్ మరియు 30.8ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ టెర్మిగ్నో ఎగ్జాస్ట్

ప్రత్యేకంగా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ కోసం రూపొందించిన సరికొత్త టెర్మిగ్నోని పర్ఫామెన్స్ సైలెన్సర్ మీద లెజండీ మెటాలిక్ లోగో ఉంది. నేలకు సమాంతరంగా కాకుండా, కొద్దిగా ఏటవాలు ఎత్తులో అందించిన సైలెన్సర్ ఆఫ్ రోడ్ పర్ఫామెన్స్ మెరుగుపరించింది మరియు నీటిలో కూడా ఒక నిర్ణీత లోతు వరకు మునగలుగుతుంది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ టెర్మిగ్నో ఎగ్జాస్ట్

హిమాలయన్ కోసం రూపొందించిన టెర్మిగ్నోని ఎగ్జాస్ట్ సిస్టమ్‌లో సైలెన్సర్ అల్యూమినియం స్పేసర్, వాషర్ సైలెంట్ బ్లాక్, స్పేసర్ సైలెంట్ బ్లాక్, వాషర్ 8X24, సెల్ఫ్-లాకింగ్ నట్ M8, స్క్రూ M8X30 మరియు మెటల్ క్లాంప్ ఉన్నాయి.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ టెర్మిగ్నో ఎగ్జాస్ట్

సాంకేతికంగా రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో 411సీసీ కెపాసిటీ గల ఆయిల్/గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 24.5బిహెచ్‌పి పవర్ మరియు 32ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 182కిలోల బరువున్న హిమాలయన్ భారతదేశపు అత్యంత సరసమైన అడ్వెంచర్ మోటార్ సైకిల్.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ టెర్మిగ్నో ఎగ్జాస్ట్

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్లలో ఇటాలియన్ దిగ్గజం టెర్మిగ్నోని పర్ఫామెన్స్ ఎగ్జాస్ట్ తయారీ సంస్థ నుండి సైలెన్స్ పొందిన మొదటి మరియు ఏకైక మోడల్ హిమాలయన్ అడ్వెంచర్ బైకు. టెర్మిగ్నోని కంపెనీ జోడించిన స్లిప్-ఆన్ సైలెన్సర్‌తో హిమాలయన్ పర్ఫామెన్స్ పెరిగింది.

రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ టెర్మిగ్నో ఎగ్జాస్ట్

అందరినీ నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే... ఈ సైలెన్సర్ కేవలం యూరోపియన్ మార్కెట్లో మాత్రమే లభ్యమవుతోంది. మరియు ఇండియాకు దీనిని దిగుమతి చేసుకునేందుకు వీల్లేదు.

Most Read Articles

English summary
Read In Telugu: Termignoni Reveals Performance Exhaust For Royal Enfield Himalayan
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X