మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తే ఇంధన ధరల భారం అస్సలు ఉండదు. అంతే కాకుండా, కాలుష్యం కూడా తగ్గిపోతుంది. అదనంగా ఎలక్ట్రిక్ టూ వీలర్లు, కార్లు మరియు వాణిజ్య వాహనాలను కొనుగోలు చేసే వారికి ప్రభుత్వ రాయితీ కూ

By Anil Kumar

గత రెండు వారాల నుండి పెట్రోల్ మరియు డీజల్ ధరలు దేశవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు అన్ని నగరాల్లో కూడా ఇంధన ధరలు నాలుగేళ్ల గరిష్ట ధరను చేరుకున్నాయి. ముంబాయ్, హైదారాబాద్ మరియు బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో పెట్రోల్ ధర ఏకంగా 80 రుపాయలను దాటిపోయింది.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్ ధర సామాన్యుడి మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. బైకులు, స్కూటర్లు మరియు పెట్రోల్ కార్లను వినియోగించే ప్రజలు వీటిని వాడటం దండగ అని ప్రక్కన పెట్టేస్తున్నారు. ఇందుకు గల ఏకైక పరిష్కారం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగించడం.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

అవును ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తే ఇంధన ధరల భారం అస్సలు ఉండదు. అంతే కాకుండా, కాలుష్యం కూడా తగ్గిపోతుంది. అదనంగా ఎలక్ట్రిక్ టూ వీలర్లు, కార్లు మరియు వాణిజ్య వాహనాలను కొనుగోలు చేసే వారికి ప్రభుత్వ రాయితీ కూడా లభిస్తోంది.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

మరి, మీరు వాడుతున్న పెట్రోల్ టూ వీలర్లు మరియు బైకుల స్థానాన్ని భర్తీ చేసేందుకు మార్కెట్లో ఉన్న టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏవి ఉన్నాయో చుద్దామా... మరెందుకు ఆలస్యం క్రింది జాబితా మీద ఓ లుక్కేసుకోండి.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

5. ఒకినవ ప్రైజ్

రాజస్థాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థ ఒకినవ విపణిలోకి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రవేశపెట్టింది. అవి, ప్రైజ్ మరియు రిడ్జ్. ఈ రెండింటిలో ఏ స్కూటర్‌నైనా రూ. 2,000 లతో దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లోని 142 నగరాల్లో ఉన్న 200 ఒకినవ విక్రయ కేంద్రాల్లో బుక్ చేసుకోవచ్చు.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

ఒకినవ ప్రైజ్ ఇతర స్కూటర్లతో పోల్చితే ఎంతో విభిన్నంగా ఉంటుంది. ఇందులో వి-ఆకారంలో ఉన్నహెడ్ ల్యాంప్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, యాంటీ-థెప్ట్ సెన్సార్లు, కీలెస్ ఎంట్రీ, ఫైండ్ మై స్కూటర్ వంటి ఫీచర్లతో పాటు ఎకానమీ, స్పోర్ట్ మరియు టుర్బో అనే మూడు విభిన్న రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

సాంకేతికంగా ఒకినవ ప్రైజ్ స్కూటర్‌లో లెడ్ యాసిడ్ లేదా లిథియం-అయాన్ బ్యాటరీతో నడిచే బ్రష్‌లెస్ డిసి మోటార్ కలదు. లెడ్ యాసిడ్ బ్యాటరీ 6-8 గంటల్లో, లిథియం-అయాన్ బ్యాటరీ నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతాయి. ఒక్కసారిగా ఛార్జింగ్‌తో 170-200కిలోమీటర్ల వరకు నడుస్తుంది.

ఒకినవ ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 59,899 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

4. హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ ఎల్ఐ

దేశీయ దిగ్గజ ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ ఎల్ఐ స్కూటర్‌ను లిథియం-అయాన్ మరియు ఏజిఎమ్ విఆర్ఎల్ఎ అనే రెండు బ్యాటరీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంచింది. దేశవ్యాప్తంగా 35 రాష్ట్రాల్లో హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్ నెట్‌వర్క్ ఉంది.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ స్కూటర్‌లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్, యాంటీ-థెఫ్ట్ అలారమ్, అదే విధంగా పవర్ మరియు ఎకానమీ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

సాంకేతికంగా ఇందులో 1500వాట్ ఎలక్ట్రిక్ మోటార్ మరియు మల్టీ-స్టేజ్ హెవీ డ్యూటీ ఛార్జర్ ఉంది. దీని గరిష్ట వేగం గంటకు 45కిలోమీటర్లు మరియు ఒక్కసారి ఛార్జింగ్‌తో పవర్ మోడల్‌లో 65కిలోమీటర్లు మరియు ఎకానిమీ మోడ్‌లో 85కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

హీరో ఎలక్ట్రిక్ ఫోటాన్ ధర రూ. 52,790 ఎక్స్-షోరూమ(ఢిల్లీ)

