2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

శరవేగంగా వృద్ది చెందుతున్న టూ వీలర్ల మార్కెట్లోకి జూలై మాసం వేదికగా పలు ద్విచక్ర వాహన తయారీ సంస్థలు కొత్త బైకులు మరియు స్కూటర్లను లాంచ్ చేయడానికి ప్రణాళిక ప్రకారం ముందుగానే విడుదల తేదీలను ప్రకటించాయి.

By Anil Kumar

జూలై నెల ప్రారంభంతో ఈ ఏడాది సెకండ్ ఇన్నింగ్ మొదలయ్యింది. పలు టూ వీలర్ల కంపెనీలు నూతన మోడళ్లను విడుదల చేసి, విపణిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమవుతున్నాయి. వైవిధ్యభరిత సంసృతి గల భారత్‌లో ప్రతి ఏడాది రెండవ సగ భాగం నుండి పండుగ సీజన్ ప్రారంభం అవుతుంది.

2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ కొత్త మోడళ్ల విడుదలను ప్రతి ఏటా మలిసంగంలోనే ఉండేలా చూసుకుంటాయి. శరవేగంగా వృద్ది చెందుతున్న టూ వీలర్ల మార్కెట్లోకి జూలై మాసం వేదికగా పలు ద్విచక్ర వాహన తయారీ సంస్థలు కొత్త బైకులు మరియు స్కూటర్లను లాంచ్ చేయడానికి ప్రణాళిక ప్రకారం ముందుగానే విడుదల తేదీలను ప్రకటించాయి.

జూలై 2018లో ఇండియన్ మార్కెట్లోకి విడుదలవుతున్న బైకులు మరియు స్కూటర్ల గురించి పూర్తి వివరాలు క్లుప్తంగా...

2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

4. సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125

దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమలో స్కూటర్ల మార్కెట్ భారీ వృద్దిని నమోదు చేసుకుంటోంది. ఒక రకంగా చెప్పాలంటే సేల్స్ పరంగా స్కూటర్లు బైకులతో పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో స్కూటర్ల మార్కెట్లోని అగ్రగామి సంస్థ హోండాను ఢీకొట్టేందుకు సుజుకి టూ వీలర్స్ సరికొత్త బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ను దేశీయ విపణిలోకి ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

డిజైన్ మరియు ఫీచర్ల పరంగా సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్ మిగతా ఇండియన్ స్కూటర్లతో పోల్చుకుంటే చాలా విభిన్నంగా ఉంటుంది. అంతర్జాతీయ విపణిలోకి లభ్యమవుతున్న ఈ మోడల్‌ను యూరోపియన్ మార్కెట్ నుండి ప్రత్యేకంగా ఇండియన్ మార్కెట్ కోసం తీసుకొచ్చారు.

2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

ఫీచర్ల పరంగా చూస్తే, ఇందులో ఎల్‌సీడీ ఇంస్ట్రుమెంట్ కన్సోల్, సరికొత్త ఎగ్జాస్ట్ మఫ్లర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, 12వోల్ట్ ఛార్జింగ్ సాకెట్, ట్యూబ్ లెస్ టైర్లు, అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఎత్తైన ఫ్రంట్ విండ్ షీల్డ్ మరియు అత్యంత సౌకర్యవంతమైన మరియు స్టైలిష్ స్టెప్-అప్ సీటు వంటి ఫీచర్లు ఉన్నాయి.

2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

సాంకేతికంగా సరికొత్త సుజుకి బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ 125 స్కూటర్‌ 125సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ ఇంజన్‌తో రానుంది. సుజుకి యాక్సెస్ 125లో ఉన్న ఇదే ఇంజన్ గరిష్టంగా బిహెచ్‌పి పవర్ మరియు ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, టీవీఎస్ ఎన్‌టార్క్ 125, హోండా గ్రాజియా మరియు అప్రిలియా ఎస్ఆర్ 125 మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

  • విడుదల తేదీ: జూలై 19, 2018
  • ధర అంచనా: రూ. 65,000 నుండి
  • 2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

    3. హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్

    భారతదేశపు మరియు ప్రపంచపు అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎంట్రీ లెవర్ కమ్యూటర్ మోటార్ సైకిల్ సెగ్మెంట్లో తిరుగులేని ఫలితాలు సాధిస్తోంది. అయితే, ఖరీదైన మరియు పర్ఫామెన్స్ విభాగంలో రాణించలేకపోతోంది. ఈ నేపథ్యంలో 200సీసీ ఇంజన్ రేంజిలో సరికొత్త పర్ఫామెన్స్ బైకును ప్రవేశపెట్టేందుకు పూర్తి స్థాయిలో సిద్దమైంది.

    2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

    హీరో మోటోకార్ప్ తమ సరికొత్త ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ బైకును ఈ ఏడాది ప్రారంభంలో ఢిల్లీ వేదికగా జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. సాంకేతికంగా ఇందులో 200సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే 2-వాల్వ్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 18.1బిహెచ్‌పి పవర్ మరియు 17.1ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

    2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

    హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ ఇదే సెగ్మెంట్లో అత్యంత శక్తివంతమైన బైకు కాకపోయినప్పటికీ, ఇందులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు అప్-రైట్ రైడింగ్ పొజిషన్ ఉంది. ఎల్ఈడీ టెయిల్ లైట్ మరియు 8 దశలలో అడ్జెస్ట్ చేసుకునే వీలున్న మోనోషాక్ అబ్జార్వర్ ఉంది.

