మార్కెట్లోకి సరికొత్త పియాజో వెస్పా నొట్టె స్కూటర్ విడుదల
పియాజియో తమ వెస్పా స్కూటర్‌ను మరో నూతన వేరియంట్లో లాంచ్ చేసింది. వెస్పా యొక్క కొత్త వేరియంట్ "వెస్పా నొట్టె" మరియు దీనిని వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ ఆధారంగా అభివృద్ది చేసారు. సరికొత్త వెస్పా నొట్టె
ప్రముఖ వాహన తయారీ దిగ్గజం పియాజియో తమ వెస్పా స్కూటర్‌ను మరో నూతన వేరియంట్లో లాంచ్ చేసింది. వెస్పా యొక్క కొత్త వేరియంట్ "వెస్పా నొట్టె" మరియు దీనిని వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ ఆధారంగా అభివృద్ది చేసారు. సరికొత్త వెస్పా నొట్టె స్కూటర్ ధర రూ. 70,285 ఎక్స్-షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.

వెస్పా కంపెనీ విపణిలోకి సరికొత్త వెస్పా నొట్టె స్కూటర్‌ను విడుదల చేసిందని మరియు రూ. 2,000 టోకన్ చెల్లించి ముందస్తు బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించామని వెస్పా డీలర్లకు డ్రైవ్‌స్పార్క్ తెలుగుకు స్పష్టం చేశారు. వెస్పా నొట్టె స్కూటర్‌ను 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో మొదటిసారిగా ఆవిష్కరించారు.

నొట్టె అనగా ఇటాలియన్ పదజాలంలో చీకటి అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే వెస్పా నొట్టె పూర్తిగా బ్లాక్ కలర్ బాడీ పెయింట్ థీమ్‌లో ఉంది. వెస్పా నొట్టె మ్యాట్ బ్లాక్ కలర్ ఫినిషింగ్ కలదు అదనంగా క్రోమ్ పరికరాలు మరియు అల్లాయ్ వీల్స్ కూడా బ్లాక్ కలర్ ఫినిషింగ్‌లో ఉన్నాయి. ఓవరాల్‌గా సాధారణ వెస్పాతో పోల్చుకుంటే ఇది చాలా విభిన్నంగా ఉంది.

సాంకేతికంగా వెస్పా నొట్టె స్కూటర్‌లో 125సీసీ కెపాసిటి గల గాలితో చల్లబడే సింగల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు, సీవీటీ గేర్‌బాక్స్ అనుసంధానం గల ఇది గరిష్టంగా 9.5బిహెచ్‌పి పవర్ మరియు 9.9ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

వెస్పా నొట్టె స్కూటర్‌ను అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయిస్తున్నారు. అయితే, ఇండియన్ మోడల్‌తో పోల్చుకుంటే ఇంటర్నేషనల్ వెస్పా నొట్టె పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇండియన్ వెర్షన్ వెస్పా నొట్టె వేరియంట్‌ను వెస్పా ఎల్ఎక్స్125 స్కూటర్ ఆధారంగా రూపొందించారు. డిజైన్ మరియు మెకానికల్ పరంగా రెండు స్కూటర్లలో ఎలాంటి వ్యత్యాసం లేదు.

వెస్పా నొట్టె స్కూటర్‌లో ముందు వైపున టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ మరియు వెనుక వైపున హైడ్రాలిక్ షాక్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంది. బ్రేకింగ్ విధులు నిర్వర్తించేందుకు ముందు వైపున 150ఎమ్ఎమ్ డ్రమ్ అదే విధంగా వెనుక వైపున 140ఎమ్ఎమ్ డ్రమ్ బ్రేక్ అందించారు.

వెస్పా నొట్టె మొత్తం బరువు 114కిలోలు మరియు దీని గ్రౌండ్ క్లియరెన్స్ 155ఎమ్ఎమ్ వరకు ఉంది. వెస్పా నొట్టె గరిష్టంగా గంటకు 100కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు మరియు 7-లీటర్ల సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్ ఉంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!
వెస్పా నొట్టె స్కూటర్ వెస్పా ఎల్ఎక్స్ 125 స్కూటర్ యొక్క నూతన వేరియంట్ మరియు ఇది పూర్తిగా బ్లాక్ కలర్ పెయింట్ స్కీమ్‌లో లభ్యమవుతోంది. స్కూటర్లకు అత్యధిక ఆదరణ ఉన్న ఇండియన్ మార్కెట్లో రెట్రో డిజైన్ స్టైల్ మరియు ఆల్-బ్లాక్ పెయింట్ థీమ్‌లో ఉన్న వెస్పా నొట్టె కొనుగోలుదారులను ఖచ్చితంగా ఆకర్షిస్తుంది.

వెస్పా నొట్టె స్కూటర్ విపణిలో ఉన్న టీవీఎస్ ఎన్‌టార్క్ 125, హోండా గ్రాజియా మరియు అప్రిలియా ఎస్ఆర్ 125 వంటి మోడళ్లకు గట్టి పోటీనివ్వనుంది.


Click it and Unblock the Notifications