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

3. హీరో ఎలక్ట్రిక్ నిక్స్ ఇ5

హీరో ఎలక్ట్రిక్ అందిస్తున్న స్కూటర్లలో ఎంచుకోదగిన మరో మోడల్ హీరో ఎలక్ట్రిక్ నిక్స్ ఇ5. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ కలదు. ఫుల్ ఛార్జింగ్ కోసం 4 గంటల సమయం పడుతంది. పూర్తి ఛార్జింగ్‌తో 60కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

హీరో నిక్స్ ఇ5 స్కూటర్‌లో స్టోరేజ్ స్పేస్, యాంటీ-థెఫ్ట్ అలారమ్, రెండేళ్ల పాటు ఉచిత వారంటీ మరియు ఒక ఏడాది ఉచిత రోడ్ సైడ్ అసిస్టెన్స్ కల్పిస్తోంది. ముందు నుండి చాడటానికి చిన్న స్కూటర్‌లా అనిపించినప్పటికీ దీని పొడవాటి వీల్ బేస్‌తో సాధారణ పెట్రోల్ స్కూటర్ తరహాలో ఉంటుంది.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

సాంకేతికంగా హీరో ఎలక్ట్రిక్ నిక్స్ ఇ5 స్కూటర్‌లో 250వాట్ బిడిఎల్‌సి మోటర్ కలదు. దీనికి లిథియం-అయాన్ బ్యాటరీ నుండి పవర్ అందుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 25కిలోమీటర్లుగా ఉంది.

హీరో ఎలక్ట్రిక్ నిక్స్ ఇ5 ధర రూ. 55,490 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

2. అథర్ ఎస్340

అథర్ ఎనర్జీ ఎలక్ట్రిక్ టూ వీలర్ల తయారీ సంస్థ సుమారుగా ఏడాది నుండి వాయిదా వేస్తూ వచ్చిన ఎస్340 స్కూటర్ విడుదలను ఎట్టకేలకు లాంచ్ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది జూన్‌లో అథర్ ఎస్340 విపణిలోకి రానుంది. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ కంపెనీ తమ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

అథర్ ఎస్340 స్కూటర్‌‌లో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటి గల 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇంస్ట్రుమెంట్ ప్యానల్, పార్క్ అసిస్ట్, న్యావిగేషన్ అసిస్ట్, వెహికల్ ఛార్జింగ్ పాయింట్ ట్రాకర్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. అదనంగా కాంబి బ్రేక్ సిస్టమ్, ఎల్ఇడి లైటింగ్, అండర్ సీట్ స్టోరేజ్ లైట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

అథర్ ఎస్340లో 2.2kWh లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది, దీని జీవిత కాలం 50,000 కిలోమీటర్లుగా ఉంది. కేవలం గంట వ్యవధిలోనే 80 శాతం ఛార్జింగ్ పూర్తవుతుంది. మరియు సింగల్ ఛార్జింగ్ మీద 60కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. 6.8పిఎస్ పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే దీని గరిష్ట వేగం గంటకు 72కిమీలుగా ఉంది.

అథర్ ఎస్340 ధర అంచనాగా రూ. 75,000 ఎక్స్-షోరూమ్(బెంగళూరు)గా ఉండవచ్చు.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

1. ట్వంటీ టూ మోటార్స్ ఫ్లో

ట్వంటీ టూ మోటార్స్ కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్లను తయారు చేసే అంకుర సంస్థ. ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన 2018 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ట్వంటీ టూ మోటార్స్ తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లో ను లాంచ్ చేసింది. ప్రస్తుతానికి, డీలర్లను విస్తరించుకునే పనిలో ఉంది. కొనుగోలకు ముందు డీలర్ల వద్ద టెస్ట్ రైడ్ చేసే అవకాశం లేదు, అయితే ట్వంటీ టూ మోటార్స్ వెబ్‍సైట్లో దీనిని కొనుగోలు చేయవచ్చు.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

సాంకేతింకగా ఇందులో డిసి మోటార్ కలదు, ఇది 2.8పిఎస్ పవర్ మరియు 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి లిథియం-అయాన్ బ్యాటరీ నుండి పవర్ అందుతుంది. కేవలం 2 గంటల్లో ఈ బ్యాటరీ 70 శాతం మరియు నాలుగు గంటల్లో పూర్తి ఛార్జ్ అవుతుంది.

మీ పెట్రోల్ స్కూటర్ల స్థానాన్ని భర్తీ చేసే ఐదు ఎలక్ట్రిక్ స్కూటర్లు

అత్యవసర సమయాల్లో లేదా తక్కువ దూరాలకు ప్రయాణించేందుకు కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో 20కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అయితే, ఫుల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 80కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అదే విధంగా దీని గరిష్ట వేగం గంటకు 60కిమీలుగా ఉంది. ట్వంటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఉంది, ఇది స్కూటర్లో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను వివరిస్తుంది.

ట్వంటీ టూ ఫ్లో ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 74,740 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ).

Most Read Articles

English summary
Read In Telugu: Top 5 Electric Scooters That Can Replace Your Petrol Scooter
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X