    2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

    హీరో ఎక్స్‌ట్రీమ్ 200ఆర్ పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, ఎంట్రీ లెవల్ పర్ఫామెన్స్ బైకుల సెగ్మెంట్లో ఉన్న బజాజ్ పల్సర్ ఎన్ఎస్200, టీవీఎస్ అపాచే ఆర్‌టిఆర్ 200 4వి బైకులతో పాటు సుజుకి జిక్సర్, హోండా సీబి హార్నెట్ 160ఆర్ వంటి మోడళ్లకు కూడా గట్టి పోటీనిస్తుంది.

    • విడుదల తేదీ: జూలై 2018లో (ప్రకటించాల్సి ఉంది)
    • ధర అంచనా: రూ. 85,000 - 90,000 మధ్య
    • 2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

      2. బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్

      ఇండియా మొత్తం బిఎమ్‌డబ్ల్యూ జి310 ఆర్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న తరుణంలో బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ జి310 ఆర్ నేక్డ్ స్ట్రీట్ ఫైటర్ విడుదలను ఖాయం చేసింది. దీనిని తొలుత 2015 చివర్లో తొలిసారిగా ఆవిష్కరించింది. అత్యంత సరసమైన ఈ బైకును బిఎమ్‌డబ్ల్యూ-టీవీఎస్ ఉమ్మడి భాగస్వామ్యం అభివృద్ది చేసింది.

      2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

      దాదాపు మూడు సంవత్సరాలు నిరీక్షణ అనంతరం బిఎమ్‍‌డబ్ల్యూ మోటోరాడ్ యొక్క అత్యంత సరసమైన బడ్జెట్ ఫ్రెండ్లీ బైకు ఇండియా విడుదలను ఖరారు చేసింది. బిఎమ్‌డబ్ల్యూ శ్రేణిలో అతి తక్కువ ధరలో విడుదలవుతున్న దీనిని తమిళనాడులోని హోసూరులో ఉన్న టీవీఎస్ ప్రొడక్షన్ ప్లాంటులో ఉత్పత్తి చేస్తోంది.

      2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

      సాంకేతికంగా ఇందులో 313సీసీ కెపాసిటి గల లిక్విడ్ కూల్డ్ సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. 6-స్పీడ్ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 34బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యుస్ చేస్తుంది.

      2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

      జర్మన్ దిగ్గజ దేశీయంగా ప్రవేశపెట్టనున్న అత్యంత సరసమైన పర్ఫామెన్స్ బైకులో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్ మరియు వెనుక వైపున మోనో షాక్ అబ్జార్వర్, రెండు చక్రాలకు డిస్క్ బ్రేకులను అందించింది. సేఫ్టీ పరంగా ఏబిఎస్ టెక్నాలజీని తప్పనిసరి ఫీచర్‌గా అందిస్తోంది. ఇంకా ఎన్నో ఖరీదైన విడి భాగాలను కూడా జోడించారు.

      2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

      బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ ఈ జి310 ఆర్ బైకు విడుదలను జూలై 18, 2018 న ఖరారు చేసింది. దీని మీద దేశవ్యాప్తంగా ఉన్న బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ విక్రయ కేంద్రాలలో బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ఇది పూర్తి స్థాయిలో విపణిలోకి విడుదలైతే, కెటిఎమ్ 390 డ్యూక్, బెనెల్లీ టీఎన్‌టీ 300 మరియు ఈ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

      • విడుదల తేదీ: జూలై 18, 2018
      • ధర అంచనా: రూ. 2.5 - 3 లక్షల మధ్య
      • 2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

        1. బిఎమ్‌డబ్ల్యూ జి310 జిఎస్

        బిఎమ్‌డబ్ల్యూ అదే జి310 ఆర్ ఆధారంగా జి310 జిఎస్ అడ్వెంచర్ టూరింగ్ వెర్షన్ బైకును కూడా ఆవిష్కరించింది. ఇందులో కూడా అదే 313సీసీ కెపాసిటి గల ఇంజన్ ఉంది. బిఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ లైనప్‌లో పెద్ద వెర్షన్ జిఎస్ అడ్వెంచర్ డిజైన్ లక్షణాలతో జి310 జిఎస్ బైకును డెవలప్ చేసింది.

        2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

        లాంగ్ ట్రావెల్ ఉన్న సస్పెన్షన్ మరియు అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మినహాయిస్తే, ఇంజన్, సాంకేతిక అంశాలు మరియు మెకానికల్ పరంగా జి310 జిఎస్ మరియు జి310 ఆర్ రెండు ఒక్కటే. అయితే, ఇందులో పలు అడ్వెంచర్ మరియు టూరింగ్ ఫీచర్లు ఉన్నాయి.

        2018 జూలై నెలలో విడుదలవుతున్న కొత్త బైకులు మరియు స్కూటర్లు

        బిఎమ్‌డబ్ల్యూ జి10 జిఎస్ అడ్వెంచర్ టూరింగ్ వెర్షన్ విపణిలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, కవాసకి వెర్సేస్ ఎక్స్-300 మరియు అప్‌కమింగ్ కెటిఎమ్ 390 అడ్వెంచర్ వంటి మోడళ్లకు గట్టి పోటీనిస్తుంది.

        • విడుదల తేదీ: జూలై 18, 2018
        • ధర అంచనా: రూ. 3 - 3.5 లక్షల మధ్య

Most Read Articles

English summary
Read In Telugu:Upcoming Two-Wheeler Launches In July, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X