భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరలను తట్టుకునేందుకు ఉన్న ఏకైక మార్గం అధిక మైలేజీనిచ్చే బైకులను ఎంచుకోవడం.

By Anil Kumar

రోజు వారీగా మారే ఇంధన ధరల విధానంతో, పెట్రోల్ మరియు డీజల్ ధరలు ఏరోజుకారోజు విపరీతంగా పెరుగుతున్నాయి. గత రెండు వారాల్లో దేశవ్యాప్తంగా ఇంధన ధరలు ఐదేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. ఈ తరుణంలో, టూ వీలర్ల మీద ఆధారపడిన సామాన్యులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కుంటున్నాడు.

భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

అడ్డూ అదుపు లేకుండా పెరుగుతున్న పెట్రోల్ ధరలను తట్టుకునేందుకు ఉన్న ఏకైక మార్గం అధిక మైలేజీనిచ్చే బైకులను ఎంచుకోవడం. ఇవాళ్టి కథనంలో అత్యధిక మైలేజ్ ఇవ్వగల భారతదేశపు ఐదు బెస్ట్బై కుల గురించి తెలుసుకుందాం రండి...(కంపెనీ పేర్కొన్న మైలేజ్ మరియు వాస్తవ మైలేజ్ మధ్య వ్యత్యాసం ఉంటుంది)

భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

5. హీరో హెచ్ఎఫ్ బైకులు

దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ జపాన్ దిగ్గజాలకు ధీటుగా ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లోకి హెచ్ఎఫ్ సిరీస్ బైకులను ప్రవేశపెట్టింది. హెచ్ఎఫ్ సిరీస్ ప్రస్తుతం హెచ్ఎఫ్ డాన్, హెచ్ఎఫ్ డీలక్స్ మరియు హెచ్ఎఫ్ డీలక్స్ ఇకో అనే వేరియంట్లలో లభ్యమవుతోంది.

భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

సాంకేతికంగా అన్ని హీరో హెచ్ఎఫ్ సిరీస్ బైకుల్లో 97.2సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే 4-స్ట్రోక్ సింగల్ సిలిండర్ ఓవర్‌హెడ్‌క్యామ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8.36బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

మైలేజ్ మరియు ధర

  • హీరో హెచ్ఎఫ్ సిరీస్ మైలేజ్ లీటరుకు 88.5కిమీలు
  • హీరో హెచ్ఎఫ్ సిరీస్ ప్రారంభ ధర రూ. 38,877
  • భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    4. టీవీఎస్ స్పోర్ట్

    హోసూర్ కేంద్రంగా టూ వీలర్లను ఉత్పత్తి చేస్తున్న దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ విక్రయిస్తున్న టీవీఎస్ స్పోర్ట్ బెస్ట్ మైలేజ్ బైకుగా ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. ఎన్నో ఏళ్ల నుండి టీవీఎస్ అత్యధికంగా విక్రయిస్తున్న బైకుల్లో టీవీఎస్ స్పోర్ట్ ఒకటి.

    భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    సాంకేతికంగా టీవీఎస్ స్పోర్ట్ బైకులో 99.7సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ డ్యూరా లైఫ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 7.4బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    టీవీఎస్ స్పోర్ట్ మైలేజ్ లీటరుకు 95కిమీలు

    టీవీఎస్ స్పోర్ట్ ప్రారంభ ధర రూ. 40,035

    భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    3. బజాజ్ ప్లాటినా 100ఇఎస్

    బజాజ్ ప్లాటినా 100ఇఎస్ బైకును సిటి100 కంటే కొద్దిగా పై స్థానంలో ఉంచింది. రెండు బైకులు సాంకేతికంగా ఎన్నో విడి భాగాలను పంచుకున్నప్పటికీ రెండింటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ముందు వైపున టెలిస్కోపిక్ సస్పెన్షన్ మరియు వెనుక వైపున స్ప్రింగ్ షాక్ అబ్జార్వర్లతో సౌకర్యవంతమైన కమ్యూటర్ బైకుగా గుర్తింపు పొందింది.

    భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    సాంకేతికంగా బజాజ్ ప్లాటినా 100ఇఎస్ బైకులో 102సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ 2-వాల్వ్ డిటిఎస్-ఐ మరియు ఎగ్జాస్టెక్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 7.8బిహెచ్‌పి పవర్ మరియు 8.34ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    బజాజ్ ప్లాటినా 100ఇఎస్ మైలేజ్ లీటరుకు 96.9కిమీలు

    బజాజ్ ప్లాటినా 100ఇఎస్ ప్రారంభ ధర రూ. 47,667

    భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    2. బజాజ్ సిటి100

    బజాజ్ ఆటో లైనప్‌ నుండి బెస్ట్ మైలేజ్ బైకుల జాబితాలో నిలిచిన మరో కమ్యూటర్ బజాజ్ సిటి 100. బజాజ్ సిటి 100 ప్లాటినా 100ఇఎస్ తరహా సస్పెన్షన్ మరియు ఇతర ఫీచర్లతో కాకుండా సాధారణ ఫీచర్లతో ప్లాటినా కంటే క్రింది స్థానంలో ఉంది.

    భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    సాంకేతికంగా ఇందులో కూడా అదే 7.8బిహెచ్‌పి పవర్ మరియు 8.34ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేసే 102సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ 2-వాల్వ్ డిటిఎస్-ఐ ఇంజన్ కలదు. ప్రస్తుతం ఇది, సిటి 100బి, సిటి 100కెఎస్ అల్లాయ్ మరియు సిటి 100 ఇఎస్ అల్లాయ్ అనే వేరియంట్లలో లభ్యమవుతోంది.

    భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    బజాజ్ సిటి 100 మైలేజ్ లీటరుకు 99.1కిమీలు

    బజాజ్ సిటి 100 ప్రారంభ ధర రూ. 31,226

    భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    1. హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్

    మైలేజ్ విభాగంలో హీరో స్ల్పెండర్ ఓటమి ఎరుగుని ఛాంపియన్‌గా రాణిస్తోంది. గుర్గావ్‌కు చెందిన టూ వీలర్ల సంస్థ హీరో మోటోకార్ప్ ప్రపంచ అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థగా రాణించడంలో స్ల్పెండర్బై కుల పాత్ర ఎంతో ఉంది. అదనంగా హీరో పరిచయం చేసిన ఐ3ఎస్ టెక్నాలజీ హీరోలోని అన్ని బైకులను మైలేజ్ రారాజులుగా మార్చింది.

    భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    సాంకేతికంగా హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ బైకులో 97.2సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 8.1బిహెచ్‌పి పవర్ మరియు 8.05ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    భారతదేశపు 5 బెస్ట్ మైలేజ్ బైకులు

    హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ మైలేజ్ లీటరుకు 102కిమీలు

    హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్ ప్రారంభ ధర రూ. 52,300.

    అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ హైదరాబాదుగా ఇవ్వబడ్డాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Top 5 most fuel efficient bikes in India
Story first published: Friday, June 1, 2018, 13:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X