నూతన ఫీచర్లతో విడుదలైన టీవీఎస్ ఎక్స్ఎల్100 హెవీ డ్యూటీ

టీవీఎస్ ఎక్స్ఎల్ ఇప్పుడు మరిన్ని నూతన ఫీచర్లతో మరో కొత్త వేరియంట్లో విడుదలయ్యింది. టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్ ఎక్స్ఎల్ ఐ-టచ్ స్టార్ట్ టూ వీలర్‌ను విడుదల చేసింది. సరికొత్త టీవ

By Anil Kumar

మన ఊరి బండి... కొనడం సులభమండీ అనే టీవీ యాడ్‌తో ఎంతో మందికి చేరువైన టీవీఎస్ ఎక్స్ఎల్ ఇప్పుడు మరిన్ని నూతన ఫీచర్లతో మరో కొత్త వేరియంట్లో విడుదలయ్యింది. టీవీఎస్ మోటార్ కంపెనీ మార్కెట్లోకి సరికొత్త టీవీఎస్ ఎక్స్ఎల్ ఐ-టచ్ స్టార్ట్ టూ వీలర్‌ను విడుదల చేసింది. సరికొత్త టీవీఎస్ ఎక్స్ఎల్100 ఐ-టచ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 36,109 లుగా ఉంది.

టీవీఎస్ బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ మరియు ఇండియాలో ప్రతి పల్లె మెచ్చిన ఎక్స్ఎల్ మోపెడ్‌లో కొన్ని కొత్త ఫీచర్లు పరిచయం అయ్యాయి, వాటి గురించి పూర్తి వివరాలు...

టీవీఎస్ ఎక్స్ఎల్100 ఐటచ్

మార్కెట్లోకి కొత్తగా విడుదలైన టీవీఎస్ ఎక్స్ఎల్10 ఐటచ్ స్టార్ట్ వేరియంట్ ఎలక్ట్రిక్ స్టార్టర్, యూఎస్‌బీ ఛార్జర్ మరియు నూతన పెయింట్ స్కీమ్‌ వంటి అదనపు ఫీచర్లు పరిచయం అయ్యాయి. ఎక్స్ఎల్100 హెవీ డ్యూటీ వేరియంట్ ఆధారంగా ఈ ఐ-టచ్ వేరియంట్‌ను అభివృద్ది చేశారు, ఇందులో పగటి పూట వెలిగే ఎల్ఈడీ లైటు కూడా ఉంది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 ఐటచ్

సరికొత్త టీవీఎస్ ఎక్స్ఎల్100 ఐ-టచ్ టూ వీలర్లో స్ల్పిట్ సీటు ఉంది. చిన్నపాటి లగేజ్‌ను తీసుకెళ్లడానికి వీలుగా వెనుక సీటును తొలగించే అవకాశం కల్పించారు. టీవీఎస్ ఎక్స్ఎల్100 ఇది వరకు లభించే రెడ్, గ్రీన్, గ్రే, బ్లూ మరియు బ్లాక్ కలర్ ఆప్షన్లకు కొనసాగింపుగా సరికొత్త పర్పుల్ పెయింట్ స్కీమ్ పరిచయం చేశారు.

టీవీఎస్ ఎక్స్ఎల్100 ఐటచ్

కొత్తగా విడుదలైన టీవీఎస్ ఎక్స్ఎల్ ఐ-టచ్ మోపెడ్‌లో 99సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. సింగల్-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఈ ఇంజన్ గరిష్టంగా 4.3బిహెచ్‌‌పి పవర్ మరియు 6.5ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 ఐటచ్

టీవీఎస్ ఎక్స్ఎల్100 మోపెడ్ గరిష్ట వేగం గంటకు 60కిలోమీటర్లుగా ఉంది మరియు దీని మైలేజ్ లీటరుకు 67కిలోమీటర్లుగా ఉంది. ఇందులో ముందువైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున ట్విన్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్వర్లు ఉన్నాయి.

టీవీఎస్ ఎక్స్ఎల్100 ఐటచ్

ఎక్స్ఎల్100 మోపెడ్‌లో రెండు చక్రాలకు డ్రమ్ బ్రేకులు అందివ్వడం జరిగింది. టీవీఎస్ ఎక్స్ఎల్100 మొత్తం బరువు 80కిలోలుగా ఉంది. కానీ, ఈ బరువును ఏ మాత్రం లెక్కజేయకుండా అద్బుతమైన పనితీరును కనబరుస్తుంది. దీంతో పల్లెటూళ్లలో మంచి సక్సెస్ సాధించింది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 ఐటచ్

టీవీఎస్ ఎక్స్ఎల్100 ఐ-టచ్ వేరియంట్ ధర హెవీ డ్యూటీ వేరియంట్ కంటే రూ. 2,450 లు ఎక్కువగా మరియు కంఫర్ట్ వేరియంట్ కంటే రూ. 3,350 లు అధికంగా ఉంది. టీవీఎస్ మోటార్ కంపెనీ ఈ వేరియంట్‌ను తొలుత ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్‌లో ప్రవేశపెట్టింది. మలి దశలో దేశవ్యాప్తంగా అందుబాటులోక తీసుకురానుంది.

టీవీఎస్ ఎక్స్ఎల్100 ఐటచ్

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఇండియాలోని బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్లలో టీవీఎస్ ఎక్స్ఎల్100 ఒకటి. ఈ మోపెడ్‌ను గ్రామీణ మార్కెట్ మరియు బిజినెస్ లక్ష్యంగా ప్రవేశపెట్టారు. టీవీఎస్ ఎక్స్ఎల్100 ఆశించినదానికంటే ఎక్కువ పనితీరును ప్రదర్శిస్తుంది. ఈ భారతదేశపు బెస్ట్ సెల్లింగ్ టూ వీలర్ ఇప్పుడు బడ్జెట్ ధరలో మరిన్ని అద్భుతమైన ఫీచర్లు మరియు నూతన కలర్ స్కీమ్‌లో లాంచ్ అయ్యింది.

Most Read Articles

English summary
Read In Telugu: TVS XL 100 i-Touch Start Launched In India; Priced At 36,109
Story first published: Thursday, July 5, 2018, 11:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X