ఆటో ఎక్స్‌పో 2018: అదిరిపోయే బైకులు మరియు స్కూటర్లు విడుదల

By Anil

ఆటో ఎక్స్‌పో 2018: ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే భారతదేశపు అతి పెద్ద వాహన ప్రదర్శన ఇండియన్ ఆటో ఎక్స్‌పో ఈ ఏడాది ఫిబ్రవరి 9 నుండి 14 వరకు ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో జరిగింది. నేటితో ఆటో ఎక్స్‌పో ఈవెంట్ పూర్తవనుంది.

ఇప్పటి వరకు ఎన్నో కార్లు మరియు బైకుల తయారీ సంస్థలు తమ కొత్త మోడళ్లను ఆవిష్కరిస్తూ వచ్చాయి. ఆటో ఎక్స్‌పో 2018లో విడుదల చేసిన మరియు ఆవిష్కరించిన టూ వీలర్లలో అతి ముఖ్యమైన బైకులు మరియు స్కూటర్లు ఇవాళ్టి కథనంలో మీ కోసం...

ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

హోండా ఎక్స్-బ్లేడ్

హోండా టూ వీలర్స్ తమ ప్రీమియం కమ్యూటర్ మోటార్ సైకిల్ ఎక్స్-బ్లేడ్ బైకును ఆవిష్కరించింది. హోండా ఎక్స్-బ్లేడ్ పదునైన డిజైన్ లక్షణాలతో చూడటానికి చాలా విభిన్నంగా ఉంది. ఫుల్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. హోండా ఎక్స్-బ్లేడ్ విపణిలో ఉన్న సిబి యూనికార్న్ 160 మరియు సిబి హార్నెట్ 160 ఆర్ మధ్య స్థానాన్ని భర్తీ చేస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

హోండా ఎక్స్-బ్లేడ్ బైకులో సాంకేతికంగా హార్నెట్ నుండి సేకరించిన 162.7సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‍‌బాక్స్‌తో లభించే ఇది 13.93బిహెచ్‌పి పవర్ మరియు 13.9ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

హోండా ఎక్స్-బ్లేడ్ విపణిలో ఉన్న యమహా ఎఫ్‌జడ్, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 160 మరియు బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 160 బైకులకు గట్టి పోటీనిస్తుంది.

 • విడుదల అంచనా: మార్చి 2018 నాటికి
 • ధర అంచనా: రూ. 75,000 లు ఎక్స్-షోరూమ్
 • Recommended Video - Watch Now!
  New Honda Activa 5G Walkaround, Details, Specifications, First Look
  ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

  యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0

  యమహా ఇండియా విపణిలోకి సరికొత్త వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 బైకును ఆటో ఎక్స్‌పోలో విడుదల చేసింది. సరికొత్త వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 ప్రారంభ ధర రూ. 1.25 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

  ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

  మూడవ జనరేషన్ వైజడ్ఎఫ్ ఆర్15 బైకులో రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ డిజైన్, హెడ్‌ల్యాంప్, సరికొత్త ఫ్రంట్ ఫెయిరింగ్ మరియు సైడ్ డీకాల్స్ ఉన్నాయి. ఈ బైకులో సరికొత్త ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కలదు. అయితే, ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్స్ వంటి అతి ముఖ్యమైన ఫీచర్లు మిస్సయ్యాయి.

  ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

  యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 బైకులో సరికొత్త 155సీసీ కెపాసిసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభించే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్ గరిష్టంగా 19.3బిహెచ్‌పి పవర్ మరియు 15ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

  ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

  హోండా యాక్టివా 5జీ

  హోండా టూ వీలర్స్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో అతి పెద్ద సర్‌ప్రైజ్ తీసుకొచ్చింది. ఇండియాలో మోస్ట్ పాపులర్ స్కూటర్‌గా నిలిచిన యాక్టివా 3జీ మరియు 4జీ ఎడిషన్‌లకు కొనసాగింపుగా 2018 ఎడిషన్ యాక్టివా స్కూటర్‌ను 5జీ పేరుతో ఆవిష్కరించింది.

  ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

  డిజైన్ పరంగా యాక్టివా 5జీ స్కూటర్‌లో పెద్ద మార్పులేమీ చోటు చేసుకోలేదు. అయితే, ఇందులో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫుల్ ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, సరికొత్త అనలాగ్ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఫోర్-ఇన్-వన్ స్మార్ట్ లాక్ వంటి అతి ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి.

  ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

  న్యూ హోండా యాక్టివా 5జీ స్కూటర్‌లో సాంకేతికంగా అదే 109.19సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ సివిటి ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 8బిహెచ్‌పి పవర్ మరియు 9ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

  • విడుదల అంచనా: మార్చి 2018
  • ధర అంచనా: రూ. 53,000 ఎక్స్-షోరూమ్
  • ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

   సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్

   సుజుకి సరికొత్త ప్రీమియం స్కూటర్‌ను ఇండియన్ ఆటో ఎక్స్‌పో 2018లో ఆవిష్కరించింది. 125సీసీ కెపాసిటి గల ఇంజన్ ప్రీమియమ్ స్కూటర్ సెగ్మెంట్లో సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను తొలిసారిగా పరిచయం చేసింది.

   ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

   అంతర్జాతీయ విపణిలో ఉన్న సుజుకి ఫ్లాగ్‌షిఫ్ మోడల్ బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మోడల్‌ను ఇండియన్ మార్కెట్ కోసం అభివృద్ది చేసిన యాక్సెస్ 125 స్కూటర్‌తో అందించింది. పెద్ద పరిమాణంలో ఉన్న బాడీతో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ మ్యాక్సి స్కూటర్ శైలిలో ఉంటుంది.

   ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

   బర్గ్‌మ్యాన్ స్ట్రీట్‌లో శక్తివంతమైన యాక్సెస్ 125 స్కూటర్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, విభిన్న స్టైల్లో ఉన్న హ్యాండిల్ బార్, మరియు బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ డిజైన్ అంశాలు స్కూటర్‌ను ప్రీమియమ్ సెగ్మెంట్లోకి నెట్టేశాయి.

   • విడుదల అంచనా: 2018 మలి సగంలో
   • ధర అంచనా: రూ. 65,000 ఎక్స్-షోరూమ్
   • ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

    అప్రిలియా ఎస్ఆర్ 125

    ఇటాలియన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం అప్రిలియా 2018 ఇండియన్ ఆటో ఎక్స్-పో వేదికగా సరకొత్త అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్‌ను విడుదల చేసింది. ఇండియన్ 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లోకి విడుదలైన సరికొత్త ఎస్ఆర్ 125 ధర రూ. 65,310 లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

    ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

    అప్రిలియా ఎస్ఆర్ 125 చూడటానికి డిజైన్ పరంగా అచ్చం ఎస్ఆర్ 150 స్కూటర్‌ను పోలి ఉంటుంది. ఇందులోని అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఎస్ఆర్ 150 నుండి సేకరించినదే. డిజైన్ పరంగా ఎస్ఆర్ 125లో ఎలాంటి ప్రత్యేకతలు లేవని చెప్పవచ్చు.

    ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

    సాంకేతికంగా అప్రిలియా ఎస్ఆర్ 125 స్కూటర్లో 124సీసీ కెపాసిటి గల త్రీ-వాల్వ్, సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, సివిటి ట్రాన్స్‌మిషన్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 9.46బిహెచ్‌పి పవర్ మరియు 8.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్రిలియా ఎస్ఆర్ 125 విపణిలో ఉన్న టీవీఎస్ ఎన్‌టార్క్, హోండా గ్రాజియా మరియు సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్లకు గట్టి పోటీనివ్వనుంది.

    ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

    హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125

    హీరో మోటోకార్ప్ సరికొత్త మాయెస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్ ఆవిష్కరణతో ఇండియన్ 125సీసీ స్కూటర్ సెగ్మెంట్లోకి ప్రవేశించింది. రెగ్యులర్ మాయెస్ట్రో 110 స్కూటర్‌తో పోల్చుకుంటే మాయెస్ట్రో ఎడ్జ్ 125 స్కూటర్లో పలు కాస్మొటిక్ అప్‌డేట్స్ చోటు చేసుకున్నాయి. మాయెస్ట్రో ఎడ్జ్ 125తో పాటు డ్యూయట్ 125 స్కూటర్‌ను కూడా ఆవిష్కరించింది.

    ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

    హీరో మాయెస్ట్రో ఎడ్జ్ 125 మరియు డ్యూయట్ 125 పర్ఫామెన్స్ స్కూటర్లలో 125సీసీ కపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. సివిటి ట్రాన్స్‌మిషన్ గల ఈ ఇంజన్ 8.7బిహెచ్‌పి పవర్ మరియు 10.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

    హీరో మోటోకార్ప్ తమ రెండు 125 స్కూటర్లలో ఐ3ఎస్ (ఐడిల్ స్టార్ట్/స్టాప్ టెక్నాలజీ)అదించింది. దీనితో పాటు అనలాగ్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఇడి టెయిల్ ల్యాంప్ మరియు బాహ్యవైపున అందించిన ఫ్యూయల్ ఫిల్లింగ్ క్యాప్ ఉన్నాయి.

    • విడుదల అంచనా: 2018 లేదా 2019లో
    • ధర అంచనా: రూ. 56,000 ఎక్స్-షోరూమ్
    • ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

     అప్రిలియా టువోనో 150/ ఆర్ఎస్ 150

     ఇటాలియన్ టూ వీలర్ల తయారీ దిగ్గజం అప్రిలియా ఇప్పటి వరకు ఇండియన్ మార్కెట్లోకి కేవలం స్కూటర్లను మాత్రమే ప్రవేశపెట్టింది. అయితే, 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో ద్వారా రెండు ఎంట్రీ లెవల్ బైకులను పరిచయం చేసింది. అవి, టువోనో 150(Tuono 150) మరియు ఆర్ఎస్ 150(RS 150).

     ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

     టువోనో 150 నేక్డ్ వెర్షన్ మోటార్ సైకిల్ మరియు ఆర్ఎస్ 150 ఫుల్లీ ఫెయిర్డ్ మోటార్ సైకిల్. రెండింటిలో కూడా ఒకే 150సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 18బిహెచ్‌పి పవర్ మరియు 14ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

     ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

     అప్రిలియా ఈ రెండు బైకులను అత్యుత్తమ నిర్మాణ విలువలతో నిర్మించింది. అగ్రెసివ్ డిజైన్ మరియు రైడింగ్ డైనమిక్స్ వీటి సొంతం. ఇవి విపణిలో ఉన్న ఎంట్రీ లెవల్ స్పోర్ట్స్ బైకు యమహా వైజడ్ఎఫ్ ఆర్15 వి3.0 కు గట్టి పోటీనిస్తాయి.

     • విడుదల అంచనా: 2018 చివరికి లేదా 2019 ప్రారంభంలో
     • ధర అంచనా: రూ. 1.5 లక్షలు ఎక్స్-షోరూమ్
     • ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

      హోండా సిబిఆర్ 250ఆర్

      హోండా టూ వీలర్స్ 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పో ద్వారా పాపులర్ సిబిఆర్ 250ఆర్ మోటార్ సైకిల్‌ను ఇండియాకు తీసుకొచ్చింది. క్వార్టర్ లీటర్ మోటార్ సైకిల్‌లో సరికొత్త ఎల్ఇడి హెడ్‌ల్యాంప్, నూతన బాడీ గ్రాఫిక్స్, కొత్త కలర్ ఆప్షన్స్, డ్యూయల్ ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

      ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

      సాంకేతికంగా 2018 హోండా సిబిఆర్ 250ఆర్ స్పోర్ట్స్ బైకులో 249.6సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. బిఎస్-IV ఉద్గార నియమాలను పాటించే 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఈ ఇంజన్ 26బిహెచ్‌పి పవర్ మరియు 22ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

      ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

      సరికొత్త 2018 హోండా సిబిఆర్ 250ఆర్ విపణిలో ఉన్న యమహా ఫేజర్ 25 మరియు కెటిఎమ్ ఆర్‌సి 200 బైకులకు గట్టి పోటీనివ్వనుంది.

      • విడుదల అంచనా: 2018 మలి సగంలో
      • ధరఅంచనా: రూ. 2.05 లక్షలు ఎక్స్-షోరూమ్
      • ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       సరికొత్త యమహా ఆర్3

