ర్యాలీ వెర్షన్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్ ఆవిష్కరించిన టీవీఎస్

టీవీఎస్ మోటార్ కంపెనీ రేసింగ్ విభాగం, టీవీఎస్ రేసింగ్ ర్యాలీ వెర్షన్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రెగ్యులర్ స్కూటర్ ఆధారంగా టీవీఎస్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స

By Anil Kumar

టీవీఎస్ మోటార్ కంపెనీ రేసింగ్ విభాగం, టీవీఎస్ రేసింగ్ ర్యాలీ వెర్షన్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. టీవీఎస్ ఎన్‌టార్క్ 125 రెగ్యులర్ స్కూటర్ ఆధారంగా టీవీఎస్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్‌ను అభివృద్ది చేశారు.

టీవీఎస్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ ర్యాలీ వెర్షన్ నాసిక్‌లో జరుగుతున్న ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌(INRC) నాలుగవ రౌండులో తొలి ఎంట్రీ ఇవ్వనుంది.

ర్యాలీ వెర్షన్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్ ఆవిష్కరించిన టీవీఎస్

INRC ర్యాలీ నాలుగవ భాగం నాసిక్‌లో మే 25-26, 2018 మధ్యన జరుగుతోంది. ఈ ర్యాలీలో టీవీఎస్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ ర్యాలీ స్కూటర్‌ను మూడు సార్లు నేషనల్ ఛాంపియన్‌షిప్ అవార్డు గ్రహించిన ఆసిఫ్ అలీ మరియు షమీమ్ ఖాన్ రైడ్ చేస్తారు.

ర్యాలీ వెర్షన్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్ ఆవిష్కరించిన టీవీఎస్

టీవీఎస్ రేసింగ్ బృందానికి మంచి ఫలితాలను ఇచ్చిన ఎస్ఎక్స్ఆర్ 160 సక్సెస్‌కు కొనసాగింపుగా టీవీఎస్ తమ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్‌ను ఆవిష్కరించింది. డిజైన్ పరంగా ఎస్ఎక్స్ఆర్ వెర్షన్ టీవీఎస్ ఎన్‌టార్క్ ర్యాలీ స్కూటర్‌లో ఎలాంటి మార్పులు జరగలేదు. అయితే, ర్యాలీ వెర్షన్ అని సూచించే విధంగా ఎస్ఎక్స్ఆర్ స్టిక్కరింగ్ గల బాడీ డీకాల్స్ ఉన్నాయి.

ర్యాలీ వెర్షన్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్ ఆవిష్కరించిన టీవీఎస్

సాంకేతికంగా టీవీఎస్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ ర్యాలీ స్కూటర్‌లో అదే శక్తివంతమైన 125సీసీ రేస్ ట్యూన్డ్ సింగల్ సిలిండర్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 19బిహెచ్‌పి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే, స్టాండర్డ్ ఎన్‌టార్క్ 125 కేవలం 9బిహెచ్‌పి పవర్ మాత్రమే ఉత్పత్తి చేస్తుంది.

ర్యాలీ వెర్షన్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్ ఆవిష్కరించిన టీవీఎస్

టీవీఎస్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్ గరిష్టంగా 120కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. టీవీఎస్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ ర్యాలీ స్కూటర్‌లో ఉన్న ఇతర కీలకమైన ఫీచర్లలో రేస్-ట్యూనింగ్ చేయబడిన హైడ్రాలిక్ సస్పెన్షన్, రేస్ వెర్షన్ ఇంటేక్ మరియు ఎగ్జాస్ట్ సిస్టమ్, మెరుగైన ఇగ్నిషన్ సిస్టమ్ మరియు 12-అంగుళాల ఆఫ్-రోడ్ బటన్ టైర్లు ఉన్నాయి.

ర్యాలీ వెర్షన్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్ ఆవిష్కరించిన టీవీఎస్

టీవీఎస్ రేసింగ్ టీమ్ మేనేజర్, బి సెల్వరాజ్ మాట్లాడుతూ, "స్కూటర్ రేసింగ్ విభాగంలో సరికొత్త టీవీఎస్ ఎస్ఎక్స్ఆర్ 160 అత్యద్భుతమైన రేసింగ్ మెషీన్, దీనిని ఇప్పుడు టీవీఎస్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ వెర్షన్‌లో అందివ్వడంతో పోటీలో అత్తుత్తమ పనితీరును కనబరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఎస్ఎక్స్ఆర్ వెర్షన్ టీవీఎస్ ఎన్‌టార్క్ స్కూటర్‌ను ఇప్పటికే పరీక్షించాము, ఇది ఖచ్చితంగా సరికొత్త రికార్డులను ఖాయమని ఆయన చెప్పుకొచ్చాడు."

ర్యాలీ వెర్షన్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్ ఆవిష్కరించిన టీవీఎస్

టీవీఎస్ ఎన్‌టార్క్ 125 స్కూటర్‌లో ఎన్నో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి మరియు స్మార్టెక్స్‌కనెక్ట్ టెక్నాలజీ గల భారతదేశపు తొలి స్కూటర్‌ కూడా ఇదే. ఇందులో 55 రకాల ఫీచర్లు ఉన్న ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. టీవీఎస్ స్పోర్టివ్ స్కూటర్ ఎన్‌టార్క్ 125 గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు డ్రైవ్‌స్పార్క్ తెలుగు టెస్ట్ రైడడ్ రివ్యూ స్టోరీని చదవండి....

ర్యాలీ వెర్షన్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ స్కూటర్ ఆవిష్కరించిన టీవీఎస్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ రేసింగ్ బృందం ఇండియాలో టూ వీలర్ మోటార్‌స్పోర్ట్స్‌ విభాగంలో ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తోంది. సుమారుగా 35 సంవత్సరాల రేసింగ్ అనుభవం టీవీఎస్ సొంతం, ఈ కాలంలో ఎంతో మంది రేసర్లను సృష్టించి మరెన్నో అవార్డులను సాధించింది. దేశీయంగా రేసింగ్ ప్రియులకు టీవీఎస్ రేసింగ్ ఎన్నో అవకాశాలను కల్పించి, ప్రపంచ స్థాయి రేసర్లుగా తీర్చిదిద్దుతోంది.

ఇప్పుడు తాజాగా, నాసిక్‌లో జరుగుతున్న ఇండియన్ నేషనల్ ర్యాలీ ఛాంపియన్‌షిప్‌ నాలుగవ విభాగంలో టీవీఎస్ ఎన్‌టార్క్ ఎస్ఎక్స్ఆర్ ర్యాలీ వెర్షన్ పర్ఫామెన్స్ స్కూటర్‌ను ప్రవేశపెడుతోంది.ే

Most Read Articles

Read more on: #టీవీఎస్
English summary
Read In Telugu: TVS NTorq SXR Revealed — To Debut At The Indian National Rally Championship
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X