టీవీఎస్ నుండి సరికొత్త రేడియాన్ బైకు: ధర రూ. 48,400

టీవీఎస్ మోటార్ కంపెనీ నేడు సరికొత్త టీవీఎస్ రేడియాన్ బైకును విడుదల చేసింది. టీవీఎస్ రేడియాన్ బైకు ప్రారంభ ధర రూ. 48,400 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. టీవీఎస్ రేడియాన్ ఇంజన్, మైలేజ్, ఫీచర్లు, డిజైన్,

By Anil Kumar

టీవీఎస్ మోటార్ కంపెనీ నేడు సరికొత్త టీవీఎస్ రేడియాన్ బైకును విడుదల చేసింది. దక్షిణ భారత అగ్రగామి ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ టూ వీలర్స్ దేశీయ 110సీసీ టూ వీలర్ల విభాగంలోకి సరికొత్త టీవీస్ రేడియాన్ 110 బైకును ప్రవేశపెట్టింది.

టీవీఎస్ రేడియాన్ బైకు ప్రారంభ ధర రూ. 48,400 లు ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది. టీవీఎస్ రేడియాన్ ఇంజన్, మైలేజ్, ఫీచర్లు, డిజైన్, వేరియంట్లు మరియు ఫోటోల గురించి పూర్తి వివరాలు...

టీవీఎస్ రేడియాన్ విడుదల

డిజైన్:

టీవీఎస్ రేడియాన్ ఒక సమాంతర డిజైన్ శైలిలో ఉండే కమ్యూటర్ బైకు. ఎలాంటి ఆరంభడమైన డిజైన్ అంశాలు లేకుండా చాలా సింపుల్‌గా రూపొందించారు. టీవీఎస్ రేడియాన్ బైకులో ఎల్ఈడీ లైట్ల జోడింపుతో ఉన్న శక్తివంతమైన హెడ్‌ల్యాంప్, దీని చుట్టూ క్రోమ్ సొబగులు, ఫ్యూయల్ ట్యాంక్‌కు ఇరువైపులా తొడలకు ఆచ్ఛాదనమిచ్చే థై ప్యాడ్స్, క్రోమ్ హంగులు గల ఇంస్ట్రుమెంట్ క్లస్టర్, షాక్ అబ్జార్వర్ మరియు సైలెన్సర్ ఉన్నాయి.

టీవీఎస్ రేడియాన్ బైకు విడుదల

ఇంజన్ మరియు స్పెసిఫికేషన్స్:

టీవీఎస్ రేడియాన్ కమ్యూటర్ బైకులో 109.7సీసీ సామర్థ్యం గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 7,000ఆర్‌పిఎమ్ ఇంజన్ వేగం వద్ద 8.2బిహెచ్‌పి పవర్ మరియు 5,000ఆర్‌పిఎమ్ వద్ద 8.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ రేడియాన్ బైకు విడుదల

మైలేజ్ వివరాలు:

టీవీఎస్ రేడియాన్ బైకులో 10-లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం గల ఇంధన ట్యాంక్ కలదు. మరియు టీవీఎస్ కథనం మేరకు రేడియాన్ లీటరుకు గరిష్టంగా 69.3 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది.

టీవీఎస్ రేడియాన్ బైకు విడుదల

బ్రేకులు:

టీవీఎస్ రేడియాన్‌లో ఇరువైపులా డ్రమ్ బ్రేకులు ఉన్నాయి మరియు ఇప్పటి వరకు ఈ 110సీసీ బైకుల సెగ్మెంట్లో పరిచయం కానటువంటి సింక్రోనైజ్డ్ బ్రేకింగ్ టెక్నాలజీ వచ్చింది. ఈ నూతన బ్రేకింగ్ టెక్నాలజీ అత్యుత్తమ బ్రేకింగ్ కల్పించి టైర్ల జారుడును అరికడుతుంది.

టీవీఎస్ రేడియాన్ బైకు విడుదల

సస్పెన్షన్:

టీవీఎస్ రేడియాన్ కమ్యూటర్ మోటార్ సైకిల్‌లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ఐదు దశ వారాగీ అడ్జెస్ట్ చేసుకునే సౌకర్యం ఉన్న హైడ్రాలిక్ సస్పెన్షన్ సిస్టమ్ కలదు. రేడియాన్ వీల్‌బేస్(రెండు చక్రాల మధ్య బిందువు మధ్యనున్న దూరం) 1,265మిల్లీమీటర్లు మరియు గ్రౌండ్ క్లియరెన్స్ (నేల నుండి బైక్‌ మధ్య ఉన్న దూరం) 180ఎమ్ఎమ్‌గా ఉంది.

టీవీఎస్ రేడియాన్ బైకు విడుదల

ఫీచర్లు:

టీవీఎస్ రేడియాన్ బైకులో బీప్ సౌండ్ ఇచ్చే సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఎలక్ట్రిక్ స్టార్ట్, 18-అంగుళాల అల్లాయ్ వీల్స్, డ్యూరా-గ్రిప్ టైర్లు, యూఎస్‌బీ ఛార్జింగ్ స్లాట్, సౌకర్యవంతమైన పిలియన్ రైడర్ హ్యాండిల్ మరియు పొడవాటి సీటు వంటి అరుదైన ఫీచర్లు ఉన్నాయి.

టీవీఎస్ రేడియాన్ బైకు విడుదల

వారంటీ:

సరికొత్త టీవీఎస్ రేడియాన్ మీద ఐదేళ్ల వారంటీ లభిస్తోంది. అదే విధంగా టీవీఎస్ రేడియాన్ బైకును నాలుగు విభిన్న రంగుల్లో ఎంచుకోవచ్చు. అవి, తెలుపు, లేత గోధుమ రంగు, వంగపూత రంగు మరియు నలుపు.

టీవీఎస్ రేడియాన్ బైకు విడుదల

పోటీ:

టీవీఎస్ రేడియాన్ కమ్యూటర్ బైకు విపణిలో ఉన్న హీరో స్ల్పెండర్, హీరో హెచ్ఎఫ్ డీలక్స్, బజాజ్ సిటి100, హోండా డ్రీమ్ యుగా మరియు యమహా సెల్యూటో ఆర్ఎక్స్ వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వడం ఖాయం.

టీవీఎస్ రేడియాన్ బైకు విడుదల

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీవీఎస్ రేడియాన్ అధునాతన ఫీచర్లు మరియు ఆకర్షణీయమైన డిజైన్‌లో ఉన్న అత్యంత సరసమైన కమ్యూటర్ మోటర్ సైకిల్. ఈ రేంజ్‌ బైకుల్లో ఇప్పటి వరకు పరిచయం కానటువంటి ఫీచర్లు మరియు అద్భుతమైన మైలేజ్‌తో కస్టమర్లను ఎంతగానో ఆకట్టుకోనుంది.

టీవీఎస్ రేడియాన్ బైక్ గురించి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ ద్వారా మాతో పంచుకోండి...

More from DriveSpark

Article Published On: Thursday, August 23, 2018, 14:31 [IST]
English summary
Read In Telugu: TVS Radeon Launched in India; Priced At Rs 48,400
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+