TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
టీవీఎస్ స్పోర్ట్ సిల్వర్ అల్లాయ్ ఎడిషన్ విడుదల: ధర రూ. 44,166 లు
దక్షిణ భారత ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం టీవీఎస్ మోటార్ కంపెనీ విపణిలోకి టీవీఎస్ స్పోర్ట్ సిల్వర్ అల్లాయ్ ఎడిషన్ బైకును లాంచ్ చేసింది. దేశీయ మార్కెట్లోకి స్పోర్ట్ టూ వీలర్ విడుదలైనప్పటి నుండి 20 లక్షల యూనిట్ల సేల్స్ మైలు రాయిని అధిగమించినందుకు గుర్తుగా ఈ స్పెషల్ సిల్వర్ అల్లాయ్ ఎడిషన్ స్పోర్ట్ బైకును ప్రవేశపెట్టినట్లు తెలిసింది.
టీవీఎస్ స్పోర్ట్ సిల్వర్ అల్లాయ్ ఎడిషన్‌లోని కిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 44,961 లు మరియు ఎలక్ట్రిక్ స్టార్ట్ వేరియంట్ ధర రూ. 46,257 లు ఎక్స్-షోరూమ్‌గా ఉన్నాయి.
కొత్తగా విడుదలైన టీవీఎస్ స్పోర్ట్ సిల్వర్ ఎడిషన్ రెండు విభిన్న రంగుల్లో లభ్యమవుతుంది. అవి, బ్లాక్ సిల్వర్ మరియు వోల్కానో రెడ్. సరికొత్త స్పెషల్ ఎడిషన్ టీవీఎస్ స్పోర్ట్ బైకులో బ్లాక్ అల్లాయ్ వీల్స్‌కు బదులుగా సిల్వర్ అల్లాయ్ వీల్స్ వచ్చాయి. ఇవి మినహాయిస్తే డిజైన్ పరంగా ఎలాంటి మార్పులు జరగలేదు.
నూతన టీవీఎస్ స్పోర్ట్ సిల్వర్ అల్లాయ్ ఎడిషన్ బైకులో అదే మునుపటి శక్తివంతమైన 99.7సీసీ సామర్థ్యం ఉన్న గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ డ్యూరా లైఫ్ ఇంజన్ కలదు. 4-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది 7.3బిహెచ్‌పి పవర్ మరియు 7.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. దీని మైలేజ్ గరిష్టంగా లీటరుకు 95కిమీలుగా ఉంది.
టీవీఎస్ స్పోర్ట్ సిల్వర్ అల్లాయ్ ఎడిషన్‌లో కంపెనీ పేటెంట్ పొందిన ఇకో మరియు పవర్ మోడ్ ఆప్షన్లు గల ఎకానోమీటర్ ఉంది. ఈ బైకులో 10-లీటర్ల కెపాసిటి గల ఫ్యూయల్ ట్యాంక్, ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున డ్యూయల్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి. బ్రేకింగ్ విధుల నిర్వర్తించడానికి ఇరువైపులా డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.
టీవీఎస్ స్పోర్ట్ సిల్వర్ అల్లాయ్ ఎడిషన్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అధీకృత డీలర్ల వద్ద లభ్యమవుతోంది. సిల్వర్ అల్లాయ్ ఎడిషన్ రెగ్యులర్ మోడల్‌తో సహా లభిస్తుంది. ఇది మొత్తం, ఎనిమిది విభిన్న రంగుల్లో లభిస్తోంది. ఇండిగో స్ట్రీక్, టీమ్ బ్లూ, మెర్కురీ గ్రే, బ్లేజ్ రెడ్, డాజ్లింగ్ వైట్, ఎలక్ట్రిక్ గ్రీన్, బ్లాక్ సిల్వర్ మరియు వొల్కానో రెడ్ రంగుల్లో ఎంచుకోవచ్చు.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
ఇండియన్ టూ వీలర్ మార్కెట్లోని ఎంట్రీ లెవల్ కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో ఎన్నో ఏళ్ల పాటు టీవీఎస్ స్పోర్ట్ బెస్ట్ సెల్లింగ్ మోటార్ సైకిల్‌గా రాణిస్తోంది. అద్భుతమైన మైలేద్, ఆకర్షణీయమైన డిజైన్ టీవీఎస్ స్పోర్ట్ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు, అదనంగా విడుదలైన సిల్వర్ అల్లాయ్ ఎడిషన్ టీవీఎస్ స్పోర్ట్ కస్టమర్లను మరింత ఆకట్టుకోనుంది.