అక్రపోవిక్ కంపెనీ నుండి సరికొత్త సైలెన్సర్ విడుదల: టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 కోసం మాత్రమే

టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310 బైకును ఎంచుకునే రేసింగ్ ప్రియుల కోసం మెరుగైన పవర్ మరియు రైడింగ్ అనుభూతిని కల్పించేందుకు దిగ్గజ సైలెన్సర్ల తయారీ సంస్థ అక్రపోవిక్ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను లాంచ్ చేస

By Anil Kumar

టీవీఎస్ మోటార్ కంపెనీ తమ సుదీర్ఘ రేసింగ్ అనుభవాన్ని రంగరించి, రేసింగ్ ప్రియుల కోసం సరికొత్త అపాచే ఆర్ఆర్ 310 స్పోర్ట్స్ బైకును లాంచ్ చేసింది. దేశవ్యాప్తంగా టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైక్‌ పట్ల మంచి ఆదరణ లభిస్తోంది. విక్రయాలు కూడా కంపెనీ భావించినట్లు ఆశాజనకంగానే ఉన్నాయి.

అక్రపోవిక్ కంపెనీ నుండి సరికొత్త సైలెన్సర్ విడుదల: టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 కోసం మాత్రమే

అయితే, టీవీఎస్ ఆపాచే ఆర్ఆర్ 310 బైకును ఎంచుకునే రేసింగ్ ప్రియుల కోసం మెరుగైన పవర్ మరియు రైడింగ్ అనుభూతిని కల్పించేందుకు దిగ్గజ సైలెన్సర్ల తయారీ సంస్థ అక్రపోవిక్ ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను లాంచ్ చేసింది.

అక్రపోవిక్ కంపెనీ నుండి సరికొత్త సైలెన్సర్ విడుదల: టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 కోసం మాత్రమే

అక్కపోవిక్ రేసింగ్ లైన్ ఫుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్ వినియోగించిన టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైకు పవర్ 2.4బిహెచ్‌పి వరకు పెరిగినట్లు పేర్కొంది. అంతే కాకుండా, టార్క్ కూడా 2.7ఎన్ఎమ్ వరకు పెరిగినట్లు గుర్తించారు. బైక్ పనితీరు పెరగడంతో పాటు ఈ నూతన ఎగ్జాస్ట్ సిస్టమ్ జోడింపుతో బైకు బరువు గణనీయంగా తగ్గింది.

అక్రపోవిక్ కంపెనీ నుండి సరికొత్త సైలెన్సర్ విడుదల: టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 కోసం మాత్రమే

స్టెయిన్‌లెస్ స్టీల్ ఫినిష్ సిస్టమ్ ద్వారా దీని బరువు సుమారుగా 3.3కిలోల వరకు తగ్గింది. కార్బన్ ఫినిషింగ్ ద్వారా మోటార్ సైకిల్ బరువు ఏకంగా 4.6కిలోల మేర తగ్గిపోయింది. ఈ ఎగ్జాస్ట్ సిస్టమ్ మోటార్ సైకిల్ యొక్క రేసింగ్ తత్వాన్ని మరింత పెంచింది. అక్రపోవిక్ ఎగ్జాస్ట్ సిస్టమ్ స్పోర్ట్ మరియు అగ్రెసివ్ రేసింగ్ అనుభవాన్నిస్తుంది.

అక్రపోవిక్ కంపెనీ నుండి సరికొత్త సైలెన్సర్ విడుదల: టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 కోసం మాత్రమే

టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 రేసింగ్ బైకులో 310సీసీ కెపాసిటి గల సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 27.3ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, అక్రపోవిక్ డెవలప్ చేసిన సైలెన్సర్ జోడింపుతో దీని పవర్ మరియు టార్క్ వరుసగా 36.4బిహెచ్‌పి మరియు 30ఎన్ఎమ్ వరకు పెరిగింది.

అక్రపోవిక్ కంపెనీ నుండి సరికొత్త సైలెన్సర్ విడుదల: టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 కోసం మాత్రమే

అక్రపోవిక్ కంపెనీ ప్రవేశపెట్టిన రేసింగ్ లైన్ ఫుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్, బిఎమ్‌డబ్ల్యూ జి310ఆర్ మరియు జి 310 జిఎస్ బైకుల్లో ఉన్న ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను పోలి ఉంటుంది. నిజానికి బిఎమ్‌డబ్ల్యూ జి310 సిరీస్ బైకుల్లో ఉన్న ఇంజన్ అపాచే ఆర్ఆర్ 310 బైకులో కూడా ఉంది. ఈ ఇంజన్‌ను టీవీఎస్ మరియు బిఎమ్‌డబ్ల్యూ మోటోర్రాడ్ ఉమ్మడి భాగస్వామ్యంతో అభివృద్ది చేశారు.

అక్రపోవిక్ కంపెనీ నుండి సరికొత్త సైలెన్సర్ విడుదల: టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 కోసం మాత్రమే

ఇండియన్ మార్కెట్లో ఈ "అక్రపోవిక్ రేసింగ్ లైన్ ఫుల్ ఎగ్జాస్ట్ సిస్టమ్" ముంబాయ్‌లోని పర్ఫామెన్స్ రేసింగ్ స్టోర్‌లో లభ్యమవుతోంది. టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైకులను వీటిని అమర్చడం చాలా సులభమని పర్ఫామెన్స్ స్టోర్ ప్రకటించింది.

అక్రపోవిక్ కంపెనీ నుండి సరికొత్త సైలెన్సర్ విడుదల: టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 కోసం మాత్రమే

ప్రపంచ వ్యాప్తంగా బ్రాండెడ్ ఎగ్జాస్ట్ సిస్టమ్స్ తయారీ సంస్థగా అక్రపోవిక్ పేరుగాంచింది. స్పోర్ట్స్ బైకులు మరియు పర్ఫామెన్స్ కార్ల కోసం కంపెనీ అత్యంత ఖరీదైన ఎగ్జాస్ట్ సిస్టమ్‌ను అభివృద్ది చేసి, విక్రయిస్తోంది. తాజాగా టీవీఎస్ అపాచే ఆర్ఆర్ 310 బైకు కోసం ప్రత్యేకమైన ఆఫ్టర్ మార్కెట్ సైలెన్సర్‌ను ప్రవేశపెట్టింది. అన్ని పన్నులతో కలుపుకొని దీని ధర రూ. 55,000 లుగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది.

Image Source:Autocar India

Most Read Articles

Read more on: #టీవీఎస్
English summary
Read In Telugu: Akrapovic Launches Racing Exhaust System For The TVS Apache RR 310
Story first published: Monday, July 16, 2018, 14:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X