టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310 బైకు కెటిఎమ్ ఆర్‌సి 3980 కంటే మెరుగైనదేనా... తాజా ఫలితాలు ఏమంటున్నాయి?

టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క అతి ముఖ్యమైన మరియు అత్యంత ఖరీదైన మోటార్ సైకిల్ అపాచే ఆర్ఆర్310 సేల్స్, కెటిఎమ్ డ్యూక్ మరియు ఆర్‌సి 390 బైకుల సంయుక్త విక్రయాలను దాటేసింది.

By Anil Kumar

టీవీఎస్ మోటార్ కంపెనీ యొక్క అతి ముఖ్యమైన మరియు అత్యంత ఖరీదైన మోటార్ సైకిల్ అపాచే ఆర్ఆర్310 సేల్స్, కెటిఎమ్ డ్యూక్ మరియు ఆర్‌సి390 బైకుల సంయుక్త విక్రయాలను దాటేసింది.

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310

తాజాగా విడుదలైన సేల్స్ రిపోర్ట్స్ మేరకు, టీవీఎస్ అపాచే ఆర్ఆర్310 బైకు మాత్రమే రెండు కెటిఎమ్ 390 బైకుల సేల్స్‌ను దాటేసింది. అవును గడిచిన మార్చి 2018లో 983 యూనిట్ల టీవీఎస్ అపాచే ఆర్ఆర్310 బైకులు అమ్ముడవ్వగా, కెటిఎమ్ డ్యూక్ 390 మరియు ఆర్‌సి 390 బైకుల రెండింటి సేల్స్ 716 యూనిట్లుగా నమోదయ్యాయి.

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310

టీవీఎస్ అపాచే ఆర్ఆర310 స్పోర్ట్స్ మోటార్‌సైకిల్‌కు డిమాండ్ పెరుగుతూనే ఉంది. ఇటీవల టీవీఎస్ అపాచే ఆర్ఆర్310 బైకు ధరలను పెంచినప్పటికీ, దీని మీద ఆదరణ మరియు డిమాండ్ ఏ మాత్రం తగ్గడం లేదు. విడుదలైయ్యి ఇంత కాలమైన ఇంకా దీని మీద వెయిటింగ్ పీరియడ్ అలాగే ఉంది.

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310

ధరల పెంపు అనంతరం టీవీఎస్ అపాచే ఆర్ఆర్310 ధర రూ. 2.23 లక్షలుగా ఉంది. అయితే, కెటిఎమ్ డ్యూక్ 390 మరియు ఆర్‌సి390 ధరలు వరుసగా రూ. 2.29 లక్షలు మరియు రూ. 2.36 లక్షలు అన్ని ధరలు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉన్నాయి.

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310

కెటిఎమ్ 390 సిరీస్‌లోని రెండు బైకుల్లో కూడా 373సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల రెండు బైకుల్లోని ఇంజన్ 43బిహెచ్‌పి పవర్ మరియు 36ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310

టీవీఎస్ అపాచే ఆర్ఆర్310 విషయానికి వస్తే, ఇందులో బిఎమ్‌డబ్ల్యూ ఇంజనీరింగ్ బృందం అభివృద్ది చేసిన 313సీసీ కెపాసిటి గల రివర్స్ ఇంక్లైన్, సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ సింక్రోమెష్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310

టీవీఎస్ మోటార్ కంపెనీ విపణిలోకి ప్రవేశపెట్టిన తొలి ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ మోటార్ సైకిల్ అపాచే ఆర్ఆర్310. బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ బైక్ ఆధారంగా అపాచే ఆర్ఆర్ 310 బైకును రూపొందించారు. ఇందులో, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు గల బై-ఎల్ఇడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్ఇడి టైయిల్ ల్యాంప్స్ మరియు పొడవుగా ఉన్న ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్310లో డ్యూయల్-ఛానల్ యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ తప్పనిసరిగా వచ్చింది. కయాబా నుండి సేకరించిన ముందు వైపున 300ఎమ్ఎమ్ మరియు వెనుక వైపున 240ఎమ్ఎమ్ డిస్క్ బ్రేకులు ఉన్నాయి. సస్పెన్షన్ పరంగా ముందు వైపున ఇన్వర్టెడ్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్ ఉంది. వీటిని కూడా కయాబా నుండి సేకరించారు.

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ నుండి సేకరించిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఫ్లాగ్‌షిప్ మోటార్‌సైకిల్ టీవీఎస్ అపాచే ఆర్ఆర్310. అపాచే ఆర్ఆర్310 దేశవ్యాప్తంగా కేవలం 51 డీలర్ల వద్ద మాత్రమే అందుబాటులో ఉంది. కెటిఎమ్ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌తో పోల్చుకుంటే ఇది ఆరున్నర రెట్లు పెద్దది. ఏదేమైనప్పటికీ, ఖరీదైన మోటార్ సైకిళ్ల సెగ్మెంట్లో టీవీఎస్ ఎట్టకేలకు గొప్ప విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310

1.ఆటోను ఢీకొట్టడంతో మారుతి డిజైర్ ఎలా అయిపోయిందో చూడండి

2.2018 మారుతి ఎర్టిగా కారును ఆవిష్కరించిన మారుతి సుజుకి

3.కారులో ఏ/సి ఎఫెక్టివ్‌గా పనిచేయాలంటే ?

4.మీ కార్ రీసేల్ వ్యాల్యూ పెంచుకునే చిట్కాలు

5.సౌరశక్తితో నడిచే బైకును రూపొందించిన 13 ఏళ్ల కుర్రాడు

Most Read Articles

Read more on: #టీవీఎస్
English summary
Read In Telugu: TVS Apache RR310 Better Than The KTM RC390? — Here Is What You Need To Know!
Story first published: Saturday, April 21, 2018, 9:42 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X