టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ విడుదల

By N Kumar

దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ రేసింగ్ ప్రియుల కోసం తమ టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 బైకును స్పెషల్ రేస్ ఎడిషన్‌లో లాంచ్ చేసింది. సరికొత్త టీవీఎస్ అపాచే ఆర్‍‌‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ ధర రూ. 83,233 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ విడుదల

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ సరికొత్త పర్ల్ వైట్ బాడీ కలర్‌తో పాటు మడ్‌గార్డ్, ఫ్యూయల్ ట్యాంక్ మరియు రియర్ కౌల్ మీద రెడ్ మరియు గ్రే కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి. స్పెషల్ రేస్ ఎడిషన్ బైక్ ఓవరాల్ డిజైన్‌ను లైట్ వెయిట్ మరియు రేసింగ్ తత్వానికి ప్రతీకగా నిలిచే విభిన్న రేసింగ్ కార్బన్ ఫైబర్ థీమ్‌లో రూపొందించింది.

టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ విడుదల

అంతే కాకుండా, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 రేస్ ఎడిషన్‌లో సరికొత్త త్రీడీ టీవీఎస్ లోగో మరియు అల్లాయ్ వీల్స్ మీద టీవీఎస్ రేసింగ్ బ్రాండెడ్ రిమ్ స్టిక్కరింగ్ ఉంది. టీవీఎస్ ఆపాచే ఆర్‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ బైకులో ఇరువైపులా డిస్క్ బ్రేకులు ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ విడుదల

సరికొత్త కలర్ స్కీమ్ మరియు బాడీ గ్రాఫిక్స్ మినహాయిస్తే, స్పెషల్ రేస్ ఎడిషన్ అపాచే ఆర్‌టిఆర్ 180 బైకులో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. ఇందులో రెగ్యులర్ వెర్షన్‌ను పోలి ఉండే అగ్రెసివ్ ఫ్రంట్ షార్ప్ హెడ్‌ల్యాంప్ మరియు పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి. కండలు తిరిగిన రూపంలో ఉన్న ఫ్యూయల్ ట్యాంక్ మరియు స్పోర్టివ్ డీకాల్స్ ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ విడుదల

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ బైకులో టీవీఎస్ రేసింగ్ బ్రాండింగ్ గల ప్రత్యేకమైన ఇంజన్ కౌల్(గార్డ్) వచ్చింది. బ్లూ బ్యాక్ లైట్ గల డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఇందులో, గంటకు 0 నుండి 60కిలోమీటర్ల స్పీడ్ రికార్డర్, ల్యాప్ టైమర్ మరియు సర్వీస్ ఇండికేటర్ వంటివి ఉన్నాయి.

టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ విడుదల

సాంకేతికంగా సరికొత్త టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 రేస్ ఎడిషన్‌లో 177.4సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 5-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 16.3బిహెచ్‌పి పవర్ మరియు 15.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ విడుదల

టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ కేవలం 4.96 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు అత్యుత్తమ బ్రేకింగ్ పనితీరును కనబరిచే వ్యవస్థను అందివ్వడం జరిగింది. బరువుకు తగ్గ పవర్ నిష్పత్తి ఈ మోటార్‌సైకిల్‌ సొంతం.

టీవీఎస్ అపాచే ఆర్‍‌టిఆర్ 180 రేస్ ఎడిషన్ విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ ఇది వరకే అపాచే ఆర్‌టిఆర్ 200 4వి మరియు ఆర్‌టిఆర్ 160 బైకులను రేస్ ఎడిషన్‌లో పరిచయం చేసింది. ఇప్పుడు తాజాగా, అపాచే ఆర్‌టిఆర్ 180 రేస్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది.

రేసింగ్ ప్రియులను ఆకట్టుకునేందుకు అధునాతన బాడీ పెయింట్ స్కీమ్ మరియు ఆకర్షణీయమైన బాడీ గ్రాఫిక్స్, డీకాల్స్‌ను కార్బన్ ఫైబర్ రేసింగ్ థీమ్‌లో అందించింది. రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులు రావడం దీని ప్రత్యేకత.

More from DriveSpark

Article Published On: Wednesday, May 9, 2018, 18:20 [IST]
English summary
Read In Telugu: TVS Apache RTR 180 Race Edition Launched In India; Priced At Rs 83,233
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+