జోరు మీదున్న టీవీఎస్ జూపిటర్: ఏకంగా 25 లక్షల స్కూటర్ల సేల్

టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన కేవలం ఐదేళ్ల కాలంలో ఏకంగా 25 లక్షల యూనిట్ల సేల్స్ సాధించి అరుదైన మైలురాయిని ఛేదించింది.

By Anil Kumar

ఇండియన్ స్కూటర్ల విభాగంలో హోండా యాక్టివా స్కూటర్ తిరుగులేని రారాజుగా నిలిచింది. కానీ, పందెంలో టీవీఎస్ జూపిటర్ రెండవ స్థానం కైవసం చేసుకుంది. కానీ విడుదలైన ఐదేళ్ల వ్యవధిలోనే విపరీతమైన పోటీని ఎదుర్కొని హోండా యాక్టివా స్కూటర్‌కు పోటీనివ్వడం సాధారణ విషయం కాదు.

జోరు మీదున్న టీవీఎస్ జూపిటర్: ఏకంగా 25 లక్షల స్కూటర్ల సేల్

కానీ, తాజాగా నెలకొల్పిన రికార్డుతో టీవీఎస్ జూపిటర్ హోండా యాక్టివాకు ఓ పెద్ద సవాల్ విసిరింది. టీవీఎస్ జూపిటర్ స్కూటర్ ఇండియన్ మార్కెట్లోకి విడుదలైన కేవలం ఐదేళ్ల కాలంలో ఏకంగా 25 లక్షల యూనిట్ల సేల్స్ సాధించి అరుదైన మైలురాయిని ఛేదించింది.

జోరు మీదున్న టీవీఎస్ జూపిటర్: ఏకంగా 25 లక్షల స్కూటర్ల సేల్

అంతే కాకుండా, అత్యధిక వేగంగా 10 లక్షల యూనిట్ల విక్రయాలు సాధించిన మోడల్ కూడా ఇదేనని టీవీఎస్ మోటార్ కంపెనీ పేర్కొంది. గడిచిన 30 నెలల్లో 10 లక్షల యూనిట్ల విక్రయాలు జరపగా, చివరి ఐదు లక్షల సేల్స్ కేవలం 10 నెలల్లో జరిపినట్లు టీవీఎస్ పేర్కొంది.

జోరు మీదున్న టీవీఎస్ జూపిటర్: ఏకంగా 25 లక్షల స్కూటర్ల సేల్

ఈ సందర్భంగా టీవీఎస్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, "సుపీరియర్ వెహికల్ క్వాలిటీ, సౌకర్యం, సౌలభ్యం, మైలేజ్ మరియు స్టోరేజ్ స్పేస్ వంటి అంశాలను లక్ష్యంగా చేసుకుని ఎక్కువ వల్ల లాభం అనే కాన్సెప్టుతో వచ్చిన టీవీఎస్ జూపిటర్ ఎప్పుడూ తన నమ్మకాన్ని కోల్పోలేదని పేర్కొన్నాడు."

జోరు మీదున్న టీవీఎస్ జూపిటర్: ఏకంగా 25 లక్షల స్కూటర్ల సేల్

దేశవ్యాప్తంగా ఎంతో మంది స్కూటర్ ప్రియులు టీవీఎస్ జూపిటర్‌కు ఓటేశారు. అంతే కాకుండా జె.డి పవర్ 2018 అధ్యయనంలో, ప్రీమియం ఫీల్ కలిగించే స్కూటర్ల సెగ్మెంట్లో టాప్ ర్యాంక్ అందుకుంది. అదనంగా, టీవీఎస్ జూపిటర్ ఎంచుకున్న కస్టమర్లు ఎంతో సంతృప్తిగా ఉన్నారు.

జోరు మీదున్న టీవీఎస్ జూపిటర్: ఏకంగా 25 లక్షల స్కూటర్ల సేల్

టీవీఎస్ జూపిటర్ తన విభిన్న శైలితో, మార్కెట్లో దీని పట్ల ఉన్న పాజిటవ్ టాక్‌తో విడుదలైనప్పటి నుండి 25 లక్షలకు పైగా కస్టమర్లను చేరుకుంది. ఇంకా ఎంతో మంది కస్టమర్లు బెస్ట్ స్కూటర్ అవ్వనుంది. ఒక రకంగా చెప్పాలంటే యాక్టివా తర్వాత మార్కెట్లో ఉన్న బెస్ట్ ట్రెడిషన్ స్కూటర్ టీవీఎస్ జూపిటర్.

జోరు మీదున్న టీవీఎస్ జూపిటర్: ఏకంగా 25 లక్షల స్కూటర్ల సేల్

టీవీఎస్ జూపిటర్‌లో సాంకేతికంగా 109.7సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ సీవీటీ ట్రాన్స్‌మిషన్ గల ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 7.8బిహెచ్‌పి పవర్ మరియు 8ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తోంది. ధరకు తగ్గ విలువలు గల జూపిటర్ మైలేజ్ పరంగా ఎంతో మంది కస్టమర్ల అభిమానాన్ని చూరగొంది.

జోరు మీదున్న టీవీఎస్ జూపిటర్: ఏకంగా 25 లక్షల స్కూటర్ల సేల్

2017-18 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 30 లక్షల యూనిట్ల హోండా యాక్టివా స్కూటర్లు అమ్ముడయ్యాయి. అంటే మొత్తం స్కూటర్ల విక్రయాల్లో హోండా యాక్టివా వాటా 47 శాతం ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద 67.19 లక్షల స్కూటర్లు రోడ్డెక్కాయి.

జోరు మీదున్న టీవీఎస్ జూపిటర్: ఏకంగా 25 లక్షల స్కూటర్ల సేల్

100 నుండి 110సీసీ మధ్య ఇంజన్ కెపాసిటి ఉన్న స్కూటర్లే అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. ఇటీవల కాలంలో 125 నుండి 150సీసీ ఇంజన్ సామర్థ్యం ఉన్న స్కూటర్లకు గిరాకీ ఎక్కువగానే లభిస్తోంది. దీంతో టూ వీలర్ల దిగ్గజాలు ఎక్కువ కెపాసిటి ఉన్న ప్రీమియం స్కూటర్లను ప్రవేశపెడుతున్నాయి.

జోరు మీదున్న టీవీఎస్ జూపిటర్: ఏకంగా 25 లక్షల స్కూటర్ల సేల్

టీవీఎస్ మోటార్ కంపెనీ ఇటీవల ఎన్‌టార్క్ 125, హోండా టూ వీలర్స్ గ్రాజియా 125 స్కూటర్లను విడుదల చేశాయి. ఇప్పుడు వీటి సరసన సుజుకి టూ వీలర్స్ అతి త్వరలో విడుదల చేయనున్న బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 ప్రీమియం స్కూటర్ వచ్చి చేరనుంది.

Most Read Articles

Read more on: #టీవీఎస్
English summary
Read In Telugu: TVS Jupiter Crosses 2.5 Million Sales Milestone In India In 5 Years
Story first published: Monday, July 16, 2018, 16:28 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X