ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ఫీచర్లు

ట్రాంక్స్ మోటార్స్ మార్కెట్లోకి సరికొత్త ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేసింది. ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ క్రాసోవర్ బైకు మరియు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ. 49

By Anil Kumar

విపణిలోకి ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్ (సైకిల్) విడుదలయ్యింది. స్మార్ట్రాన్ కంపెనీ భాగస్వామ్యపు సంస్థ ట్రాంక్స్ మోటార్స్ మార్కెట్లోకి సరికొత్త ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేసింది. ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశపు మొట్టమొదటి స్మార్ట్ క్రాసోవర్ బైకు మరియు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ. 49,999లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ఫీచర్లు

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్ పరిమిత సంఖ్యలో మరియు ముందస్తు బుకింగ్ చేసుకున్న వారికి పరిచయాత్మక ధరలో లభ్యమవుతోంది. ట్రాంక్స్ మోటార్స్ ప్రవేశపెట్టిన ట్రాక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు వచ్చే వారం నుండి ప్రారంభమవుతాయి.

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ఫీచర్లు

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ బైకును పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో దేశీయంగా డిజైన్ చేసి అభివృద్ది చేశారు. ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ బైకులో రియర్ హబ్ వద్ద 250వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు.

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ఫీచర్లు

ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్‌కు తేలికపాటి బరువున్న మరియు డిటాచబుల్ 36V 13.6Ah 500W లిథియం-అయాన్ బ్యాటరీ నుండి పవర్ అందుతుంది. ట్రాంక్స్ వన్ సింగల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 50కిలోమీటర్లు నిరంతరం నడుస్తుంది.

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ఫీచర్లు

అయితే, ఇందులోని ఎలక్ట్రికానిక్ గేర్ అసిస్ట్ మోడ్ ద్వారా ఈ పరిధిని 70 నుండి 85కిలోమీటర్లకు పెంచుకోవచ్చు. ఎలక్ట్రిక్ పవర్ మీద వెళుతున్నపుడు ఈ ట్రాంక్స్ వన్ సైకిల్ ద్వారా గరిష్టంగా గంటకు 25కిలోమీటర్ల వేగాన్ని అందుకోవచ్చు.

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ఫీచర్లు

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్‌లో పలు విభిన్న రైడింగ్ మోడ్స్, మూడు ఎలక్ట్రిక్ గేర్లు మరియు 6-షిమానో షిఫ్టర్ వంటివి ఉన్నాయి. ఇందులోని షిమానో షిఫ్టర్ ఎలక్ట్రిక్ సైకిల్ యొక్క పరిధిని మరియు వేగాన్ని పొడగించి మరియు అడ్జెస్ట్ చేస్తుంది.

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ఫీచర్లు

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ ఫ్రేమ్‌ను ఏరో-గ్రేడ్ అల్లాయ్ మెటీరియల్‌తో తయారు చేశారు. ఈ మెటీరియల్‌ను విమానాల తయారీకి వాడుతారు. ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ బైక్ "టిబైక్" స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ అనుసంధానం కలిగి ఉంది. ఇది సైకిల్ యొక్క రేంజ్, ప్రయాణించిన దూరం, కరిగించిన కెలోరీలు ఇంకా ఎంతో సమాచారాన్ని చూపిస్తుంది.

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ఫీచర్లు

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ తొలుత 9 భారత నగరాల్లో లభ్యం కానుంది. అవి, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబాయ్, పూనే, గోవా, చంఢీగర్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, చెన్నై మరియు బెంగళూరు. ఫ్యూచర్‌లో మరిన్ని నగరాల్లో దీనిని అందుబాటులోకి తీసుకురానున్నారు.

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల: ధర, వేరియంట్లు మరియు ఫీచర్లు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ట్రాంక్స్ వన్ ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశపు మొట్టమొదటి క్రాసోవర్ ఎలక్ట్రిక్ బైక్. డిజైన్ పరంగా చాలా సన్నగా ఉండే దీనిని తేలికపాటి బరువుతో ధృడమైన మెటీరియల్‌తో నిర్మించారు. దీనికి తోడు ఎన్నో అత్యాధునిక ఫీచర్లను కూడా అందించారు. కానీ దీని ధర ఏకంగా రూ. 50,000 లుగా ఉంది. నిజానికి ఈ ధరకు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు లభ్యమవుతున్నాయి.

Most Read Articles

English summary
Read In Telugu: Tronx One Electric Bike Launched In India; Priced At Rs 49,999
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X