ఎలక్ట్రిక్ మోటార్ మరియు పెట్రోల్ ఇంజన్‌తో నడిచే భారతదేశపు తొలి హైబ్రిడ్ స్కూటర్

టీవీఎస్ మోటార్స్ భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube Hybrid)ను విడుదలకు సిద్దం చేస్తోంది. తాజాగా అందిన సమాచారం మేరకు, టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాదిలోనే ఐక్యూబ్ హైబ్రిడ్ స్

By Anil Kumar

టీవీఎస్ మోటార్స్ భారతదేశపు మొట్టమొదటి హైబ్రిడ్ స్కూటర్ టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube Hybrid)ను విడుదలకు సిద్దం చేస్తోంది. తాజాగా అందిన సమాచారం మేరకు, టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ ఏడాదిలోనే ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిసింది.

టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్‌ను చివరిసారిగా 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పోలో ఆవిష్కరించింది. ఈ స్కూటర్‌లో సాంకేతికంగా 100సీసీ పెట్రోల్ ఇంజన్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ అనుసంధానం ఉంది. 150Wh మరియు 500Wh సామర్థ్యం ఉన్న రెండు బ్యాటరీ ఆప్షన్‌లతో లభిస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

స్కూటర్‌లో ఎలక్ట్రిక్ మోటార్ పనితీరును ఎకానిమీ మరియు పవర్ అనే రెండు రైడింగ్ మోడ్స్ పర్యవేక్షిస్తాయి. గంటకు 20 కిలోమీటర్ల కంటే తక్కువ వేగం ఉన్నపుడు కేవలం ఎలక్ట్రిక్ పవర్‌తో మాత్రమే నడుస్తుంది. దీని కంటే ఎక్కువ వేగంతో వెళితే పెట్రోల్ ఇంజన్‌తో నడుస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

టీవీఎస్ మోటార్స్ కంపెనీ, తమ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఈ ఏడాది పండుగ సీజన్ ప్రారంభమయ్యాక విడుదల చేసే అవకాశం ఉంది. దేశీయంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగం పట్ల ఆసక్తికనబరుస్తున్నాయి. దీంతో ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్‌ను వీలైనంత త్వరగా లాంచ్ చేయాలని భావిస్తోంది.

టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

దేశీయ స్కూటర్ల విపణిలోకి అత్యంత పోటీతత్వమున్న ధరలతో లాంచ్ చేయనుంది. అంతే కాకుండా, ఎలక్ట్రిక్ మరియు పెట్రోల్ ఇంజన్ అనుసంధానంతో నడితే హైబ్రిడ్ స్కూటర్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ మరియు విక్రయాలను ప్రోత్సహించే ప్రభుత్వ విభాగం ఫేమ్ నుండి సబ్సీడీ కూడా లభిస్తుంది.

టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

ఇండియాలో ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్(FAME) అందించే సబ్సిడీ సెప్టెంబర్ 2018 వరకు మాత్రమే లభిస్తాయి. ఆ తరువాత ఎలక్ట్రిక్ మరియు హైబ్రిడ్ వాహనాల సేల్స్ పెంచేందుకు FAME రెండవ దశకు నూతన సబ్సిడీ విధానం ప్రవేశపెట్టనుంది.

టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

డ్రైవ్‌‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ మోటార్ కంపెనీ ఐక్యూట్ హైబ్రిడ్ స్కూటర్‌ను తొలుత 2010 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ఆవిష్కరించింది. వివిధ దశల వారీగా జరిగిన అభివృద్ది మరియు పరీక్షల అనంతరం ఎట్టకేలకు ప్రొడక్షన్ దశకు తీసుకొచ్చింది.

టీవీఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ స్కూటర్

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల ఆసక్తి పెరుగుతుండటంతో ఎకో-ఫ్రెండ్లీ హైబ్రిడ్ స్కూటర్ మంచి సక్సెస్ అందుకునే అవకాశం ఉంది. అంతే కాకుండా, తక్కువ వేగంలో ఉన్నపుడు ఎలక్ట్రిక్ మోటార్ మీద మరియు ఎక్కువ వేగంలో ఉన్నపుడు పెట్రోల్ ఇంజన్‌ నడుస్తుంది కాబట్టి, రెగ్యులర్ స్కూటర్ల కంటే అధిక మైలేజ్ ఇస్తుంది.

Most Read Articles

Read more on: #టీవీఎస్
English summary
Read In Telugu: TVS iQube Hybrid Scooter To Be Launched In India This Year
Story first published: Saturday, June 9, 2018, 16:04 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X