ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ రీకాల్

ట్రైయంప్ మోటార్ సైకిల్స్ ఇండియాలో విక్రయించిన స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకులను భద్రత దృష్ట్యా రీకాల్ చేసినట్లు ప్రకటించింది. కంపెనీ కథనం మేరకు దేశీయంగా సుమారు 100 యూనిట్ల వరకు రీకాల్‌కు గురైనట్లు తెలి

By Anil Kumar

బ్రిటన్‍కు చెందిన దిగ్గజ సూపర్ బైకుల తయారీ సంస్థ ట్రైయంప్ మోటార్ సైకిల్స్ ఇండియాలో విక్రయించిన స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకులను భద్రత దృష్ట్యా రీకాల్ చేసినట్లు ప్రకటించింది. కంపెనీ కథనం మేరకు దేశీయంగా సుమారు 100 యూనిట్ల వరకు రీకాల్‌కు గురైనట్లు తెలిసింది.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ రీకాల్

రీకాల్ అయిన బైకుల ఓనర్లను ట్రయంప్ డీలర్లు ఫోన్ ద్వారా సంప్రదించి సమస్యను పరిష్కరిస్తారు. అయితే, సాంకేతిక లోపం ఉన్న భాగాన్ని రిపేరీ చేస్తారా... లేదంటే దాని స్థానంలో కొత్త దానిని అందిస్తారా... అనేది తెలియరాలేదు.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ రీకాల్

రీకాల్‌కు గల ప్రధాన కారణం, స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకుల్లో లెఫ్ట్-హ్యాండ్ స్విచ్ గేర్‍‌ క్యూబ్ పలు సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది. హ్యాండిల్ బార్ ఎడమ వైపు ఉన్న స్విచ్ గేర్‌లోకి నీరు వెళ్లినపుడు ఇండికేటర్లు మరియు హై-బీమ్ ల్యాంప్ తప్పుగా పనిచేస్తున్నట్లు గుర్తించారు.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ రీకాల్

తయారీ సమయంలో స్విచ్ గేర్ సీలింగ్ సరిగ్గా చేయకపోవడంతోనే ఇలా జరిగినట్లు తెలిసింది. వర్షం పడినపుడు మరియు వాటర్ సర్వీసింగ్ చేసినపుడు నీరు చాలా ఈజీగా స్విచ్ సిస్టమ్‌లోకి వెళుతున్నట్లు గుర్తించడం జరిగింది.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ రీకాల్

లెఫ్ట్ స్విచ్‍గేర్ సమస్య కారణంగా ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్‌లో ఎలక్ట్రిక్ సమస్యలు తలెత్తే ఛాన్స్ కూడా ఉంది. ప్రత్యేకించి, టర్న్ ఇండికేటర్లు, హార్న్ మరియు హెడ్ ల్యాంప్ పనితీరు దెబ్బతింటుంది. రాత్రి వేళల్లో హెడ్ ల్యాంప్ ఫెయిల్ అయితే భారీ ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నాయి.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ రీకాల్

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకు 2017లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలయ్యింది. దీని ప్రారంభ ధర రూ. 10.55 లక్షలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. ఇది స్ట్రీట్ ట్రిపుల్ ఎస్ మరియు స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ అనే రెండు వేరియంట్లలో లభిస్తోంది.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ రీకాల్

వీటిలో ఎస్ వేరియంట్లో ఎలాంటి సమస్యలు తలెత్తలేదు, ఆర్ఎస్ వేరియంట్లో మాత్రమే స్విచ్ గేర్ సమస్య ఉన్నట్లు గుర్తించి కస్టమర్ల భద్రత దృష్ట్యా రీకాల్ చేశారు. సాంకేతికంగా ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకులో 765సీసీ కెపాసిటి గల మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజన్ కలదు.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ రీకాల్

6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 121బిహెచ్‍‌‌పి పవర్ మరియు 77ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మునుపటి తరానికి చెందిన స్ట్రీట్ ట్రిపుల్‌తో పోల్చుకుంటే గత ఏడాది విడుదలైన మోడల్‌లో ఎన్నో అప్‌డేట్స్ జరిగాయి. ఈ పర్ఫామెన్స్ బైకులో సుమారుగా 80 కొత్త పరికరాలను అందించినట్లు తెలిసింది.

ట్రయంప్ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ రీకాల్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ట్రయంప్ ఇండియా విభాగం తమ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ఎస్ బైకుల్లో తలెత్తిన స్విచ్ గేర్ సమస్య కారణంగా రీకాల్ చేసింది. సమస్య చిన్నదే కావచ్చు, కానీ దీని పర్యావసానాలు తీవ్రంగా ఉంటాయనే ఉద్దేశ్యంతో తమ విలువైన కస్టమర్ల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని రీకాల్ చేసినట్లు ప్రకటించింది. ట్రంయప్ డీలర్లు ఈ సమస్యను పూర్తి ఉచితంగా పరిష్కరించనున్నారు.

Most Read Articles

English summary
Read In Telugu: Triumph Street Triple RS Recalled In India Over Switchgear Issue
Story first published: Wednesday, May 30, 2018, 10:58 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X