టీవీఎస్ నుండి మరో కొత్త బైకు: విడుదల తేదీ ఖరారు

దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్స్ విపణిలోకి సరికొత్త కమ్యూటర్ మోటార్ సైకిల్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. తాజాగా అందిన సమాచారం మేరకు, టీవీఎస్ టూ వీలర్స్ ఈ ఆగష్టు 23, 2018వ తేదీన 110సీసీ కెపాసిటి గల ఒక కొత్త బైకును విడుదల చేస్తున్నట్లు తెలిసింది.

టీవీఎస్ నుండి ర్యాడియాన్ కమ్యూటర్ బైక్

మార్కెట్ నుండి వైదొలగిన టీవీఎస్ ఫీనిక్స్ స్థానాన్ని ఈ నూతన మోటార్‌సైకిల్ స్థానాన్ని భర్తీ చేయనుంది. అంతే కాకుండా, హీరో విక్రయిస్తున్న ప్యాసన్ మరియు స్ల్పెండర్ బైకులకు ఇది సరాసరి పోటీనివ్వనుంది.

టీవీఎస్ నుండి ర్యాడియాన్ కమ్యూటర్ బైక్

టీవీఎస్ నుండి వస్తోన్న నూతన కమ్యూటర్ మోటార్ సైకిల్ పలు ప్రీమియం ఫీచర్లతో రానుంది. డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, ఎల్ఈడీ హెడ్‌లైట్ మరియు టెయిల్ లైట్లతో పాటు ఇంకా ఎన్నో ఫీచర్లు రానున్నాయి.

టీవీఎస్ నుండి ర్యాడియాన్ కమ్యూటర్ బైక్

టీవీఎస్ కొత్త బైక్ ఓవరాల్ డిజైన్ ప్రస్తుతం ఉన్న టీవీఎస్ విక్టర్ మరియు టీవీఎస్ స్టార్ సిటీ కంటే ఎంతో విభిన్నంగా ఉంది. అంటే, దేశీయ దిగ్గజం టీవీఎస్ నుండి ఒక నూతన ఉత్పత్తిని ఆశించవచ్చు.

టీవీఎస్ నుండి ర్యాడియాన్ కమ్యూటర్ బైక్

టీవీఎస్ మోటార్స్ సరిగ్గా 2012లో 125సీసీ కాన్సెప్ట్ మోటార్‌సైకిల్‌ను ర్యాడియాన్ అనే పేరుతో ఆవిష్కరించింది. కానీ టీవీఎస్ ప్రస్తుతం విడుదలకు సిద్దం చేసిన మోడల్‌ 110సీసీ బైకు.

టీవీఎస్ నుండి ర్యాడియాన్ కమ్యూటర్ బైక్

సాంకేతికంగా ఇందులో టీవీఎస్ ఇంజన్ శ్రేణి నుండి సేకరించిన 109.7సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ వచ్చే అవకాశం ఉంది. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇంజన్ గరిష్టంగా 9.5 బిహెచ్‌పి పవర్ మరియు 9.4ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ నుండి ర్యాడియాన్ కమ్యూటర్ బైక్

ఈ 110సీసీ బైకు టీవీఎస్ యొక్క ప్రీమియం ప్రొడక్ట్ కావచ్చు, స్పోర్టివ్ తత్వాన్ని పెంచేందుకు పలు రకాల బాడీ డీకాల్స్ వచ్చే అవకాశం ఉంది. మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థ కోసం ముందు వైపున డిస్క్ మరియు వెనుక వైపున డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.

టీవీఎస్ నుండి ర్యాడియాన్ కమ్యూటర్ బైక్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ టూ వీలర్స్ తమ ప్రీమియం కమ్యూటర్ బైకును 110సీసీ సెగ్మెంట్లోకి లాంచ్ చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. అధునాతన డిజైన్, ఆకర్షణీయమైన మరియు స్పోర్టివ్ బాడీ డీకాల్స్ మరియు అత్యాధునిక ఫీచర్లతో వస్తోన్న టీవీఎస్ 110సీసీ బైకు విపణిలో ఉన్న హీరో స్ల్పెండర్, ప్యాసన్, హోండా డ్రీమ్ యుగా మరియు సుజుకి హయాతే వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.

Source: CarandBike

Most Read Articles

English summary
Read In Telugu: TVS To Introduce New Commuter Motorcycle — Launch Date Revealed
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X