       జపాన్ దిగ్గజం 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో సరికొత్త ఆర్3 సూపర్ స్పోర్ట్స్ బైకును లాంచ్ చేసింది. సరికొత్త యమహా ఆర్3 ప్రారంభ ధర రూ. 3.48 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       సరికొత్త యమహా ఆర్3 బైకులో అదే సిగ్నేచర్ ట్విన్ హెడ్‌ల్యాంప్ సిస్టమ్, ముందు వైపు పెద్ద పరిమాణంలో ఉన్న ఫెయిరింగ్ కలదు. అయితే, ఆర్3 మోటార్ సైకిల్ ఓవరాల్ డిజైన్‌లో సరికొత్త గ్రాఫిక్స్, కలర్ ఆప్షన్స్ మరియు రీఫ్రెష్డ్ లుక్‌లో ఉంది.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       సాంకేతికంగా యమహా ఆర్3 స్పోర్ట్స్ బైకులో 321సీసీ కెపాసిటి గల ఇన్-లైన్ ట్విన్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ గల ఇది గరిష్టంగా 41బిహెచ్‌పి పవర్ మరియు 29.6ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. యమహా ఆర్3 విపణిలో ఉన్న కెటిఎమ్ ఆర్‌సి 390, టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310, కవాసకి నింజా 300 మరియు బెనెల్లీ 302ఆర్ మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ

       అమెరికా దిగ్గజ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ యుఎమ్ మోటార్స్ సైకిల్స్ ఇండియన్ ఆటో ఎక్స్‌పో వేదికగా రెనిగేడ్ డ్యూటీ బైకును రెండు విభిన్న వేరియంట్లలో విడుదల చేసింది. అవి, యుఎమ్ రెనిగేడ్ డ్యూటీ ఎస్ మరియు డ్యూటీ ఏస్. దీని ప్రారంభ ధర రూ. 1.10 లక్షలు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       రెనిగేడ్ డ్యూటీ ఎస్ మరియు డ్యూటీ ఏస్ రెండు బైకుల్లో కూడా డిజిటల్-అనలాగ్ ఇంస్ట్రుమెంట్ కస్టర్, ఎల్ఇడి హెడ్‌ల్యాంప్ ఉన్నాయి. రెనిగేడ్ డ్యూటీ సిరీస్ బైకులు విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు అవెంజర్ సిరీస్ బైకులకు గట్టి పోటీనిస్తాయి.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       యుఎమ్ మోటార్ సైకిల్స్ సాంకేతికంగా తమ రెనిగేడ్ డ్యూటీ సిరీస్ బైకుల్లో సరికొత్త 223సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఎయిర్ లేదా ఆయిల్ కూల్డ్ ఇంజన్ అందించింది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభించే ఈ ఇంజన్ గరిష్టంగా 16బిహెచ్‌పి పవర్ మరియు 17ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ సూపర్ బైకు

       ఎంఫ్లక్స్ మోటార్స్ ఆటో ఎక్స్‌పో వేదికగా భారతదేశపు తొలి ఎలక్ట్రిక్ సూపర్ బైకును విడుదల చేసింది. ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్ రెగ్యులర్ వేరియంట్ ధర రూ . 6 లక్షలు మరియు టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ. 11 లక్షలు ఎక్స్-షోరూమ్‍‌‌గా ఉన్నాయి.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       ఎంఫ్లక్స్ వన్ టాప్ ఎండ్ వేరియంట్ ఎలక్ట్రిక్ సూపర్ బైకులో, ఓహ్లిన్ సస్పెన్షన్ సిస్టమ్, కార్బన్ ఫైబర్ బాడీ ప్యానల్స్ మరియు ఫోర్జ్‌డ్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఎంఫ్లక్స్ తమ వన్ ఎలక్ట్రిక్ బైకును ఇండియన్ మార్కెట్లో 199 యూనిట్లను మరియు అంతర్జాతీయంగా కేవలం 300 సంఖ్యలో లిమిటెడ్‌గా మాత్రమే విక్రయించనుంది.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       ఎంఫ్లక్స్ వన్ ఎలక్ట్రిక్ బైకులో 3 ఫేస్ లిక్విడ్ కూల్డ్ ఏసి ఇండక్షన్ మోటార్ నుండి వెనుక చక్రానికి పవర్ అందుతుంది. 9.7kWh సామర్థ్యం ఉన్న బ్యాటరీ నుండి ఎలక్ట్రిక్ మోటార్‌కు పవర్ సరఫరా అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 80.4బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది, అయితే 71బిహెచ్‌పి వరకు మాత్రమే పరిమితి పెట్టారు.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ కాన్సెప్ట్

       టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్పటి వరకు ప్రయత్నించని క్రూయిజర్ సెగ్మెంట్లోకి సరికొత్త మోడల్‌ను కాన్సెప్ట్ వెర్షన్‌లో ఆవిష్కరించింది. ప్యూచరిస్టిక్ డిజైన్ శైలిలో, క్లాసిక్ లుక్‌లో అత్యాధునిక టెక్నాలజీని జోడించి జెప్లిన్ క్రూయిజర్ కాన్సెప్ట్ బైకును రూపొందించింది.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       సాంకేతికంగా టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్ బైకులో 220సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. దీనితో పాటు టీవీఎస్ మోటార్ కంపెనీ పేటెంట్ హక్కులు పొందిన ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ సిస్టమ్ ఇ-బూస్ట్ పేరుతో జెప్లిన్ బైకులో అందించింది. ఇంజన్ సులభంగా స్టార్ట్ అవ్వడానికి మరియు అత్యుత్తమ మైలేజ్ మరియు పనితీరు కనబరచడంలో ఈ సిస్టమ్ ఎంతగానో తోడ్పడుతుంది.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       టీవీఎస్ మోటార్స్ జెప్లిన్ క్రూయిజర్ కాన్సెప్ట్ బైకులో 1,200వాట్ రీజనరేటివ్ అసిస్ట్ మోటార్ కలదు. ఈ మోటార్ 48వోల్ట్ లిథియ్-అయాన్ బ్యాటరీ నుండి పనిచేసి క్రూయిజర్ బైక్ డిమాండ్ చేసినపుడు 20 శాతం అదనపు టార్క్ ఎలక్ట్రిక్ మోటర్ నుండి అందుతుంది. టీవీఎస్ జెప్లిన్ క్రూయిజర్‌ను ప్రత్యేకించి లాంగ్ రైడ్ అవసరాల కోసం అభివృద్ది చేసింది.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       హీరో ఎక్స్‌పల్స్

       హీరో మోటోకార్ప్ ఎక్స్‌పల్స్ ఎంట్రీ లెవల్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. అతి తక్కువ డిజైన్ లక్షణాలతో, ఎత్తైన రైడింగ్ పొజిషన్ మరియు లాంగ్ ట్రావెల్ గల సస్పెన్షన్ సిస్టమ్, లగేజ్ ర్యాక్స్ మరియు గుండ్రటి ఆకారంలో ఉన్న హెడ్ ల్యాంప్ మరియు ఆఫ్ రోడ్ కండీషన్ కోసం ప్రత్యేకమైన ఇంజన్ గార్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌లో హీరో మోటోకార్ప్ సాంకేతికంగా 200సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే ఫ్యూయల్ ఇంజెక్టెడ్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఇంజన్ 18.1బిహెచ్‍‌‌పి పవర్ మరియు 17.2ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

       ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

       హీరో మోటోకార్ప్ తమ ఎక్స్‌పల్స్ అడ్వెంచర్ బైకులో ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ టర్న్-బై-టర్న్ న్యావిగేషన్ సిస్టమ్ కలదు. ప్రత్యేకించి లాంగ్ రైడింగ్‌లో ఈ ఫీచర్ ఎంతోగానో ఉపయోగపడుతుంది.

       • విడుదల అంచనా: 2018 చివరి నాటికి
       • ధర అంచనా: రూ. 1.2 లక్షలు ఎక్స్-షోరూమ్
       • ఆటో ఎక్స్‌పో 2018లో విడుదలైన బెస్ట్ బైకులు మరియు స్కూటర్లు

        డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

        ఆటో ఎక్స్‌పో 2018 విభిన్న స్కూటర్లు మరియు బైకుల విడుదల, ఆవిష్కరణ మరియు ప్రదర్శనలతో నిండిపోయింది. ఎంట్రీ లెవల్ మోడళ్ల నుండి అత్యంత ఖరీదైన బైకుల వరకు ఎన్నో ఉత్పత్తుల ఆటో ఎక్స్‌పోలో కొలువుదీరాయి. వాటిలో ఇండియన్ మార్కెట్ కోసం అతి ముఖ్మమైన మోడళ్లను డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఈ జాబితాలో మీకోసం ప్రత్యేక కథనం ద్వారా అందించింది. ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి....

Most Read Articles

English summary
Read In Telugu: Top Best Bikes & Scooters At Auto Expo 2018: Launches, Unveils And Concepts
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X